News


వేదాంత హోల్డ్‌ చేయవచ్చు: ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌

Tuesday 18th June 2019
Markets_main1560852121.png-26387

వేదాంత లిమిటెడ్‌ కంపెనీ షేర్లని రూ.175ల టార్గెట్‌ ధర వద్ద హోల్డ్‌ చేయవచ్చని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ సూచించింది. షేరు టార్గెట్‌ను చేరుకునేందుకు ఏడాది కాలపరిమితిని నిర్దేశించింది. ఖర్చును తగ్గించుకునేందుకు వ్యయ నియంత్రణ కార్యక్రమాలు, నాన్‌ ఇంటిగ్రేటెడ్ వ్యాపార నమూనా నుండి అల్యూమినియం వ్యాపారం ప్రయోజనం పొందుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. వేదాంత ఏప్రిల్‌లో అల్యూమినియం ఉత్పత్తి రికార్డుస్థాయిలో 152 కిలో టన్నులు నమోదు చేసింది. వ్యయనియంత్రణ, అధికంగా ఉత్పత్తి కారణంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ విభాగాల్లో పనితీరు మెరుగుపడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ ఆశిస్తోంది. అయితే. జింక్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీ మొత్తం ఎబిటాపై ప్రభావాన్ని చూపిన మాట వాస్తవమేనని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. 
రేటింగ్‌:- హోల్డ్‌
టార్గెట్‌ ధర:- రూ.175
కాల పరిమితి:- 1 ఏడాది



You may be interested

ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిలో క్షీణత!

Tuesday 18th June 2019

జేపీ మోర్గాన్‌ అంచనా రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ మార్జిన్ల బలహీనతతో ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 15 శాతం తగ్గవచ్చని దిగ్గజ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. మౌలిక వ్యాపారంలో బలహీనతను తట్టుకునేందుకు జియో టారిఫ్‌లను 12- 20 శాతం మేర ఆర్‌ఐఎల్‌ పెంచవచ్చని అభిప్రాయపడింది. ఈ విధమైన పెరుగుదల టెలికం రంగంలో మరింత పోటీని, అసమానతను పెంచవచ్చని తెలిపింది. ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఆందోళన

జీవిత కనిష్ఠానికి జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు

Tuesday 18th June 2019

జెట్‌ ఎయిర్‌ వేస్‌ మంగళవారం తీవ్రంగా నష్టపోయింది. ఇంట్రాడేలో 53 శాతం నష్టపోయి రూ. 32.25 జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. ఈ షేరు గత 7రోజుల్లో  73శాతం నష్టపోయింది. అప్పులను రికవరి చేయడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ కం‍పెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెం‍చ్‌లో దివాలా పిటిషన్‌ వేసిందనే వార్తల నేపథ్యంలో షేరు భారీగా పడిపోయింది.  లెండర్స్‌ కన్సార్టియం తరపున ఎస్‌బీఐ దివాలా పిటిషన్‌ను దాఖాలు

Most from this category