News


మిడ్‌క్యాప్‌ ర్యాలీకి కారణాలున్నాయ్‌..

Monday 20th January 2020
Markets_main1579459649.png-31024

ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకుంటున్నారని.. స్మాల్‌ క్యాప్‌ విషయంలో ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నట్టు సెంట్రమ్‌ బ్రోకింగ్‌కు చెందిన నిశ్చల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. గ్రామీణ రంగంలో మందగమనం ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ రంగంపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. గత వేసవిలో, తర్వాత శీతాకాలంలో పంటల సాగు మంచిగానే ఉన్నందున రికవరీపై అంచనాలతో ఉన్నట్టు చెప్పారు. పంటల ఉత్పాదక బాగుంటే, గ్రామీణుల చేతుల్లో ఆదాయం పెరుగుతుందని, ఇది ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌ను పెంచుతుందని విశ్లేషించారు. ఓ వార్తా సంస్థకు నిశ్చల్‌ మహేశ్వరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన విశ్లేషణ తెలియజేశారు. 

 

ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు..
స్టీల్‌ ధరలు, స్టీల్‌ స్టాక్స్‌ పెరగడానికి చైనా-అమెరికా మధ్య ట్రేడ్‌ ఒప్పందమే కారణమన్నారు నిశ్చల్‌ మహేశ్వరి. అలాగే, డాలర్‌ బలహీనపడినప్పుడల్లా కమోడిటీలు ర్యాలీ చేస్తాయని విశ్లేషించారు. ఎక్కువ శాతం కమోడిటీ స్టాక్స్‌ ర్యాలీకి అమెరికా-చైనా మధ్య సయోధ్యతో డిమాండ్‌ తిరిగి నెలకొంటుందన్న అంచనాలున్నట్టు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న అంచనాలతో నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల తాము దృష్టి సారించామని తెలిపారు. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ రివకరీపై అంచనాలతో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్టున్నట్టు తెలిపారు. లిక్విడిటీ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికైతే స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ విషయంలో అప్రమత్తతనే ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

బజాజ్‌ ఆటో
మిడ్‌క్యాప్‌ కంపెనీగానే కాకుండా మొత్తం ఆటోమొబైల్‌ రంగంలో తమ టాప్‌ పిక్‌గా బజాజ్‌ ఆటోను నిశ్చల్‌ మహేశ్వరి సూచించారు. ‘‘వినూత్నమైన ఉత్పత్తులతో మళ్లీ, మళ్లీ మన ముందుకు వచ్చే సామర్థ్యంతో ఉన్న కంపెనీ. కొన్ని విజయవంతం అయితే, కొన్ని కాలేదు. ఈ తరహా ఉత్పత్తులను తీసుకురావడంలో ముందుంటుంది. అది ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలైనా లేదా గతంలో పవర్‌ మోటార్‌సైకిల్స్‌ అయినా ఇంతే. ఆవిష్కరణ సామర్థ్యమే ఇతర కంపెనీలతో బజాజ్‌ ఆటోను విభిన్నంగా ఉంచుతుంది. రెండో అంశం కంపెనీ అమ్మకాల్లో 50 శాతం ఎగుమతుల నుంచే రావడం మరింత స్థిరమైన విధానం. 

 

భారతీ ఎయిర్‌టెల్‌
భారతీ ఎయిర్‌టెల్‌ అయినా వొడాఫోన్‌ ఐడియా అయినా ఏజీఆర్‌ చెల్లించక తప్పుదు. కాకపోతే రెండు సంస్థలకే పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉంది. అది 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టడం అయినా, దేశవ్యాప్తంగా 4జీని విస్తరించడం అయినా సరే. ఈ విషయంలో భారతీ నిజంగా పోటీలో నిలబడుతుంది. ఈ విభాగంలో రిలయన్స్‌ను చూస్తే ఇదొక పెద్ద దిగ్గజం. అచ్చమైన టెలికం కంపెనీ కోరుకుంటే భారతీ ఒక్కటే. అందుకే క్యూఐపీకి అంత స్పందన వచ్చింది’’ అని నిశ్చల్‌ మహేశ్వరి వివరించారు.



You may be interested

ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 41శాతం డౌన్‌

Monday 20th January 2020

2019లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా చేసిన పెట్టుబడులు రూ.75,000 కోట్లు. కానీ, అంతకుముందు 2018లో చేసిన పెట్టుబడులతో పోలిస్తే 41 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గడం, మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు తిరిగి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని, మంచి పనితీరు చూపిస్తాయని నిపుణులు అంచనాతో ఉన్నారు.    ‘‘మార్కెట్లలో ఉన్న అస్థిరతలు మరికొంత

హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 33 శాతం జంప్‌

Saturday 18th January 2020

ప్రస్తుత ఆర్థిక సంవతర్సం మూడో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు విశ్లేషకుల  అంచనాలను మించిన నమోదయ్యాయి. ఈ క్యూ3లో బ్యాంకు రూ.7,416.48 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో సాధించిన రూ.5,585.85 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32.77 శాతం అధికం. ఇతర ఆదాయం 35.52శాతం వృద్ధి చెంది రూ.6,669.28 కోట్లను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 12.69శాతం పెరిగి రూ.14,172.90కోట్లకి చేరింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆస్తుల

Most from this category