News


ఈ కంపెనీలను నమ్ముకుంటే.. లాభాలు గ్యారంటీ?

Wednesday 3rd July 2019
Markets_main1562176205.png-26774

ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల సమీపానికి మరోసారి చేరువ అవుతున్నాయి. ఎంపిక చేసిన బ్లూచిప్‌ కౌంటర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు తీయిస్తున్నాయి. నిఫ్టీ ప్యాక్‌లో కేవలం 20 స్టాక్స్‌ 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు 10 శాతం రాబడులను ఇచ్చాయి. కానీ, అదే సమయంలో నిఫ్టీలోని మరో 24 కంపెనీలు మాత్రం ఇప్పటి వరకు 67 శాతం పడిపోయాయి. కాగా, ఈ విధమైన పోలరైజేషన్‌ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు కొనసాగుతుందని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ సీఐవో సౌరభ్‌ ముఖర్జియా అన్నారు. 

 

ఈక్విటీ మార్కెట్లు ఈ దశ నుంచి బయటకు రావాలంటే వృద్ధి ఆధారిత వాతావరణం అవసరమని సౌరభ్‌ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ‘‘కాస్ట్‌ ఆఫ్‌ క్యాపిటల్‌ (నిధుల వ్యయాలు) తగ్గాల్సి ఉంది. అయితే, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు జరుగుతుందని భావించడం లేదు. కొన్ని కంపెనీల ఆధిపత్యంపైనే ఆధారపడి షేరు రాబడులు అన్నవి కొంత కాలం పాటు కొనసాగుతాయి’’ అని ముఖర్జియా పేర్కొన్నారు. దలాల్‌ స్ట్రీట్‌లో దీర్ఘకాలానికి మల్టీబ్యాగర్లను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడంలో ముఖర్జియా అనుభవజ్ఞులు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో తన పెట్టుబడుల విధానంపై ఆయన మాట్లాడుతూ... నగదు ప్రవాహనాలను సృష్టించే నాణ్యమైన కంపెనీలపై తన టీమ్‌ దృష్టి పెడుతుందన్నారు. 

 

పోటీ పరంగా మరో కంపెనీ ఢీకొట్టలేని అనుకూలతలు కలిగిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని ముఖర్జియా ఇన్వెస్టర్లకు సూచించారు. జీడీపీ తగ్గుముఖం పట్టడం, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సర్దుబాటు వంటి ప్రభావాలకు ఈ తరహా కంపెనీలు ప్రభావితం కావని తెలిపారు. రిలాక్సో ఫుట్‌వేర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, డాక్టర్‌ లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌ ఈ తరహా కంపెనీలుగా సూచించారు. తనకు, తన క్లయింట్లకు ఈ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్టు వెల్లడించారు. ఆయా విభాగాల్లో అగ్రగామిగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని సూచించారు. బలహీన బ్యాలన్స్‌ షీట్లు ఉన్న హైబీటా స్టాక్స్‌ను వెంటపడి పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. You may be interested

లాభాల ప్రారంభం

Thursday 4th July 2019

 ఆసియా మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నా, రేపు కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం భారత్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ఆరంభంకావడం వరుసగా ఇది నాలుగో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88 పాయింట్ల పెరుగుదలతో 39,917 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,928 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. టాటా స్టీల్‌, సిప్లా, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌లు స్వల్పలాభాలతో మొదలుకాగా, టైటాన్‌ ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కోలు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. అమెరికా

ఈ స్టాక్స్‌లో రాబడుల ‘వర్షం’...!

Wednesday 3rd July 2019

ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు బడ్జెట్‌, రుతుపవనాల ప్రభావం, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం అంశాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. ప్రధానంగా బడ్జెట్‌లో ప్రకటనలు, రుతుపవనాల విస్తరణ, వాటి ప్రభావం మార్కెట్ల గమనాన్ని స్వల్ప కాలానికి నిర్దేశిస్తాయని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రుతుపవనాలు, ప్రభుత్వ సానుకూల ప్రకటనలతో లాభపడే స్టాక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు.    జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 33 శాతం వర్షపాతలోటు నెలకొంది. మధ్య భారతంలో అత్యధికంగా 43.9 శాతం

Most from this category