News


ఫలితాల ముందు ఇన్ఫీలో ఐరన్‌ ఫ్లై వ్యూహం!

Thursday 9th January 2020
news_main1578545038.png-30793

నిపుణుల సలహా
శుక్రవారం ఇన్ఫోసిస్‌ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కొంచెం రిస్కు తీసుకోదలిచిన ట్రేడర్లు ఐరన్‌ బటర్‌ ఫ్లై షార్ట్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల అనంతరం తీవ్ర కదలికలు ఉండవన్న నమ్మకంతో ఈ వ్యూహం సూచిస్తున్నారు. ఫలితాల తర్వాత ఇన్ఫీ షేరు 60 రూపాయల రేంజ్‌(రూ.690- 750)లో కదలాడినంత కాలం ఈ వ్యూహంతో నష్టం ఉండదు. ఇదే సమయంలో ఐవీలో క్షీణత ఆప్షన్‌ సెల్లర్‌కు లాభదాయకంగా ఉంటుంది. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రాజేశ్‌ పల్వియా, మోతీలాల్‌ ఓస్వాల్‌ అనలిస్టు చందన్‌ తపారియాలు ఈ వ్యూహం సూచిస్తున్నారు. 


వ్యూహంలో భాగంగా రూ. 720 కాల్‌ను, పుట్‌ను విక్రయిస్తారు. ఇదే సమయంలో ఒక 760 కాల్‌ను, 680 పుట్‌ను కొనుగోలు చేస్తారు. ఇన్ఫీ ఆప్షన్‌ లాట్‌ సైజు 1200 షేర్లు. ఈ వ్యూహంలో రిస్కు రివార్డు నిష్పత్తి 2.6:1. వ్యూహంలో ఒక్కో షేరుపై వచ్చే గరిష్ఠ లాభం రూ. 29. జనవరి సీరిస్‌ ముగింపులోపు ఇన్ఫీ 720 వద్దే ఎక్స్‌పైరీ అయితే ఈ లాభం వస్తుంది. ఒకవేళ షేరు పైన చెప్పిన రేంజ్‌ను దాటేస్తే నష్టం ఆరంభమవుతుంది. గరిష్టంగా ఒక్కో షేరుకు రూ. 11 వరకు నష్టం రావచ్చు. ఒకపుట్‌, కాల్‌ కొన్నందున ఇంతకు మించి అపరిమిత నష్టమైతే ఉండదు. గత ఫలితాల సమయంలో ఇన్ఫీ ఐవీ(ఇంప్లైడ్‌ ఒలటిలిటీ) 50 స్థాయికి చేరి ఫలితాల అనంతరం సగానికి పడిపోయిందని, అందువల్ల ఈ వ్యూహం వర్కవుట్‌ అవుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, మారుతీ అప్‌

Thursday 9th January 2020

సెన్సెక్స్‌ 445 పాయింట్లు జూమ్‌ నిఫ్టీ 135 పాయింట్లు ప్లస్‌ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 445 పాయింట్లు జంప్‌చేసింది. 41,263 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 135 పాయింట్లు ఎగసి 12160కు చేరింది.

తెలంగాణలో సుగ్న మెటల్స్‌ రెండో ప్లాంట్‌ ఏర్పాటు

Thursday 9th January 2020

మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్‌ తెలంగాణ వికారాబాద్‌లోని పరిగిలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్‌ ఐరన్‌ వంటివి కూడా ఈ ప్లాంట్‌లో

Most from this category