News


ఆర్‌ఐఎల్‌కు కొనొచ్చు రేటింగ్‌!

Wednesday 10th April 2019
Markets_main1554883255.png-25052

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ కొనొచ్చు రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ధర రూ. 1500గా పేర్కొంది. గత ఏడాదిలో సూచీల్లో మంచి లాభాలను నమోదు చేసిన లార్జ్‌క్యాప్స్‌లో ఆర్‌ఐఎల్‌ ఒకటి. కేవలం గత మూడు నెలల్లో షేరు 20 శాతం ర్యాలీ జరిపింది. ఏడాది కాలంలో 46 శాతం మేర దూసుకుపోయింది. సంస్థాగత రిటైల్‌ మార్కెట్లోని పెద్ద కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌ ఒకటని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది. గ్రాసరీ విభాగంలో వేగంగా వృద్ధి సాధిస్తోందని పేర్కొంది. రాబోయే మూడేళ్లలో గ్రాసరీ వ్యాపారం 22 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయవచ్చని అంచనా వేసింది. కంపెనీ వ్యాపారంలో రిటైల్‌తో పాటు టెలికం విభాగాల వాటా క్రమంగా ప్రతి త్రైమాసికంలో పెరుగుతూ వస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో షేరును లాంగ్‌టర్మ్‌కు సిఫార్సు చేసింది. 



You may be interested

6నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Wednesday 10th April 2019

జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వ్యాపారంలో వృద్ధితో మాతృసంస్థ టాటామోటర్స్‌ మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో కంపెనీ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 6నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ. 206.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతివ్వడంతో షేరు 4.50శాతం ర్యాలీ చేసి రూ.212.40ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది అక్టోబర్‌ 10 తరువాత షేరు ధర ఈ స్థాయిని తిరిగి అందుకోవడం

లక్ష్యానికి రూ.50,000 కోట్ల దూరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు!

Wednesday 10th April 2019

- లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు - వసూలయ్యేది రూ.11.30 లక్షల కోట్లే! - 2018-19పై అంచనాలు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు గడచని ఆర్థిక సంవత్సరం (2018-19) లక్ష్యాలకు రూ.50,000 కోట్ల లోటుతో ముగిసే అవకాశం ఉందని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. లక్ష్యం రూ.12 లక్షల కోట్లుకాగా, ఇది రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయే అవకాశం ఉందని అయన విశ్లేషించారు. నిజానికి 2018-19 నాటి బడ్జెట్‌లో

Most from this category