News


లాభాల్లో పెట్రో షేర్లు...హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్ల ర్యాలీ

Thursday 26th September 2019
Markets_main1569475208.png-28562

గరిష్ట స్థాయిలకు చేరుకున్న చమురు ధరలు గత కొన్ని సెషన్‌ల నుంచి పడిపోతుండడంతో దేశీయ ఇంధన కంపెనీ షేర్లు గురువారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు తగ్గడంతో  హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌) షేరు ఉదయం 10.35 సమయానికి  5.22 శాతం లాభపడి రూ. 300.30 వద్ద, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) 4.87 శాతం లాభపడి రూ. 147.55 వద్ద, ఓన్‌జీసీ 2.05 శాతం లాభపడి రూ. 134.15 వద్ద ట్రేడవుతున్నాయి. అదేవిధంగా డిజ్విన్వెస్ట్‌మెంట్‌ అంచనాల నేపథ్యంలో గత కొన్ని సెషన్‌ల నుంచి పెరుగుతూ వస్తున్నా బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం) షేర్లు గురువారం ట్రేడింగ్‌లో కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీ షేరు 2.36 శాతం లాభపడి రూ. 476.20 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

స్వల్ప లాభాల్లో చమురు !

Thursday 26th September 2019

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేదాలను తొలగించేందుకు ఒక రిజల్యూషన్‌ అనుకున్న సమయం కంటే ముందే రానుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో​ గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న చమురు సరఫరా ఒత్తిళ్లను, అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలను తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.05 శాతం లాభపడి బారెల్‌ 61.46 డాలర్ల

ఎగిసి పడిన పసిడి..!

Thursday 26th September 2019

ప్రపంచమార్కెట్లో నిన్న రాత్రి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర భారీగా ఎగసి అంతే స్థాయిలో పతనమైంది. ఉదయం అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలపై సందిగ్ధతతో పాటు అమెరికాలో తలెత్తిన రాజకీయ వివాదంతో పసిడి ధర  ఒకదశలో 1,542.55 డాలర్ల వద్ద గరిష్టస్థాయి అందుకుంది. అయితే రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూల వ్యాఖ్యలు, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ చేయడంతో పసిడి ఉదయం ఆర్జించిన లాభాలన్ని తుడిచిపెట్టుకు పోయాయి. రాత్రి చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని

Most from this category