STOCKS

News


ఎల్‌ఐసీ ఐపీఓ.. నిజమైతే చాలా పాజిటివ్‌!

Friday 9th August 2019
Markets_main1565346819.png-27672

గౌరవ్‌గార్గ్‌, క్యాపిటల్‌ వయా రిసెర్చ్‌ లిమిటెడ్‌
డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని ఐపీఓకి తెచ్చే ఆలోచన చాలా పాజిటివ్‌ ముందడుగని క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ చెప్పారు. ఈ దఫా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తీసుకురావడం మంచిదన్న ఆలోచనలో ఉంది. ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి దాదాపు 74 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు వస్తే దేశంలో అతిపెద్ద విలువైన కంపెనీగా మారుతుందని మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. ఎకానమీలోని వివిధ రంగాల్లో ఎల్‌ఐసీ దాదాపు రూ. 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఎల్‌ఐసీ చందాదారుల పెట్టుబడులకు ఎల్‌ఐసీ యాక్ట్‌ రక్షణనిస్తుంది. ఒకవేళ ఎల్‌ఐసీని ఐపీఓకి తీసుకురావాలంటే ఈ యాక్ట్‌లోని సెక‌్షన్‌ 37తో పాటు కొన్నింటిని సవరించాల్సిఉంటుంది. కొత్తగా ఏర్పాటైన కంపెనీలే పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తుంటే 60 ఏళ్ల చరిత్రున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు రావడం వింతేమీకాదని, పైగా ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుందని గార్గ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో బీమా రంగానికి చెందిన ఎన్‌ఐఎ పబ్లిక్‌ఆఫర్‌కు రాగా మంచి స్పందన దక్కింది. ఇదే తరహాలో ఎల్‌ఐసీకి కూడా మంచి స్పందన వస్తుందని గార్గ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏయూఎం విలువ రూ. 31.11 లక్షల కోట్లుంది. వచ్చే ఐదేళ్లలో హైవే ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయలకు పైగా రుణాలిచ్చేందుకు ఎల్‌ఐసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎల్‌ఐసీ మార్కెట్లో లిస్టయితే అధిక వెయిటేజ్‌ దక్కించుకుంటుందని, అప్పుడు షేరులో చిన్న కదలిక కూడా సూచీని విపరీతంగా ప్రభావితం చేస్తుందని గార్గ్‌ చెప్పారు. ఇలాంటి చిన్నపాటి సమస్యలున్నా ఎల్‌ఐసీ ఐపీఓకి రావడం పారదర్శకతను పెంచుతుందని, ఎకానమీకి కూడా మంచిదని ఆయన చెప్పారు. 

 You may be interested

ఈ స్టాక్స్‌... మార్కెట్లకు ఎదురీత

Friday 9th August 2019

గత ఏడాదిన్నరగా స్టాక్‌ మార్కెట్లో మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ విభాగాలు ఇన్వెస్టర్లకు నికరంగా నష్టాలనే మిగిల్చాయి. బీఎస్‌ఈలో 90 శాతం నష్టాల పాలైన స్టాక్సే ఉన్నాయి. దీంతో వీటిల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఎక్కువ శాతం తుడిచిపెట్టుకుపోయినట్టుగానే భావించాలి. కానీ, ఓ 26 స్టాక్స్‌కు మాత్రం దీనికి మినహాయింపు. ఇవి సమస్యాత్మక కాలంలోనూ ఏటికి ఎదురీదాయి.    ఇంత క్లిష్ట సమయాల్లోనూ ఇన్వె‍స్టర్లకు మంచి రాబడులు ఇచ్చిన కంపెనీలు కెమికల్స్‌, కన్జ్యూమర్‌ ఫుడ్‌, ఫార్మా, షిప్పింగ్‌, టెలికం,

రెండో రోజూ లాభాలే..!

Friday 9th August 2019

11100పైన ముగిసిన నిఫ్టీ 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు అదనపు పన్ను మినహాయింపవచ్చనే అంచనాలతో మార్కెట్‌ రెండోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా మన ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద, నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.65 వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ రియల్టీ రంగ షేర్లకు

Most from this category