News


ఎస్‌బీకార్డ్స్‌ లిస్టింగ్‌.. నష్టాలా లాభాలా?

Saturday 14th March 2020
Markets_main1584178114.png-32483

గ్రే మార్కెట్‌ ఏం చెబుతోంది?
ఈ నెల మొదట్లో రూ. 350-380 ప్రీమియం
తదుపరి రూ.25-50కు దిగివచ్చిన ప్రీమియం
శుక్రవారానికల్లా రూ. 25 డిస్కౌంట్‌లోకి

కరోనా వైరస్‌ ధాటికి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ ఎలా ఉండనుందన్న అంచనాలు ఇటీవల ఇన్వెస్టర్లను కుదిపివేస్తున్నాయి. రూ. 755 ధరలో వచ్చిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సోమవారం(16న) లిస్ట్‌కానుంది. క్రెడిట్‌ కార్డ్స్‌ మారెట్లో రెండో పెద్ద కంపెనీగా నిలుస్తున్న ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభానికి ముందువరకూ మార్కెట్లో భారీ ఆసక్తి వ్యక్తమవుతూ వచ్చింది. దీంతో ఇష్యూకి 26 రెట్లు అధికంగా స్పందన లభించింది.

తొలుత ప్రీమియం
నిజానికి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూ ప్రారంభంకాకుండానే అనధికార(గ్రే) మార్కెట్‌లో ప్రీమియం పలకడం ప్రారంభమైంది. ఒక దశలో ఇష్యూ ధరపై రూ. 350-380 వరకూ అధికంగా చెల్లించేందుకు(ప్రీమియం) గ్రే మార్కెట్లో ఆసక్తి వ్యక్తమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల మొదటి వారంవరకూ ఇష్యూకి భారీ డిమాండ్‌ కనిపించగా.. తదుపరి పరిస్థితులు తలకిందులైనట్లు మార్కెట్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వారం మధ్యలో ఇష్యూకి గ్రేమార్కెట్‌లో ప్రీమియం రూ. 25-50 స్థాయికి దిగివచ్చినట్లు తెలియజేశారు.

ప్రస్తుతం డిస్కౌంట్‌లో
కోవిడ్‌-19.. అమెరికా, యూరోపియన్‌ దేశాలను సైతం వణికిస్తుండటంతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఫలితంగా శుక్రవారానికల్లా గ్రే మార్కెట్లో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూ డిస్కౌంట్‌లోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూ. 10-25 డిస్కౌంట్‌ పలుకుతున్నట్లు తెలియజేశారు.​ అంటే ఇష్యూ ధర రూ. 750కాగా.. రూ. 725 ధరలో కొనుగోలుదారులున్నట్లు వివరించారు. ఇష్యూ శుక్రవారం తొలుత రూ. 25 డిస్కౌంట్‌ పలికిందని. సాయంత్రానికల్లా ఇది రూ. 5కు చేరిందని తెలియజేశారు.

లిస్టింగ్‌ ఇలా..
శుక్రవారం తొలుత దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం పతనమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు నెలకొంటే.. ఎస్‌బీఐ కార్డ్స్‌ అధిక శాతం నష్టాలతోనే లిస్టయ్యే వీలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాకాకుండా మిడ్‌సెషన్‌ నుంచీ చూపిన జోరును కొనసాగిస్తే.. కొంతమేర ప్రీమియం ధరలో లిస్ట్‌కావచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆధారంగానే ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టింగ్‌ ఉండవచ్చని చెబుతున్నారు. మార్కెట్లో నెలకొన్న వాతావరణాన్ని లిస్టింగ్‌ ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడ్డారు.

హెచ్‌ఎన్‌ఐల ఆందోళన
తొలుత ఇన్వెస్టర్లను విశేషంగా ఆకట్టుకున్న ఎస్‌బీఐకార్డ్స్‌ ఇష్యూకి సంపన్న వర్గాలు(హెచ్‌ఎన్‌ఐలు) సగటున 13-15 శాతం వడ్డీ రేటులో రుణాల ద్వారా సబ్‌స్క్రయిబ్‌ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఐపీవో ధర సమీపంలో లిస్టయితే హెచ్‌ఎన్‌ఐలకు నష్టాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. కాగా.. 2.5 రెట్లు అధికంగా దరఖాస్తులు దాఖలైన రిటైల్‌ విభాగంలో సైతం ఇన్వెస్టర్లు అత్యధిక సంఖ్యలో అలాట్‌మెంట్‌ను పొందినట్లు తెలుస్తోంది. You may be interested

విమానాశ్రయాల కోసం ఏటా 5,000 కోట్లు

Saturday 14th March 2020

ఏఏఐ చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఏటా సగటున రూ.3,000-4,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది నుంచి రూ.5,000 కోట్లు వ్యయం చేయనున్నట్టు ఏఏఐ చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ వెల్లడించారు. వింగ్స్‌ ఇండియా ప్రదర్శన, సదస్సులో శుక్రవారం పాల్గొన్న ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘వచ్చే అయిదేళ్లు రూ.25,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌

నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 టాప్‌టెన్‌ లూజర్లు ఇవే..!

Saturday 14th March 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా గడచిన నెలరోజుల్లో బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ ఏకంగా 21.50శాతం నష్టాన్ని చవిచూసింది. పతనమైన షేర్లలో అత్యధికంగా టాటా కెమికల్స్‌ షేరు అత్యధికంగా 63.77శాతం నష్టాన్ని చవిచూసింది. ఇదే సూచీలో ఒక్కషేరు కూడా ఇన్వెస్టర్లకు లాభాల్ని సమకూర్చలేకపోవడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టబడుల సంహరణ, దివాళా దిశగా సాగుతున్న

Most from this category