News


స్టాక్‌ మార్కెట్లో సంపాదించడం ఈజీయేనా..?!

Saturday 8th September 2018
Markets_main1536344838.png-20064

స్టాక్‌ మార్కెట్‌ అన్నది కష్టమైన రీతిలో సులభమైన డబ్బులను సంపాదించుకునే వేదిక అని కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. అయితే, ప్రపంచ స్థాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉందని ఎవరైనా ఈ విధంగా భావించడం సరికాదని సూచించారు. ‘‘అక్కడ ఎటువంటి గ్యారంటీ ఉండదు. నేను ఎంతో మంది విజయం సాధించిన సీఏలు, సీఈవోలను కలుసుకున్నాను. వారు తమ తమ రంగాల్లో ఎంతో విజయం సాధించిన వారు. ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలను, బిలియన్ల రూపాయలను నిర్వహించిన వారు. కానీ, స్టాక్స్‌ ఇన్వెస్టింగ్‌ విషయానికొస్తే వారి పనితీరు సున్నాయే. అందుకే వారు నిపుణుల సాయం తీసుకుంటుంటున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు’’ అని కేడియా తన అనుభవాలను తెలియజేశారు.

 

‘‘స్టాక్‌ మార్కెట్‌ అన్నది పూర్తిగా భిన్నమైన వేదిక. ఐఐటీ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఉదాహరణగా తీసుకుందాం. మొదటి శ్రేణి డిగ్రీ కలిగి, ఇంజనీరింగ్‌ ప్రపంచాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే అతడు లేదా ఆమె... విమానాన్ని నడపగలరని అనుకోవడానికి లేదు. ఫ్లయింగ్‌ కోర్సు చేసి, విమానాన్ని నడిపేందుకు వీలుగా తగిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఫ్లయింగ్‌లో పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన చక్కని పైలట్‌ కాలేరు. సాధన ద్వారానే అది సాధ్యమవుతుంది. అలాగే, పెట్టుబడుల్లోనూ మార్కెట్‌ విజ్ఞానం సంపాదించాల్సి ఉంటుంది. సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్‌ అవ్వాలనుకుంటే, ఇన్వెస్టింగ్‌కు సంబంధించి ఆచరణాత్మక విషయాలు తెలుసుకోవాలి. అయితే, ఇన్వెస్టర్‌ విద్యావంతుడైతే అంశాలను చూసే విధానం వేరుగా ఉంటుంది. పెట్టుబడుల వ్యాపారాన్ని వేగంగా, మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’ అని కేడియా తెలిపారు.

 

‘‘మరో ఉదాహరణ చూస్తే... మీరు సీఏ అవ్వాలనుకుంటే, అందుకు విద్య, ఆర్టికల్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌, జాబ్‌ చేసి, ఆ తర్వాత స్వయంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అయితే, ‘ఇన్వెస్టింగ్‌లో ఏ విధానాన్ని అనుసరించక్కర్లేదు. ఇది చాలా సులభ వ్యాపారం, ఎవరైనా ఇందులోకి ప్రవేశించొచ్చు. విజయం సాధించొచ్చు’ అనే సాధారణ దృక్పధాలు ఉన్నాయి. కానీ, ఇది నిజం కావు. స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ రెండువైపులా పదునున్న కత్తి వంటిది. తన పెట్టుబడినంతా కోల్పోవచ్చు. ఇక్కడ డబ్బులను సంపాదించడం ఈజీ అన్న దురభిప్రాయం ఉంది. కానీ, కష్టమైన రీతిలో సులభమైన డబ్బును సంపాదించుకునేదే స్టాక్‌ మార్కెట్‌. ఈ మార్గం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎన్నో అంశాలకు జవాబులు దొరకవు. ఇందుకు దగ్గరి దారి లేదు. ఇన్వెస్టింగ్‌ సూత్రాలను విశ్లేషించి, నేర్చుకోవడం, దాన్ని మీ సొంత శైలిలో అమలు చేయడం ద్వారానే సాధ్యం. స్టాక్‌ మార్కెట్లో సక్సెస్‌ అవ్వాలంటే మీ విద్య, ఇన్వెస్టింగ్‌ పరిజ్ఞానం, వైఫల్యాల నుంచి నేర్చుకున్న అనుభవాలే సక్సెస్‌ మంత్రాలు’’ అని కేడియా ఇన్వెస్టర్లకు వివరించారు.You may be interested

ట్రేడింగ్‌ వేళల పెంపుపై ఏకాభిప్రాయం కీలకం

Saturday 8th September 2018

ప్రధాన స్టాక్‌ ఎక్సేంజీల ట్రేడింగ్‌ వేళల్ని అర్ధరాత్రి వరకు పెంచాలన్న ప్రతిపాదనను బ్రోకర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సెబీ కోరుతోంది. మరోసారి బ్రోకర్లతో ఇదే అంశంపై చర్చించాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలను సెబీ కోరింది. ట్రేడింగ్‌ వేళలను పెంచడం అన్నది ఏకాభిప్రాయం మేరకు ఉండాలని, ఇందుకు వారి అభిప్రాయాలు కీలకమన్నది సెబీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.    బ్రోకర్లు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఒకే తాటిపైకి

రూపాయి రికవరీతో రెండోరోజూ లాభాలే..!

Friday 7th September 2018

11550 పైన నిఫ్టీ రాణించిన అటో, మెటల్‌ ఫార్మా షేర్లు మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో సూచీలు రెండోరోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 38390 వద్ద ముగిసింది. మరో ప్రధాన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 11603 వరకు ర్యాలీ చేసింది. చివరికి 52 పాయింట్ల లాభంతో 11550 పాయింట్లపైన 11589 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ప్రభుత్వ

Most from this category