News


నిఫ్టీలో కాల్‌ లాడర్‌ వ్యూహం!

Thursday 12th December 2019
Markets_main1576125029.png-30186

మార్కెట్లు బుధవారం చివరిలో పాజిటివ్‌ మూడ్‌లోకి మారాయి. దీంతో ఈ నెల్లో మరోమారు నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హైని తాకొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్వల్పశ్రేణి అప్‌మూవ్‌ కదలికల సమయంలో బుల్‌కాల్‌ లాడర్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించాలని డెరివేటివ్స్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో 11900 కాల్‌ను కొని 12100, 12200 కాల్స్‌ను(డిసెంబర్‌  నెల ఆప్షన్స్‌) విక్రయించడం జరుగుతుంది. బుధవారం ధరల ప్రకారం చూస్తే 11900 కాల్‌కు రూ. 138రూపాయలు పర్‌ షేర్‌ పడుతుంది(ఒక్కలాట్‌లో 75 షేర్లుంటాయి). 12100 కాల్‌ షేరు రూ. 52, 12200 కాల్‌ షేరు ఒక్కొక్కటి రూ. 29 పడతాయి. కొన్న కాల్‌, అమ్మిన కాల్స్‌ మధ్య వ్యత్యాసం షేరుకు రూ. 57 ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ డిసెంబర్‌ చివరకు 11900 పాయింట్ల దిగువన ముగిస్తే ఈ వ్యూహంలో ట్రేడర్‌ గరిష్ఠంగా నష్టపోయే మొత్తం ఇది. నిఫ్టీ 12100-12200 మధ్యకు వచ్చినప్పుడు వ్యూహంలో గరిష్ఠలాభం రూ. 143 వస్తుంది. 12343 పాయింట్లు అప్పర్‌ బ్రేక్‌ ఈవెన్‌పాయింట్‌గా ఉంటుంది, ఈ పాయింట్‌కు పైన నష్టం అపరిమితంగా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వ్యూహానికి ఈ పాయింట్‌ను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు రాజేశ్‌ సూచించారు. ఈ వ్యూహం ద్వారా నష్టం పరిమితంగా ఉంటుందని డాల్టన్‌ క్యాపిటల్‌ అనలిస్టు యూఆర్‌ భట్‌ తెలిపారు. నిఫ్టీ 12200 వద్ద ముగిస్తే కొన్న కాల్‌ షేరు ఒక్కొక్కటి రూ. 243కు చేరతాయి. అమ్మిన కాల్స్‌లో ఒక్కో షేరుపై రూ. 100 వరకు నష్టం వస్తుంది. రూ.243లో నుంచి ఈ నష్టం తీసివేస్తే రూ. 143 ఈ వ్యూహంలో వచ్చే గరిష్ట లాభం. 12343 పాయింట్ల వద్ద లాభం ఒక్కో షేరుపై రూ. 386 కాగా అమ్మిన కాల్స్‌పై నష్టం రూ. 386 అవుతుంది. అంటే ఈ పాయింట్‌ వద్ద లాభనష్టాలుండవు, దీనిపైన నష్టం పెరుగుతుంది. 



You may be interested

పసిడికి ఫెడ్‌ మద్దతు

Thursday 12th December 2019

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు బలపడి 1,480 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలవంతపై కొనసాగుతున్న అనిశ్చితి, నేడు బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర అంశాలు పసిడి బలపడేందుకు కారణమవుతున్నాయి. రెండురోజుల పాటు జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌

రుణాల విభాగంలోకి రియల్‌మీ

Thursday 12th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చైనాలోని షెన్‌జెన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ... డిజిటల్‌ రుణాల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెలాఖరు నుంచి మన దేశంలో రుణ సేవలను ప్రారంభించనుంది. దీనికి సంబంధించి వచ్చే వారం న్యూఢిల్లీలో ఒక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన బ్యాంక్‌లు, ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలతో ఈ మేరకు సంస్థ ఒప్పందం చేసుకుంది. 18 ఏళ్లు పైబడిన

Most from this category