News


ఐసీఐసీఐ బ్యాంకు లాభాలకు గండి?!

Friday 4th May 2018
news_main1525430555.png-16154

ఫలితాలపై నిపుణుల అంచనా
భారతీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు క్యు4 ఫలితాలు పేలవంగా ఉంటాయని నిపుణులు, బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొండిపద్దులకు కేటాయింపుల పెరుగుదల లాభాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. ఈ బ్యాంకు ఫలితాలు సోమవారం వెల్లడవుతాయి.

బ్యాంకు ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..
- ఈ దఫా బ్యాంకు లాభం దాదాపు 36 శాతం క్షీణించి 1302 కోట్ల రూపాయలకే  పరిమితం అవుతుందని సిస్టెమాటిక్స్‌ షేర్స్‌ అండ్‌ స్టాక్స్‌ అంచనా వేసింది. గతేడాది బ్యాంకు క్యు4లో 2025 కోట్ల రూపాయల లాభం నమోదు చేసింది. ప్రీప్రొవిజనింగ్‌ప్రాఫిట్‌ 62 శాతానికి చేరుతుందని తెలిపింది. వార్షిక స్లిపేజ్‌ నిష్పత్తి 10 శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 
- నికర వడ్డీ మార్జిన్లో 1.6 శాతం, లాభంలో 32 శాతం పతనం ఉంటుందని మోతీలాల్‌ఓస్వాల్‌ అంచనావేస్తోంది. ఆస్తుల నాణ్యత మరింత క్షీణిస్తుందని, స్థూల ఎన్‌పీఏలు 9.8 శాతానికి, నికర ఎన్‌పీఏలు 5.2 శాతానికి ఎగబాకుతాయని అభిప్రాయపడింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు జీఎన్‌పీఏలు 7.9 శాతం వద్ద ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 4.9 శాతంగా ఉన్నాయి. 
- నికరలాభం ఈ దఫా 35 శాతం వరకు క్షీణిస్తుందని యాక్సిస్‌ క్యాపిటల్‌, షేర్‌ఖాన్‌ అంచనా వేశాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో వాటాల విక్రయంతో బ్యాంకు ఇతర ఆదాయం పెరుగుతుందని షేర్‌ఖాన్‌ పేర్కొంది. ప్రీప్రొవిజనింగ్‌ప్రాఫిట్‌  ఈ ఏడాది 65.10 శాతానికి చేరవచ్చని అంచనా. 
బ్యాంకు చెప్పే రుణాల లెక్కలకు, ఎన్‌సీఎల్‌టీ వద్దకు చేరిన పద్దులకు మధ్య తేడా ఎంతనే విషయమై అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 



You may be interested

10 షేర్లు..20 శాతం రాబడి..!

Friday 4th May 2018

ఈఏడాది డిసెంబరు నాటికి సెన్సెక్స్‌ 32,000 పాయింట్ల స్థాయికి పడిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బోఫాఎంఎల్‌) తాజాగా అంచనాను వెల్లడించింది. ఈ సంస్థ అంచనా ఇలా ఉండగా.. సమీపనెల (మే 31) ఆప్షన్స్‌ యాక్టివిటీ ఆధారంగా విశ్లేషించి చూస్తే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీని సాధిస్తే నిఫ్టీ మరో నూతన గరిష్టస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్

35వేల దిగువన సెన్సెక్స్‌

Friday 4th May 2018

ముంబై:- ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతకు తోడు దేశీయ ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా శుక్రవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 187 పాయింట్లు నష్టపోయి 34915 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్ల నష్టపోయి 10618 వద్ద ముగిశాయి. నేడు జీఎస్‌టీ కౌన్సిల్‌ 27వ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అప్రమత్తత వహించారు. అమెరికాలో నేటి రాత్రి ఏప్రిల్‌ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు విడుదల చేయనున్న నేపథ్యంలో

Most from this category