News


పెట్రో మార్కెటింగ్‌ షేర్లకు చమురు సెగ!

Monday 16th September 2019
Markets_main1568616992.png-28401

  • 7శాతం క్షీణించిన షేర్లు

పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. సౌదీ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల భారీగా పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ పతనం ఇందుకు కారణమవుతున్నాయి. చమురు ధరలు పెరిగితే.. మార్జిన్లు క్షీణించే అవకాశముండటంతో ఇన్వెస్టర్లు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపతున్నారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లాంటి పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు 7శాతం వరకు క్షీణించాయి. 
బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.388.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 6.60శాతం నష్టపోయి రూ.381.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:40ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.408.55)తో పోలిస్తే 6.25శాతం నష్టంతో రూ.382.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌ 5 లూజర్లలో మొదటిస్థానంలో కొనసాగుతున్నాయి.
ఐఓసీ:- నేడు బీఎస్‌ఈలో రూ.126.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 4.18శాతం నష్టపోయి రూ.124.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:40ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.130.10)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.126.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌ 5 లూజర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ కొనసాగుతున్నాయి.
హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.260.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 7.06శాతం నష్టపోయి రూ.252.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.12:00ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.271.15)తో పోలిస్తే 6.51శాతం నష్టంతో రూ.253.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.1,189.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3.22శాతం నష్టపోయి రూ.1186.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.12:00ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1225.60)తో పోలిస్తే 1 శాతం నష్టంతో రూ.1,214.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,016.40, రూ.1,417.50లుగా నమోదయ్యాయి. ఈ కంపెనీకి పెట్రో రిటైల్‌ స్టేషన్లు పరిమితంగా వున్నాయి.



You may be interested

నష్టాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Monday 16th September 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు సోమవారం భారీ పతననాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌  2,487.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ రంగ షేర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడేలో 1.65శాతం మేర నష్టపోయి 2,470.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:20ని.లకు

క్రూడ్ దెబ్బ..దేశీయ ఈక్విటీల పరిస్థితేంటీ?

Monday 16th September 2019

  గత వారాంతం‍లో సౌదీ అరేబియా ఆయిల్‌ రిఫైనరీలపై డ్రోణ్‌ దాడి జరగడంతో, రాత్రికిరాత్రే సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇది దేశియ ఈక్విటీ మార్కెట్‌లతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లపై స్వల్ప కాలం వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు తెలిపారు. కాగా ఇండియాకు, చమురు దిగుమతులకు మధ్య ప్రతికూల సంబంధం ఉండడంతో చమురు ధరలు పెరిగితే ఇండియా దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఫలితంగా దేశ

Most from this category