News


ఈ షేర్లను హోల్డ్‌ చేయొచ్చు

Tuesday 25th February 2020
Markets_main1582620582.png-32078

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు రేకత్తించడంతో ప్రపంచఈక్విటీ మార్కెట్ల తీవ్ర నష్టాలను చవిచూశాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సైతం ఈ వారంలో వరుసగా రెండో రోజూ నష్టాల బాట పట్టింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ సూచీలు 2వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ప్రభుదాస్‌ లిల్లాధర్‌ 3కంపెనీల షేర్లను హోల్డ్‌ చేయమని సలహానిచ్చింది. అలాగే ఐసీఐసీఐ డైరెక్ట్‌ బ్రోకరేజ్‌ సంస్థ సైతం అంబుజా సిమెంట్స్‌ షేరును హోల్డ్‌ చేయమని సిఫార్సు నిచ్చింది. ఈ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...

బ్రోకరేజ్‌ సంస్థ పేరు: ప్రభుదాస్‌ లిల్లాధర్‌ 
షేరు పేరు: పీఐ ఇండస్ట్రీస్‌ 
రేటింగ్‌: హోల్డ్‌
టార్గెట్‌ ధర: రూ.1516
విశ్లేషణ: కార్పోరేట్‌ పన్ను తగ్గింపుతో ఈ సారి కంపెనీ మంచి క్యూ3 ఫలితాలను ప్రకటిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ భావించింది. క్యూ3 ఫలితాలు బ్రోకరేజ్‌ సంస్థ అంచనాలకు అందుకోవడంలో విఫలమైంది. అయితే దేశీయంగా కస్టమ్‌ సింథెసిస్‌, కాంటాక్టు మాన్యుఫ్యాక్చరింగ్‌ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. ఇటీవల ఇసాగ్రో కొనుగోలును కూడా పూర్తి చేసింది. వ్యాపార విస్తరణను, ఉత్పత్తి సామర్థా‍్యన్ని పెంచుకునేందుకు రానున్న 2నెలల్లో కంపెనీ 20మిలియన్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో షేరుకు గతంలో కేటాయించిన హోల్డ్ రేటింగ్‌ కొనసాగించడంతో పాటు షేరుకు గతంలో కేటాయించిన రూ.1355ల టార్గెట్‌ ధరను రూ.1516లుగా పెంచుతున్నామని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

బ్రోకరేజ్‌ సంస్థ పేరు: ప్రభుదాస్‌ లిల్లాధర్‌
షేరు పేరు: హైడెల్బర్గ్ సిమెంట్
రేటింగ్‌: హోల్డ్‌
టార్గెట్‌ ధర: రూ. 215
విశ్లేషణ: క్యూ3 ఫలితాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. వాల్యూమ్స్‌ 5శాతం క్షీణించాయి. సిమెంట్‌ ధరలు పెరగడంతో వార్షిక ప్రాతిపదికన ఈబిటా 10శాతంగా నమోదైంది. మార్జిన్లు అధిగమించడటం, వృద్ధి మందగించవచ్చనే అంచనాలతో షేరుకు టార్గెట్‌ ధర రూ.215లుగా నిర్ణయిస్తూ హోల్డ్‌ రేటింగ్‌ను నిర్ణయిస్తున్నాము.

బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌
షేరు పేరు: ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ
రేటింగ్‌: అక్యుమిలేట్‌
టార్గెట్‌ ధర: రూ.90
విశ్లేషణ: సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు వినియోగించుకోనుంది. ఆర్థిక సంవత్సరం21 ఆదాయాలతో పోలిస్తే వాల్యూవేషన్స్‌ 4.4రెట్లు, ఆర్థిక సంవత్సరం22 ఆదాయాలతో పోలిస్తే వాల్యూవేషన్స్‌ 3.3రెట్లు తక్కువగా ఉండటంతో షేరుకు అ‍క్యుమిలేట్‌ రేటింగ్‌నుతో పాటు గతంలో కేటాయించిన టార్గెట్‌ ధరను రూ.92ల నుంచి రూ.90లకు పరిమితం చేస్తున్నట్లు బ్రోకరేజ్‌ సం‍స్థ పేర్కోంది. 

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
షేరు పేరు: అంబుజా సిమెంట్స్‌
రేటింగ్‌: హోల్డ్‌
టార్గెట్‌ ధర: రూ.200
విశ్లేషణ: కంపెనీ క్యూ3 కాలంలో అత్యుత‍్తమ పదర్శన కనబరించింది. ఫలితాలు బ్రోకరేజ్‌ సంస్థ అంచనాలను అందుకుంది. అంబుజా సిమెంట్స్ కాపెక్స్ మోడల్‌లో ఉన్నప్పటికీ దాని బుక్‌లో తగినంత ద్రవ్యత కలిగి ఉంది. ఏదేమైనా, తన సహర కంపెనీలతో పోల్చితే దాని వృద్ధి ప్రోత్సాహకరంగా లేదు. నగదు ప్రవాహ కూడా ఆశించినస్థాయిలో లేదు. You may be interested

దీర్ఘకాలంలో మార్కెట్‌పై కొవిడ్‌-19 ప్రభావం నిల్‌!

Tuesday 25th February 2020

మెటల్‌ స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావం డీమార్ట్‌ గుడ్‌ కంపెనీ అరబిందో ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్‌ హెచ్‌యూఎల్‌కు పన్ను ప్రయోజనాలు - నిశ్చల్‌ మహేశ్వరి, సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కరోనా వైరస్‌.. దేశీ స్టాక్‌ మార్కెట్ల దీర్ఘకాలిక ఔట్‌లుక్‌పై ప్రభావాన్ని చూపే అవకాశాలు తక్కువేనంటున్నారు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీఈవో నిశ్చల్‌ మహేశ్వరి. అయితే కరోనా మరింత విస్తరిస్తే మెటల్‌ కౌంటర్లకు దెబ్బతగిలే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం

కరోనాతో షేర్లు అమ్ముకోనక్కర్లేదు: వారెన్‌ బఫెట్‌

Tuesday 25th February 2020

షేర్లు అమ్ముకోవాల్సినంత తీవ్రత లేదు వారెన్‌ బఫెట్‌ ప్రపంచాన్ని, మార్కెట్లను గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ భయంకరమైనదేనని, కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని షేర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ అభిప్రాయపడ్డారు. బలమైన ఎర్నింగ్స్‌ శక్తిఉన్న కంపెనీలపై పెట్టుబడులు పెట్టి, పది నుంచి ఇరవై ఏళ్లు వేచిచూసే ఇన్వెస్టర్లు మార్కెట్లో సంపదనార్జిస్తారన్నారు. ఇలాంటి వైరస్‌లు తన దీర్ఘకాలిక అవుట్‌లుక్‌ను మార్చలేవన్నారు. కానీ స్వల్పకాలానికి ఇది భయంకరమైనదేనని చెప్పారు. స్టాక్‌మార్కెట్లో మనం

Most from this category