News


ఎస్‌బీఐ రేటింగ్‌ తగ్గించిన హెచ్‌ఎస్‌బీసీ

Tuesday 10th March 2020
Markets_main1583827327.png-32390

  • టార్గెట్‌ ధర రూ.405 నుంచి రూ.300కు కుదింపు

ముంబై:  ‍ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేరు రేటింగ్‌ను కుదించింది. యస్‌బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు ఇందుకు కారణమని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. గతంలో తాము ఎస్‌బీఐ షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘హోల్డ్‌’’కు సవరించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.405 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. యస్‌బ్యాంక్‌లో 49శాతం వాటాను కొనుగోలు చేయనున్న నేపథ్యంలో ఎస్‌బీఐకు రైటాఫ్‌, ఇతర రీక్యాపిటలైజేషన్‌ కోసం రూ.12,600 కోట్ల మూలధన నిధులు అవసరమతాయని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన ‘‘విత్‌డ్రాయిల్‌ పరిమితి’’ని ఎత్తివేసిన తర్వాత ఇన్వెస్టర్ల తీరు ప్రమాదకరంగా ఉండొచ్చు. ఇన్వెస్టర్లు భారీ ఎత్తున డిపాజిట్లను ఉపసంహరించుకుంటే యస్‌బ్యాంక్‌లో ద్రవ్య సంక్షోభం మరింత ముదరవచ్చు. ఫలితంగా గత్యంతరం లేక ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌ను విలీనమయ్యే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేస్తుంది. ప్రతిపాదిత ఏటీ1 రైటాఫ్‌ బాండ్లు విస్తృత రంగంలో చిక్కులను కలిగించవచ్చని హెచ్‌ఎస్‌బీసీ భావిస్తోంది. 



You may be interested

మార్కెట్లను భయాలు ఆడిస్తున్నాయ్‌!

Tuesday 10th March 2020

ఇకపైనా ఆటుపోట్లు తప్పకపోవచ్చు పతనానికి అంతెక్కడ అన్నది చెప్పలేం ఆందోళనలతో అమ్మకాలు కరెక్టు కాదు - అతుల్‌ సూరి, మారథాన్‌ ట్రెండ్‌ పీఎంఎస్‌  ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ల బాటమ్‌ ఎక్కడ అని ఆలోచించడం అవివేకమంటున్నారు మారథాన్‌ ట్రెండ్‌ పీఎంఎస్‌ సీఈవో అతుల్‌ సూరి. మార్కెట్లు స్థిరత్వాన్ని సాధించేవరకూ ఓపిక పట్టవలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో సూరి వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలిద్దాం.. హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ట్రెండ్‌ రివర్స్‌ అవుతుందని భావించడంలేదు. ఇకపై మరిన్ని ఆటుపోట్లకు

విలువలు ఆకర్షణీయం...టాప్‌-10 స్టాక్ సిఫార్సులు ఇవే..!

Tuesday 10th March 2020

కరోనా భయాలు, క్రూడాయిల్‌ పతనంతో  హోలీ ముందు రోజు దలాల్‌ స్ట్రీల్‌ ఎరుపు రంగుతో పోటెత్తింది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు చరిత్రలోనే అతిపెద్ద నష్టాలను చవిచూశాయి. సుమారు రూ.7లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్‌ మహాపతనంతో దలాల్‌ స్ట్రీట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇదే తరుణంలో వాల్యూయేషన్ల్లు ఆకర్షణీయంగా మారడంతో ధీర్ఘకాలిక దృష్ట్యా పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి మార్కెట్‌ పతనంలో భాగంగా

Most from this category