News


అధిక సర్‌చార్జీలతో 40 శాతం ఎఫ్‌పీఐలపైనే ప్రభావం!

Wednesday 10th July 2019
Markets_main1562751130.png-26954

ఆర్థిక శాఖ విశ్లేషణ
బడ్జెట్లో విధించిన అధిక సర్‌చార్జీతో ఎఫ్‌పీఐల్లో 40 శాతం మందిపై ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఈ 40 శాతం ఎఫ్‌పీలు ట్రస్ట్‌ నిర్మితిని(ట్రస్ట్‌ స్ట్రక్చర్‌) అవలంబిస్తాయని, మిగిలిన 60 శాతం మంది కార్పొరేట్‌ నిర్మితిని పాటిస్తాయని వివరించింది. ఈ 60 శాతం ఎఫ్‌పీఐలపై అధిక సర్‌చార్జీ ప్రభావం ఉండదని తెలిపింది. పైన చెప్పిన 40 శాతం ఎఫ్‌పీఐలు ఎందుకు ట్రస్ట్‌ నిర్మితిని అవలంబిస్తున్నాయి? ఇందువల్ల వాటికి ఎలాంటి ప్రయోజనం వస్తుంది? అనే అంశాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ రూపంలోని ఎఫ్‌పీఐలు పన్ను స్వర్గధామాలుగా పేరుగాంచిన లక్సంబర్గ్‌, కేమెన్‌ ఐలాండ్‌ నుంచి కార్యకలాపాలు  నిర్వహిస్తుంటాయి. ఈ నిర్మితిలో వీటికి ఆయా దేశాల్లో పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతుంటాయి. తాజాగా పెంచిన సర్‌చార్జీని ఈ ఎఫ్‌పీఐలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి మరిన్ని రాయితీలు కల్పించడం దేశీయ మదుపరుల ప్రయోజనాల పట్ల వివక్ష చూపినట్లు అవుతుందని, అందువల్ల ఎలాంటి స్ట్రక్చర్‌లో ఉండాలో వారే నిర్ణయించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తునట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికాదాయ భారతీయులపై పన్ను రేటు పెంచినందున ఇలాంటి విదేశీ సంస్థలపై సర్‌చార్జి విధించడం సబబేనని తెలిపాయి.

రూ. 2కోట్ల పైచిలుకు వార్షికాదాయం ఉన్నవారిపై అధిక పన్ను భారం మోపుతూ ‍ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రస్తుతం రూ. 5కోట్లకు పైన వార్షికాదాయం ఉన్న వ్యక్తులపై ఎల్‌టీసీజీని 12 నుంచి 14.25 శాతానికి, ఎస్‌టీసీజీని 17.9 నుంచి 21.4 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఆదాయం ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి వ్యక్తి లేదా సంస్థ లేదా ట్రస్ట్‌కైనా ఈ అధిక సర్‌చార్జ్‌ వర్తిస్తుంది. అయితే ఈ అధిక సర్‌చార్జ్‌ కార్పొరేట్‌ కంపెనీలకు వర్తించదు. దేశంలో నాన్‌కార్పొరేట్‌ సంస్థలను వ్యక్తులుగా పరిగణించి పన్ను విధిస్తారు. ఈ నేపథ‍్యంలో ఎఫ్‌పీఐలు కార్పొరేట్‌ నిర్మితిలోకి మారి అధికంగా విధించే పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్రస్ట్‌ నిర్మితిలో ఇప్పటివరకు కార్యకలాపాలు నిర్వహించిన ఎఫ్‌పీఐలకు ఇకపై పెట్టుబడులపై పన్ను పెరుగుతుందని, అందువల్ల స్వల్పకాలంలో వీటి కార్యకలాపాల్లో మార్పులుండొచ్చని, ఇవి కొంతవరకు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చని ప్రముఖ అనలిస్టు వికస్‌ వాసల్‌ అభిప్రాయపడ్డారు. 



You may be interested

టాటా గ్రూప్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019

5నెలల కనిష్టానికి టాటా మోటర్స్‌ షేర్లు 4.50శాతం పతనమైన టాటా స్టీల్‌ 5వ రోజూ కొనసాగుతున్న టాటా పవర్‌, టాటా ఎలాక్సీ షేర్ల పతనం టాటా గ్రూప్‌ కంపెనీ షేర్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌నకు చెందిన టాటా మోటర్స్‌ షేర్లు 5నెలల కనిష్టానికి పతనమైంది. టాటా స్టీల్‌ షేర్లు 4.50శాతం నష్టపోయింది. టాటా ఎలక్సీ లిమిటెడ్‌, టాటా పవర్‌ షేర్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ గ్రూప్‌లో

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019

1.50శాతానికి పైగా నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  మార్కెట్‌ పతనంతో భాగంగా ప్రభుత్వరంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదురుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఈ ఇండెక్స్‌ నేడు 3,172.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ 1.67శాతం నష్టపోయి 3099.00 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:15ని.లకు ఇండెక్స్‌

Most from this category