News


గ్యాప్‌అప్‌...నిఫ్టీ 11,600పైన ప్రారంభం

Monday 15th July 2019
Markets_main1563162143.png-27052

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రికార్డు 5 శాతం లాభంతో ప్రారంభంకావడంతో సోమవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 278 పాయింట్ల లాభంతో 39,015 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,615 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్‌ వెల్లడించిన ఫలితాలతో పాటు ఆదాయం గైడెన్స్‌ పెంచిన ప్రభావంతో ఆ షేరు తాజాగా 5 శాతం లాభంతో రూ.763 వద్ద మొదలయ్యింది. మరోవైపు సన్‌ఫార్మా 3 శాతం పెరగ్గా, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌లాబ్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. హీరో మోటోకార్‌‍్ప, ఎల్‌ అండ్‌ టీలు 1.5 శాతం నష్టాలతో మొదలయ్యాయి. 



You may be interested

స్వల్పంగా తగ్గిన చమురు

Monday 15th July 2019

అతి పెద్ద చమురు దిగుమతిదారైన చైనా గత 27 ఏళ్లలో అతి తక్కువ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ రేటును ప్రకటించనుందనే అంచనాల నేపథ్యంలో ఆయిల్‌ ధరలు స్వల్పం‍గా తగ్గాయి. చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం వలన చైనా జీడిపీ రేటు మందగించింది.  బ్రెంట్‌ క్రూడ్‌ సెప్టెంబర్‌ ప్యూచర్‌ ధర 6 సెంటులు తగ్గి బ్యారెల్‌ 66.66 డాలర్లకు, అమెరికా క్రూడ్‌ అగష్టు ప్యూచర్‌ 5 సెంటులు తగ్గి బ్యారెల్‌ 60.16

టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ జూన్‌లో ఏం కొన్నాయి...?

Sunday 14th July 2019

ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రతీ నెలా వివిధ పథకాల పరిధిలో తమ పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. సెబీ నిబంధనలు  ఈ మేరకు నిర్దేశిస్తున్నాయి. ఆయా గణాంకాల ‍ప్రకారం జూన్‌ నెలలో టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) కొనుగోలు చేసిన, విక్రయించిన స్టాక్స్‌ వివరాలు ఇవి...   హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈ సంస్థ నిర్వహణలో 22 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 35 శాతం,

Most from this category