News


కుప్పకూలిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు

Thursday 22nd August 2019
Markets_main1566451266.png-27941

గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు కుప్పకులాయి. ఈ రంగంలోని ప్రధాన కంపెనీ షేర్లైన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హుడ్కో, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, ఆర్‌జీఐ హోమ్స్‌ ఫైన్సా్‌, ఇండియా హోమ్స్‌ లోన్స్‌ షేర్లు దాదాపు 5శాతం నుంచి 9 శాతం క్షీణించాయి. 

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైన్సా్‌న్స్‌:- 
ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌ రూ.1261 కోట్లకు సమానమైన వాటా విక్రయానికి సిద్ధమైందనే వార్తల వెలుగులోకి రావడంతో 9శాతం నష్టపోయి రూ. 420.30 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:00లకు షేరు గత కిత్రం ముగింపుతో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.430.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌:- 

వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్స్‌లో నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 8.50శాతం క్షీణించింది. ఉదయం గం.10:00లకు షేరు గత కిత్రం ముగింపుతో పోలిస్తే 8 శాతం నష్టంతో రూ.445.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-

రుణాన్ని ఈక్విటీగా మార్చి కంపెనీలో 51శాతం వాటాను దక్కించుకునేందుకు రుణదాతలు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 8.50శాతం క్షీణించాయి. ఉదయం గం. ఉదయం గం.10:00లకు షేరు గత కిత్రం ముగింపుతో పోలిస్తే 7.50శాతం నష్టంతో రూ.42.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

వీటితో పాటు రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 5వరుకు క్షీణించాయి. 



You may be interested

ఈ స్టాకులపై ఫారిన్‌ బ్రోకరేజ్‌లేమంటున్నాయి!

Thursday 22nd August 2019

వివిధ స్టాకులు, కొన్ని రంగాలపై అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల ధృక్పథాలు ఇలా ఉన్నాయి... = మారుతీ సుజుకీపై క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ ధృక్పథం. టార్గెట్‌ రూ. 5700. కంపెనీ పలు మోడళ్లపై డిస్కౌంట్లు పెంచింది. యెన్‌తో రూపీ క్షీణించడం మార్జిన్‌ ఒత్తిళ్లను పెంచుతుంది. పీఈ పరంగా ఇంకా అధిక వాల్యూషన్ల వద్దనే ఉంది. = ఫైనాన్షియల్స్‌పై జేపీ మోర్గాన్‌ పెద్దబ్యాంకులే మనగలుగుతాయి. రేట్ల తగ్గింపు సీడీ నిష్పత్తిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకుపై బాగా పాజిటివ్‌. రక్షణాత్మక

డీఎల్‌ఎఫ్‌ భారీ పతనం..నష్టాల్లో రియల్టీ షేర్లు

Thursday 22nd August 2019

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌ ల్యాండ్‌-బ్యాంక్‌పై కొనసాగుతున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ తన షేర్‌హోల్డర్ల నుంచి దాచి పెట్టిందని సుప్రీం కోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది ఫలితంగా ఈ సంస్థ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. డీఎల్‌ఎఫ్‌ దెబ్బతో ఇతర రియల్‌ఎస్టేట్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.12 సమయానికి 6.30 శాతం నష్టపోయి 242.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

Most from this category