News


హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ ధర రూ.2,160..!

Wednesday 5th December 2018
Markets_main1544006303.png-22671

ముంబై: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) షేరు ధర బుధవారం ఒకదశలో రూ.1,854.80 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.44 (2.45 శాతం) లాభపడి రూ.1,852 వద్ద ముగిసింది. ఈ షేరుకు ఫిలిప్స్‌ కాపిటల్‌ (ఇండియా) బై కాల్‌ ఇచ్చింది. రూ.2,160 టార్గెట్‌ ధరను ప్రకటించింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) డీల్‌ ప్రకటన అనంతరం టార్గెట్‌ ధరను సవరించినట్లు తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌ 50 రెట్లు అంచనామేరకు టార్గెట్‌ను ఇచ్చినట్లు తెలిపింది. 2021 ఆదాయం 12 శాతం, ఎబిడిటా 27 శాతం, నికర ఆదాయం 29 శాతంగా అంచనావేసినట్లు వెల్లడించింది. ఇక ఈ షేరుకు ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ రూ.2,030 టార్గెట్‌ ధర ఇవ్వగా.. సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ ధరను రూ.1,750 నుంచి 2,010 వద్దకు సవరించింది.You may be interested

వ్యాలెట్‌లో మోసాలకు ఇకపై మీది కాదు బాధ్యత?

Wednesday 5th December 2018

ఆర్‌బీఐ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. అనధికారిక ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో (ఖాతాదారుని ప్రమేయం లేకుండా జరిగేవి) సైబర్‌ దాడి, హ్యాకింగ్‌ వంటి చర్యల వల్ల ఖాతాదారులు మోసపోతే అందుకు వారికి ఉండే బాధ్యత పరిమితం. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చినట్టయితే అస్సలు బాధ్యత లేనట్టే. ఇకపై ప్రీపెయిడ్‌ సాధనాలు (పీపీఐ) అయిన అమేజాన్‌ పే, పేటీఎం, మొబిక్విక్‌, ఫ్రీచార్జ్‌, ఆక్సిజెన్‌ వంటి వ్యాలెట్లకు కూడా ఇదే అమలు కానుంది.

రక్షణాత్మక ధోరణి అవసరం, సాహసోపేత నిర్ణయాలు వద్దు..!

Wednesday 5th December 2018

బసంత్ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ సూచన ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రస్తుతం మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను నిర్వహిస్తున్నారని ప్రముఖ మనీ మేనేజర్ బసంత్ మహేశ్వరి వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఇన్వెస్టర్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కంటే రక్షణాత్మక ధోరణిని అవలంభించడం మంచిదని సూచించారు. గడిచిన 45- 60 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం

Most from this category