News


మోదీ హయాంలో టాటా, అంబానీ, అదానీ స్టాక్స్‌?

Wednesday 22nd May 2019
Markets_main1558548757.png-25891

మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ప్రముఖ పారిశ్రామిక గ్రూపులకు చెందిన కంపెనీల పనితీరు యూపీఏ-2తో పోలిస్తే మిశ్రమంగానే ఉంది. యూపీఏ-2, మోదీ ఐదేళ్ల పాలన అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకుల విధానాల పరంగా భిన్నమైనవి. యూపీఏ-2లో వర్ధమాన మార్కెట్లకు నిధులు వెల్లువెత్తగా, మోదీ సర్కారు సమయంలో పరిస్థితి మరో విధంగా ఉంది. 

 

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపు సంపద మాత్రం మోదీ హయాంలో గణనీయంగా వృద్ధి చెందింది. యూపీఏ-2 పాలనలో రూ.11,684 కోట్ల మేర పెరగ్గా, మోదీ ఐదేళ్ల పాలనలో రిలయన్స్‌ గ్రూపు విలువ రూ.4.84 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. టెలికంలోకి అడుగుపెట్టడం, రిటైల్‌ను భారీగా విస్తరించడం ఈ గ్రూపు సంపద వృద్ధికి దోహదపడ్డాయి. నూతన వ్యాపారాలపై చేసిన పెట్టుబడులు ఫలితాలను ఇవ్వడం మోదీ హయాంలో కంపెనీ రీరేటింగ్‌కు దారితీసింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపు స్టాక్స్‌ తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ర్యాలీ చేశాయి. కానీ, మోదీ సర్కారు ఐదేళ్ల హయాంలో అనిల్‌ గ్రూపు కంపెనీల విలువ రూ.65,130 కోట్ల మేర హరించుకుపోయింది. అంతకుముందు యూపీఏ-2 ఐదేళ్ల పాలనలోనూ ఇంతే మేర రూ.64,873 కోట్ల సంపద కరిగిపోయింది. 

 

టాటా గ్రూపు స్టాక్స్‌ విలువ మాత్రం గత ఐదేళ్ల కాలంలో రూ.4.22 లక్షల కోట్ల మేర పెరిగింది. యూపీఏ-2లోనూ 5.33 లక్షల కోట్ల మేర పెరగడం గమనార్హం. టైటాన్‌, టీసీఎస్‌, టాటా కమ్యూనికేషన్స్‌ రూపంలో ప్రధానంగా టాటా గ్రూపు మార్కెట్‌ విలువ గణనీయంగా వృద్ధి చెందిందని చెప్పుకోవాలి. ఎందుకంటే టాటా మోటార్స్‌, టాటా పవర్‌ రూపంలో సంపద విధ్వంసం జరిగినా గ్రూపు మార్కెట్‌ విలువ పెరగడానికి టీసీఎస్‌, టైటాన్‌లే కారణం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల, మందగమన పరిస్థితులు టాటా గ్రూపులోని చాలా కంపెనీలపై ప్రభావం చూపించాయి. ఉదాహరణకు అంతర్జాతీయంగా లగ్జరీ కార్ల డిమాండ్‌ 2011-17 మధ్య ఏటా 9 శాతం ఉండగా, అది ఆ తర్వాత పడిపోయింది. దీంతో టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అలాగే, చైనా మందగమనం, చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం స్టీల్‌ ధరలను దెబ్బతీశాయి. ఇది టాటా స్టీల్‌పైనా ప్రభావం చూపించింది. 

 

బజాజ్‌ గ్రూపులోని 10 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ గత ఐదేళ్లలో రూ.3.62 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకుముందు ఐదేళ్ల కాలంలో 76,322 కోట్ల మేర పెరగడం గమనార్హం. ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీల మార్కెట్‌ విలువ అతి తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకుముందు యూపీఏ-2 పాలనలోనూ ఇంచుమించు ఇంతే మొత్తం పెరగడం గమనార్హం. ఇక, అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ విలువ యూపీఏ-2లో రెట్టింపు కాగా, మోదీ హయాంలో సగం మేర వృద్ధి చెందింది. యూపీఏ-2 ప్రభుత్వ పాలన సమయానికి అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.43,651 కోట్లుగా ఉంటే, మోదీ ప్రభుత్వం కొలువుదీరే నాటికి రూ.99,898 కోట్లకు పెరిగింది. తాజాగా ఇది రూ.1.63 లక్షల కోట్లకు చేరింది. మోదీకి అదానీ సన్నిహితులనే పేరున్న సంగతి తెలిసిందే. ఆరు మహీంద్రా గ్రూపు కంపెనీల మార్కెట్‌ విలువ రూ.48,000 కోట్ల మేర గత ఐదేళ్లలో పెరిగింది. అంతకుముందు ఐదేళ్లలో వృద్ధి రూ.1.10 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. యూపీఏ-1, యూపీఏ-2 అన్నది అంతర్జాతీయంగా బూమ్‌ సమయం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ మంచి వృద్ధిని చూపించిందని నిపుణులు పేర్కొన్నారు. 2010, 2012, 2013లో విదేశీ నిధులు రూ.లక్ష కోట్ల చొప్పున మన మార్కెట్లలోకి రావడం గమనార్హం.You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌

Thursday 23rd May 2019

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తాజా ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న కారణంగా గురువారం స్టాక్‌ సూచీలు భారీగ్యాప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 482 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డుస్థాయి 39,591 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 163 పాయింట్ల గ్యాప్‌అప్‌తో చరిత్రాత్మక గరిష్టస్థాయి 11,900 పాయింట్లపైన ప్రారంభమయ్యింది.  కొత్త రికార్డుస్థాయికి ఎస్‌బీఐ ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ట్రేడింగ్‌ ప్రారంభంలో 5 శాతం జంప్‌చేసి చరిత్రాత్మక గరిష్టస్థాయి

నాలుగు రంగాలపై ఐఐఎఫ్‌ఎల్‌ సానుకూలం

Wednesday 22nd May 2019

ఇన్‌ఫ్రా, కన్‌స్ట్రక్షన్‌, కార్పొరేట్‌ బ్యాంకుల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వీపీ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. సిమెంట్‌, కన్‌స్ట్రక్షన్‌, కార్పొరేట్‌ బ్యాంకులు, క్యాపెక్స్‌ విభాగాల్లో తాము కొనుగోళ్లు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా సంజీవ్‌ భాసిన్‌ వెల్లడించారు. మౌలిక సదుపాయాల కారణంగా ఇవి పెద్ద ఎత్తున లబ్ధి పొందనున్నాయని చెప్పారు. ఎన్నికల పలితాలు సహా వివిధ అంశాలపై ఆయన తన విశ్లేషణ తెలియజేశారు.    ఎన్నికల ఫలితాల రోజున

Most from this category