News


సెన్సెక్స్‌ స్టాక్స్‌లో అనుకూలం - ప్రతికూలం

Sunday 7th July 2019
Markets_main1562524007.png-26872

కన్జ్యూమర్‌, కన్‌స్ట్రక్షన్‌ స్టాక్స్‌ మధ్య కాలానికి మంచి లాభాలను ఇస్తాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్ద పీట వేయడం, గ్రామీణుల ఆదాయం పెంపు చర్యలు ఇందుకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ సూచీలోని స్టాక్స్‌కు సంబంధించి బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం ఏ మేరకు అన్నది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. 

 

 • డెకరేటివ్‌ పెయింట్స్‌ విభాగంలో మార్కెట్‌ లీడర్‌. 50 శాతం వాటా ఈ కంపెనీదే. పీఎంఏవై ద్వారా 2022 నాటికి 1.95 కోట్ల ఇళ్లను నిర్మించడం ద్వారా అందరికీ ఇల్లు లక్ష్యాన్ని సాకారం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా బడ్జెట్‌ తెలియజేస్తోంది. ఈ నిర్ణయాలు ఏషియన్‌ పెయింట్స్‌ అమ్మకాలను పెంచేవే. 
 • ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహం, వాటికి జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివి ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజన్‌ వాహనాలకు ప్రతికూలం. బజాజ్‌ ఆటో, ఈ విభాగం కిందకే వస్తుంది. 
 • ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు మరో రూ.1.5లక్షల వరకు పన్ను రాయితీ హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంకులకు లాభిస్తుంది. పైగా ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను 2019-20లో సాయంగా కేంద్రం ఇవ్వనుండడం ఎస్‌బీఐకి సానుకూలం. 
 • ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను రాయితీ ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు మేలు చేయనుంది. ఎందుకంటే బ్యాంకు రుణ పుస్తకంలో 33 శాతం ఆటో రుణాలే. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలను కూడా ఇస్తోంది. ఆవిధంగా చూసుకున్నా సానుకూలం అవుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఆదాయపన్ను రాయితీ, పన్నుల తగ్గింపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంకులకు కూడా సానుకూలం అవుతుంది. 
 • గ్రామీణ ఆదాయం పెంపు దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండడంతో హీరో మోటోకార్ప్‌కు సానుకూలం. ఎందుకుంటే ఈ కంపెనీ అమ్మకాల్లో సగం పల్లెలవే. ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తుండడం, ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఏథర్‌ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు వాటా ఉండడం మరో సానుకూలత. 
 • డిజిటైజేషన్‌పై ప్రభుత్వం చేసే వ్యయాలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ కంపెనీలకు వ్యాపార అవకాశాలు తెచ్చిపెడతాయి. అయితే, ప్రజల కనీస వాటాను 35 శాతం చేయాలన్న ప్రతిపాదన టీసీఎస్‌ స్టాక్‌పై సమీప కాలంలో ప్రభావం చూపనుంది. ప్రమోటర్లకు కంపెనీలో 72.02 శాతం వాటా ఉంది. 
 • పామాయిల్‌ సంబంధిత ముడి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఉపసంహరించుకోవడం హెచ్‌యూఎల్‌పై పెద్దగా ప్రభావం చూపదు. పైగా గ్రామీణ ఆదాయం పెంచే చర్యలు కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతుంది. 
 • 1,000 సిగరెట్లపై ఎక్సైజ్‌ డ్యూటీని కేవలం రూ.5 పెంచడం వల్ల ఐటీసీపై పడే ప్రభావం రూ.35 కోట్లు మాత్రమే. 
 • దేశ ఆర్థిక రంగాన్ని 5 ట్రిలియన్‌ డాలర్లుగా మార్చాలనే లక్ష్యం, దేశీయంగా పెట్రో, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్‌ఐఎల్‌కు లాభం. 
 • మౌలిక సదుపాయాలపై వచ్చే ఐదేళ్లలో 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఇది ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, వేదాంత వంటి కంపెనీలకు ప్రయోజనం. 
 • ఎలక్ట్రిక్‌ వాహనాలకు పుష్‌తో ఎంఅండ్‌ఎం లాభపడనుంది. అలాగే, రైతుల ఆదాయం పెంపు చర్యలు, కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలను పెంచుతుంది.
 • కార్ల మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న మారుతి ఎలక్ట్రిక్‌ వాహనాల పరంగా వెనుకబడి ఉండడం, ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుండడంతో... మార్కెట్‌ వాటా కోల్పోయేందుకు దారితీస్తుంది. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 8th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.50 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,770 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,820 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా సూచీల పతనం.. అమెరికా

మార్కెట్లు సైడ్‌వేస్‌లో కొనసాగొచ్చు: మోతీలాల్‌ఓస్వాల్‌

Sunday 7th July 2019

మరో ట్రిగ్గర్‌ కనిపించేంత వరకు ఈక్విటీ మార్కెట్లు సైడ్‌వేస్‌లో కొనసాగొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్‌ అండ్‌ డెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా అన్నారు. మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...   నిఫ్టీ సైకలాజికల్‌గా కీలకమైన 12,000ను పరీక్షించడంలో విఫలమైంది. పైగా 11,800 దిశగా పడిపోయింది. యూనియన్‌ బడ్జెట్‌కు ముందు స్తబ్దుగా ఉండగా, ఆ తర్వాత అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నది, దీంతో అంతకుముందు నాలుగు సెషన్లలో మార్కెట్‌ లాభాలన్నీ కరిగిపోయాయి. బేరిష్‌

Most from this category