డబుల్ టాప్, డబుల్ బాటమ్ అంటే...?
By D Sayee Pramodh

మార్కెట్లో షేరు ధరలను అధ్యయనం చేసి ట్రెండ్‌ను గుర్తించడంలో డబుల్‌టాప్, డబుల్ బాటమ్ ఉపయోగపడుతుంటాయి. ఒకే ధర వద్ద కొంత కాలపరిమితి తేడాతో ఏర్పడే కచ్ఛితమైన టాప్‌లను డబుల్‌టాప్ అని, కచ్ఛితమైన బాటమ్లను డబుల్ బాటమ్లని అంటారు. సాధారణంగా ఈ స్థాయిల వద్ద ట్రెండ్ రివర్సల్‌కు అవకాశాలుంటాయి. ఒక షేరు నిర్ణీత ధర వరకు చేరుకొన్న తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కరెక్షన్ వస్తుంది. దీని తర్వాత బుల్స్ మరోమారు ధరను గత టాప్‌ను అధిగమించాలన్న ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతారు. కానీ బుల్స్ గత టాప్‌ను దాటే ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పుడు డబుల్‌టాప్ ఏర్పడుతుంది. బుల్స్‌లో సత్తా ముగిసిందని దీనికి సంకేతం. డబుల్‌టాప్ ఏర్పడ్డతర్వాత బేర్స్ పట్టు బిగిస్తుంటారు. రెండో టాప్ ఏర్పడిన తర్వాత బేర్స్ తొందరగా తమ బలాన్ని చూపి ధరను కిందకు లాగుతారు. ఈ తరుణంలో దిగువన ఒక మద్దతు స్థాయి వద్ద బుల్స్,బేర్స్‌కు హోరాహోరీ మొదలవుతంది. ఈ స్థాయిని డబుల్‌టాప్ నిర్ధారణ స్థాయి అంటారు. ఈ స్థాయి వద్ద ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాల్సిఉంటుంది. ఈ స్థాయి దిగువకు ధరను బేర్స్ గుంజగలిగితే డబుల్‌టాప్ నిర్ధారణ అవుతుంది. ఈ స్థాయి వద్ద సాధారణంగా పొజిషన్లు వదిలించుకోవడం జరుగుతుంది. పతనం టార్గెట్‌ను ప్యాటర్న్ పొడవును బట్టి లెక్కిస్తారు. అంటే టాపింగ్ స్థానం నంచి నిర్ధారణ స్ధానం విలువను తీసివేసి నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక షేరు రూ.1000 వద్ద టాప్ ఏర్పరిచి రూ. 800 వరకు దిగివచ్చి తిరిగి రూ. 1000 వద్దకు ఎగిసి డబుల్ టాప్ ఏర్పరిచింది. ఇక్కడ డబుల్‌టాప్ స్థాయి రూ.1000 కాగా డబుల్ బాటమ్ నిర్ధారణ స్థాయి రూ. 800. వీటి మధ్య వ్యత్యాసం రూ. 200. అంటే డబుల్‌టాప్ నిర్ధారణ అనంతరం పతనం టార్గెట్ మరో రూ.200 ఉంటుందని అర్ధం. అంటే రూ. 800 దిగువన రూ. 600 వరకు పతనం కొనసాగేందుకు ఛాన్సులుంటాయి. డబుల్ బాటమ్ డౌన్‌ట్రెండ్‌లో ట్రెండ్ రివర్సల్‌ను సూచిస్తుంది. పైన చెప్పిన డబుల్ టాప్కు పూర్తి వ్యతిరేకంగా డబుల్ బాటమ్ ఉంటుంది. రెండు మార్లు ధర ఒక నిర్ణీత స్థానం వరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే డబుల్ బాటమ్‌గా చెబుతారు. డబుల్ టాప్కు వర్తించే రూల్సే ఇక్కడ కూడా దాదాపుగా వర్తిస్తాయి. ఉదాహరణ చిత్రం
You may be interested
బడ్జెట్ బాగుంటే ఈ షేర్లు కొనొచ్చు!
Friday 28th June 2019అనలిస్టుల టాప్ 10 రికమండేషన్లు ఈ వారం రానున్న కేంద్ర బడ్జెట్ మార్కెట్ ఆశలకు అనుగుణంగా ఉంటే దృష్టి పెట్టాల్సిన టాప్ 10 స్టాకులను వివిధ నిపుణులు రికమండ్ చేస్తున్నారు. 1. ఐసీఐసీఐ బ్యాంకు: బ్యాంకు తాజా ఫలితాల్లో నికర ఎన్పీఏలను గణనీయంగా తగ్గించుకుంది. ఎన్ఐఐలో 27 శాతం మెరుగుదల నమోదయింది. రిటైల్బ్యాంకింగ్పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. 2. మారికో: వచ్చే రెండుమూడేళ్లలో బలమైన క్యాపెక్స్ వ్యయం నమోదు చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. గత
వృద్ధికి మరింత కలసి పనిచేయాలి
Friday 28th June 2019ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ముంబై: నిదానించిన దేశ జీడీపీ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ మరింత సన్నిహితంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం ద్రవ్య గణాంకాలపై ఒత్తిళ్లకు దారి తీస్తున్నట్టు ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో గవర్నర్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణకు ఉమ్మడి చర్యలు అవసరమని, ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను