News


ఎర్నింగ్స్‌ వేళ ఏంచేయాలి?

Saturday 19th October 2019
Markets_main1571477324.png-29008

మార్కెట్‌ నిపుణుల సలహాలు
కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. ఈనేపథ్యంలో ఫలితాల సీజన్‌లో మార్కెట్‌లో ఎలా ప్రవర్తించాలో నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫలితాలకు ముందు అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని, త్రైమాసిక ఫలితాలు స్వల్పకాలిక ట్రెండ్‌ను మాత్రమే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. 
- మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టరైతే ఫలితాలకు ముందు ఒకస్టాకులో ప్రవేశించకుండా ఉండడం మంచిది. ఎర్నింగ్స్‌ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫలితాలు బయటపడేంత వరకు ఆగి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. ఫలితాలు వచ్చాక, వాటిని విశ్లేషించి కంపెనీ పరిస్థితి అర్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు రిస్కు వద్దనుకునే ఇన్వెస్టరై, మీ పోర్టుఫోలియోలో ఉన్న ఒక కంపెనీ ఫలితాలు తప్పక నిరాశాపూరితంగా ఉంటాయన్న నమ్మకం ఉంటే ఫలితాలకు ముందే ఎగ్జిట్‌ కావడం మంచిది. ఫలితాల అనంతరం పూర్తి విశ్లేషణ జరిపి కావాలంటే మరలా ఎంటర్‌కావచ్చు. దీంతో పాటు దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టినట్లైతే స్వల్పకాలిక ఒడిదుడుకులు పట్టించుకోకపోవడమే మంచిదని నిపుణుల సలహా. 
- ఒకవేళ మీరు ట్రేడరై, స్వల్పకాలిక ఒడిదుడకులపై రిస్కు తీసుకొని పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎర్నింగ్స్‌ సీజన్‌ మంచి అవకాశం కల్పిస్తుంది. ఎక్కువ మంది అనలిస్టులు ఒక కంపెనీ ఫలితాలపై పాజిటివ్‌గా ఉంటే రిస్కు తీసుకొని ఫలితాలకు కనీసం రెండువారాల ముందు సదరు కంపెనీ షేర‍్లలో లాంగ్స్‌ తీసుకోవచ్చు. ఫలితాల ముందు రోజు ఇలాంటి లాంగ్స్‌నుంచి వైదొలగాలి. ఎందుకంటే ఫలితాలు బాగున్నా అప్పటివరకు ర్యాలీ జరిపినందున సదరు షేరు స్తబ్దుగా ఉండొచ్చు. ఒకవేళ ఫలితాలు బాగాలేకుంటే ఈ రెండు వారాల లాభాలు ఒక్కరోజులో కోల్పోవచ్చు. అదేవిధంగా ఒక కంపెనీ ఫలితాలపై ఎక్కువమంది నెగిటివ్‌గా ఉంటే సదరు షేరులో రెండు వారాల ముందే షార్ట్స్‌ తీసుకొని ఫలితాల ముందు రోజు వైదొలగాలి. ఎందుకంటే ఏమాత్రం చిన్నపాటి పాజిటివ్‌ అంశం ఫలితాల్లో ఉన్నా, షేరు ఒక్కసారిగా అప్‌మూవ్‌ చూపవచ్చు. 



You may be interested

బ్రెగ్జిట్‌ డీల్‌పై నేడు పార్లమెంట్‌లో ఓటింగ్‌

Saturday 19th October 2019

  గత రెండెళ్లుగా బ్రిటన్‌ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసిన బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ ఎగ్జిట్‌...యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డీల్‌పై ..నేడు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఓటింగ్‌ జరగనున్నది.  ఇందుకు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు భారత్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. ఓటింగ్‌ ఫలితంగా సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడవచ్చన్నది అంచనా. 1982 తర్వాత మొదటి సారిగా హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ శనివారం నాడు సమావేశం

తనఖా షేర్ల పరిష్కారమే ‘జీ’ రికవరీకి కీలకం

Saturday 19th October 2019

ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల అంశానికి సంబంధించి సరైన పరిష్కారం దొరకడమే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లలో రికవరీకి కీలకమని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యు2లో కంపెనీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోడంతో పలు బ్రోకరేజ్‌లు షేరు రేటింగ్‌, టార్గెట్‌ ధరలను తగ్గించారు. కంపెనీకి రావాల్సిన మొత్తాలు పేరుకుపోతుండడం, ఇది క్రమంగా ఆపరేటింగ్‌ నగదు ప్రవాహంపై నెగిటివ్‌ ప్రభావం చూపడం.. మరింత ఆందోళనపరిచే అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రుణ సమస్య పూర్తిగా

Most from this category