News


కార్డ్స్‌ ఐపీఓకు ముందు ఎస్‌బీఐ షేరును ఏం చేద్దాం??

Wednesday 26th February 2020
Markets_main1582691424.png-32099

త్వరలో ఐపీఓకి వస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. చాలాబ్రోకరేజ్‌లు వచ్చేనెల ఆరంభంలో వచ్చే ఈ ఆఫర్‌కు సబ్‌స్క్రైబ్‌ చేయమని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఓకు ముందు మాతృసంస్థ ఎస్‌బీఐ షేరులో బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటరని నిపుణులు సూచిస్తున్నారు. రిస్కు తీసుకునే వీలున్న ఇన్వెస్టర్లు ఈ వ్యూహం పాటించవచ్చంటున్నారు. ఈ వ్యూహంలో నష్టం పరిమితంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇందులో ఎస్‌బీఐ 330 స్ట్రైక్‌ప్రైస్‌ కాల్‌ ఒక లాట్‌ను కొనడం, 350 కాల్‌ ఒక లాట్‌ను విక్రయించడం చేస్తారు. మంగళవారం ముగింపు రేట్ల ప్రకారం చూస్తే 330 కాల్‌ కొనుగోలుకు ఒక షేరుకు రూ. 14.3 పడుతుంది.(ఒకలాట్‌లో 3000 షేర్లుంటాయి). 350 కాల్‌ విక్రయంతో ఒక షేరుపై రూ.7 పడుతుంది. దీంతో వ్యూహంలో మొత్తం పెట్టుబడి రూ. 7.3 అవుతుంది. ఎస్‌బీఐ ఎక్స్‌పైరీకి రూ.330 దిగువకు వస్తే వచ్చే గరిష్ఠ నష్టం ఇది. ఒకవేళ షేరు రూ.350 వద్దకు వస్తే వచ్చే గరిష్ఠ లాభం రూ. 12.7 పర్‌ షేరు ఉంటుంది. రూ. 350 దాటిన అనంతరం లాభం తగ్గుతూ పోతుంది(అమ్మిన కాల్‌ మూలంగా). ఎస్‌బీఐకి మార్చి సీరిస్‌లో రూ.310 వద్ద మద్దతు, రూ. 350 వద్ద నిరోధం ఎదురవుతాయని టెక్నికల్‌ నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఈ సీరిస్‌కు పైన చెప్పిన వ్యూహం వర్కవుట్‌ అవుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 



You may be interested

రూ.300 తగ్గిన పుత్తడి!

Wednesday 26th February 2020

కోవిడ్‌-19 ప్రభావంతో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. బుధవారం దేశీ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గి రూ.42,570.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 16 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,642 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

సెన్సెక్స్‌ 350 పాయింట్లు క్రాష్‌..!

Wednesday 26th February 2020

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ అంటువ్యాధి భయాలు మరింత ఉధృతమవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 40,000 దిగువన 39931.20 నిఫ్టీ 100 పాయింట్ల 11,700 వద్ద మొదలయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా తమ దేశ ప్రజలను హెచ్చరించడంతో మంగళవారం రాత్రి ఈ దేశ ఈక్విటీ మార్కెట్లు 3శాతం నష్టాన్ని

Most from this category