News


బడ్జెట్‌ ముందు నిఫ్టీ టెక్నికల్స్‌ ఎలా ఉన్నాయి?

Wednesday 29th January 2020
Markets_main1580280690.png-31302

నిరాశపరిస్తే పతనం భారీగా ఉంటుందంటున్న నిపుణులు
ఈ వారాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్లో భారీ ఆశలున్నాయి. ఎకానమీలో పునరుజ్జీవం తెచ్చేందుకు పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ రెండుమూడు దినాలు మార్కెట్లు పాజిటివ్‌గానే ఉండే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ గతవారం ఆల్‌టైమ్‌ హై 12400 పైన నిలబడలేకపోయింది. ప్రస్తుతం టెక్నికల్స్‌ చూస్తే నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. స్వల్పకాలిక డీఎంఏలకు దిగువన ట్రేడవుతోంది. ఆర్‌ఎస్‌ఐ సూచీ గత సెప్టెంబర్‌ తర్వాత రిఫరెన్స్‌లైన్‌ దిగువకు వచ్చింది. ఇవన్నీ మార్కెట్లో ప్రాఫిట్‌ బుకింగ్‌కు సంకేతాలుగా నిపుణుల భావిస్తున్నారు. డైలీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ కొంతమేర పాజిటివ్‌గా ఉంది. బడ్జెట్‌ దృష్ట్యా తీవ్ర ఒడిదుడకులు ఉండే నేపథ్యంలో నిఫ్టీకి 11500, 11900 పాయింట్ల వద్ద మద్దతు, 12300, 12430 పాయింట్ల వద్ద నిరోధాలు ఎదురుకావచ్చని అంచనాలున్నాయి. ఈ వారానికి నిఫ్టీ ఇదే రేంజ్‌లో ఉండొచ్చని నిపుణుల భావన. 
బడ్జెట్‌పై అంచనాలు
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి పెంపు, ఎల్‌టీసీజీ తగ్గింపు, దిగుమతి సుంకాల సడలింపులాంటివి బడ్జెట్లో ఉండొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. అయితే ఇవన్నీ చేపడితే విత్తలోటు పెరిగే అవకాశమున్నందున ప్రభుత్వం ఎలాంటి విధానాలు ప్రకటిస్తుందోనని ఆసక్తి నెలకొంది. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు బడ్జెట్‌ లేకపోతే సూచీల్లో 10 శాతం వరకు పతనం ఉండొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఇంకా పూర్తి ఫలితాలు ఇవ్వాల్సిఉందని, అందువల్ల ఈదఫా బడ్జెట్‌లో భారీ పాజిటివ్‌ అంశాలు ఉండకపోవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వ్యాఖ్యానించింది. మార్కెట్లను నిరాశపరిచే బడ్జెట్‌ వస్తే భారీ ప్రాఫిట్‌బుకింగ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. బడ్జెట్లో విత్తలోటు అంచనాలు కీలకమని, మార్కెట్‌ ఆశలు తీర్చే బడ్జెట్‌ రాకపోతే సూచీలు 5- 10 శాతం కరెక‌్షన్‌ చూస్తాయని యాంటిక్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. 



You may be interested

మెటల్‌ షేర్లు అప్‌

Wednesday 29th January 2020

పుంజుకున్న మెటల్‌ షేర్లు అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండురోజులుగా పతనమైన మెటల్‌ షేర్లు బుధవారం ఇన్వెస్టర్ల మద్దతు లభించడంతో పుంజుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.7 శాతం పెరుగుదలతో 2,686.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మొయిల్‌ 3.7 శాతం పెరుగుదలతో 154.30 వద్ద, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 2.74 శాతం పెరుగుదలతో 262.25 వద్ద, సెయిల్‌ 2.44 శాతం పెరుగుదలతో 48.20 వద్ద, టాటాస్టీల్‌ 2.36

రూ.400 తగ్గిన పుత్తడి

Wednesday 29th January 2020

రూ.400 తగ్గిన బంగారం  కరోనా వైరస్‌ ప్రభావంతో గత కొద్ది రోజులుగా అమాంతం పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగివచ్చాయి. బుధవారం 10.45 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ. 400 తగ్గుదలతో 10 గ్రాముల పసిడి 40,091.00వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడం, రూపాయి పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం రోజుతో పోలిస్తే 14 డాలర్లు తగ్గి  ఔన్స్‌ బంగారం

Most from this category