News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌

Friday 22nd November 2019
Markets_main1574416513.png-29790

అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ సంస్థ రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొనుగోలు టార్గెట్‌ను పెంచింది. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కన్జూమర్‌, జియో, రిటైల్‌ వ్యాపారాల్లోని వృద్ధి అప్‌సైడ్‌ ట్రెండ్‌ను నడిపిస్తాయి. అలాగే ప్రస్తుత ధర వద్ద షేరు వ్యాల్యూవేషన్‌ ఆకర్షణీయంగా ఉందని’బ్రోకరేజ్‌ పేర్కొంది. ఈ క్రమంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.1,700 పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌, డేటా చార్జీలను పెంచడంతో తాము కూడా వచ్చే కొద్ది వారాల్లోనే టారీఫ్‌లను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. దేశీ టెలికం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారీఫ్‌లను పెంచనున్నామని రిలయన్స్‌ తెలిపింది. 

దేశీయ విశ్లేషకులు సైతం రిలయన్స్‌ షేరుపై పాజిటివ్‌ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ‘‘టెలికాం రంగంలోని రిలయన్స్‌ అనుబంధ సంస్థ జియోకు మరింత మంది సబ్‌స్క్రైబర్లు జత కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేము షేరుపై ‘‘బుల్లిష్‌’’ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. స్వల్పకాలానికి షేరు టార్గెట్‌ ధరను రూ.1,600గానూ, ధీర్ఘకాలానికి రూ.1800గా పెంచుతున్నాం.’’ అని హెమ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు ఆస్తా జైన్‌ తెలిపారు. ఏడాదిలో ఇప్పటికి ఈ షేరు 41శాతం వరకు ర్యాలీ చేసింది. షేరు భారీగా ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10లక్షల కోట్లకు చేరువయ్యింది. ఈవారంలో బుధవారం రిలయన్స్‌ రూ.9.80లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను నమోదు చేసింది. 


నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1543.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ పెంపుతో షేరు ఇంట్రాడేలో 2శాతం లాభపడి రూ.1569.60 స్థాయిని అందుకుంది. మధ్యాహ్నం 3:00లకు షేరు క్రితం ముగింపు ధర (రూ.1537.25)తో పోలిస్తే అరశాతం లాభంతో రూ.1555 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.1017.00లు, రూ.1571.85లుగా ఉన్నాయి. 
 



You may be interested

ఫార్మా, వినియోగం, ఆటో రంగాలకు దూరం!

Friday 22nd November 2019

‘బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మేం దృష్ఠి సారించిన ఒకేఒక లార్జ్‌క్యాప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌’ అని యస్‌ సెక్యురిటీస్‌ జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ, ప్రశాంత్‌ ప్రభాకర్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. ఫార్మాకు దూరం..  సమీపకాలంలో ఫార్మా సెక్టార్‌కూ దూరంగా ఉండాలని సలహాయిస్తున్నాం.  దీనితో పాటు ఆటో, వినియోగ రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఫార్మా సెక్టార్‌లో  మార్జిన్‌ ఒత్తిళ్లు కాకుండా యూఎస్‌ ఎఫ్‌డీఏ నియంత్రణలు అతి

ఎన్‌టీపీసీపై మోర్గాన్‌స్టాన్లీ, సిటి బుల్లిష్‌

Friday 22nd November 2019

అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ, ప్రభుత్వరంగ పవర్‌ దిగ్గజమైన ఎన్‌టీపీసీ షేర్లపై రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘ఓవర్‌ వెయిట్‌’కు నవీకరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 147 నుంచి రూ. 152కు పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 2 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇచ్చిన ఈ టార్గెట్‌ ధర, ప్రస్తుత మార్కెట్‌

Most from this category