News


సిప్లా రేటింగ్‌ తగ్గించిన హెచ్‌ఎస్‌బీసీ

Friday 28th February 2020
Markets_main1582872316.png-32162

ప్రముఖ డ్రగ్స్‌ కంపెనీ సిప్లాకు చెందిన అమెరికా వ్యాపార వృద్ధి తగ్గుతున్న కారణంగా ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ హెచ్‌ఎస్‌బీసీ...సిప్లా రేటింగ్‌లో కోత విధించింది. టార్గెట్‌ ధరను 525 నుంచి తగ్గించి 450గా నిర్ణయించింది. కాగా చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు సాయం చేయడానికి భారత్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చైనా నుంచి 6 టన్నుల ఫార్మా ముడిసరుకుని ఇండియాలోని సిప్లా కేంద్ర కార్యాలయానికి కార్గో విమానంలో తరలించేందుకు భారత ప్రభుత్వం సిప్లా కంపెనీకీ సాయం చేయనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌-19 ప్రభావంతో చైనా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియంట్స్‌ కొరత ఏర్పడింది. దీంతో చైనానుంచి 6 టన్నుల ఫార్మా ముడి పదార్థాలను తీసుకొచ్చేందుకు ఎయిర్‌లైన్స్‌ ఒప్పుకుంది.



You may be interested

వృద్ధి భయాలతో మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Friday 28th February 2020

మెటల్‌ షేర్లలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 6.50శాతం నష్టాన్ని చవిచూసింది. కరోనా భయాలతో అంతర్జాతీయ వృద్ధి మందగమన భయాలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనాలో కరోనా వైరస్‌ వ్యాధితో మెటల్ వినియోగం తగ్గుముఖం పట్టడంతో అం‍తర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. నేడు ఈ ఇండెక్స్‌

మార్కెట్లోకి హీరో BS-VI సూపర్‌ స్ల్పెండర్‌

Friday 28th February 2020

టూవీలర్ల మార్కెట్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ గురువారం సూపర్‌ స్ల్పెండర్‌ BS-VI  కాంప్లియంట్‌​ వెర్షన్‌ను  మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.67,300గా నిర్ణయించింది. 125 సీసీ ఇంజన్‌ కలిగిన ఈ బైకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. గత వెర్షన్‌తో పోలిస్తే కొత్త బైకులు 19 శాతం అధిక సామర్థ్యంతో రూపొందినట్లు కంపెనీ వెల్లడించింది. 125 సీసీ ఇంజిన్‌తోపాటు, ప్రోగ్రామ్డ్‌ ప్యూయల్‌ ఇంజెక్షన్‌ 10.73 బీహెచ్‌పీ సామర్థ్యం వీటి

Most from this category