గ్యాప్‌డౌన్ ఓపెనింగ్
By Sakshi

ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భారీగా పెరగడంతో భారత్ స్టాక్ సూచీలు సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో 37,205 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,995 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. సౌదీ అరేబియలో రెండు చమురు ఉత్పాదక కేంద్రాలపై గత శనివారం టెర్రరిస్టులు...ద్రోణులతో జరిపిన దాడుల ప్రభావంతో సౌదీ చమురు ఉత్పాదక సామర్థ్యం 50 శాతం తగ్గుతుందని, తద్వారా చమురు ఎగుమతులు 5-6 శాతం వరకూ తగ్గవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లో చమురు ధర ఒక్కసారిగా 20 శాతం ఎగిసింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే ఇండియాపై చమురు ధర పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపించవచ్చన్న భయాలతో భారత్ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి.
You may be interested
ఐపీఓ.. అంతంత మాత్రమే !
Monday 16th September 2019ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్ తగ్గిన ఐపీఓల జోరు 11 కంపెనీలు.. 10,300 కోట్ల సమీకరణ రానున్న మూడు నెలల్లో అరకొరగానే ఐపీఓలు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ అంతంతమాత్రంగానే ఉండటం ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. గత ఏడాది మొత్తం 24 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్ల నిధులు సమీకరిస్తే, ఈ ఏడాది ఇప్పటివరకూ 11 కంపెనీలు రూ.10,300 కోట్ల మేర మాత్రమే నిధులను సమీకరించగలిగాయి. ఇక 2017లో మాత్రం ఐపీఓల
ఎథికల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా..?
Monday 16th September 2019ధీరేంద్ర కుమార్ వ్యాల్యూ రీసెర్చ్, సీఈవో ప్ర: ఎథికల్ ఫండ్స్ అంటే ఏమిటి? మన మార్కెట్లో ఈ ఫండ్స్ ఉన్నాయా ? ఈ ఫండ్స్‌లో సామాన్య ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయవచ్చా ? -శైలేంద్ర కుమార్, హైదరాబాద్ జ: ఎథికల్ ఫండ్స్... ఆసక్తిదాయకమైనవే. అయితే భారత్‌లో వీటికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ ఫండ్స్‌కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది. ఆల్కహాల్, పొగాకు, తదితర నైతికం కాని వస్తువులకు సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని ఫండ్స్‌ను