News


ఎలారా క్యాపిటల్‌ నుంచి క్వాలిటీ పిక్స్‌

Tuesday 12th February 2019
Markets_main1549951171.png-24150

బడ్జెట్‌ ముగిసిపోవడంతో ఇకపై దేశీయ సూచీలు రాజకీయ యాక్టివిటీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాయని ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ సంక్షోభం లాంటివి రాజకీయ ప్రకంపనలకు ఉదాహరణలని తెలిపింది. సాధారణ ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధోరణి ఉంటుందని పేర్రొకంది. ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌ ఇప్పటికే 7 శాతం పతనమయ్యాయని తెలిపింది. ప్రధాన సూచీలతో సహా మార్కెట్లన్నీ ఆటుపోట్లకు గురయ్యే వేళ హైక్వాలిటీ స్టాక్స్‌ మాత్రమే నాణ్యమైన ఫలితాలు ఇస్తాయని గతానుభవాలు చెబుతున్నాయని వివరించింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత అనిశ్చితులు తొలగేవరకు దృష్టి పెట్టాల్సిన 11 స్టాకులను బ్రోకరేజ్‌ సంస్థ సిఫార్సు చేసింది.


హైక్వాలిటీ స్టాక్‌ సిఫార్సులు: కాస్ట్రాల్‌ ఇండియా, సైయంట్‌, ఐషర్‌ మోటర్స్‌, జిల్లెట్‌ ఇండియా, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఒరాకిల్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌టీవీ, టాటా ఎలాక్సి.

స్టాకుల నాణ్యతను గుర్తించేందుకు ఐదు పారామీటర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు ఎలారా క్యాపిటల్‌ తెలిపింది.
1. ఆర్‌ఓసీఈ: గత ఐదేళ్లుగా ఆర్‌ఓసీఈ 15 కన్నా ఎక్కువ ఉండాలి. విత్త క్రమశిక్షణ ఉన్న కంపెనీల ఆర్‌ఓసీఈ అధికంగా ఉంటుంది.
2. ఎన్‌ఓపీఏటీ మార్జిన్‌: నెట్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ ఆఫ్టర్‌ టాక్స్‌ మార్జిన్‌ స్థిరంగా ఉండాలి లేదా క్రమానుగత పెరుగుదల చూపాలి. ఈ మార్జిన్‌ కనీసం 10 శాతానికి తగ్గకుండా ఉండాలి. ఈ మార్జిన్‌ బాగున్న కంపెనీలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకోగలవు. వీటి ప్రైసింగ్‌ పవర్‌ ఎక్కువ. 
3. రుణాలు: నెట్‌ డెట్‌ టు ఈక్విటీ నిష్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 1 కన్నా తక్కువగా ఉండాలి. ఈ నిష్పత్తి తక్కువ ఉన్న కంపెనీల రుణభారం తక్కువ.
4. ఎఫ్‌సీఎఫ్‌ ఈల్డ్‌: ఫ్రీ క్యాష్‌ఫ్లో ఈల్డ్‌ గత ఐదేళ్లలో కనీసం నాలుగేళ్ల పాటు పాజిటివ్‌గా ఉండాలి. ఎఫ్‌సీఎఫ్‌ ఈల్డ్‌ పాజిటివ్‌గా ఉంటే మూలధన వ్యయాలకు కావల్సిన నిధులు సమయానికి అందుతున్నట్లు భావించాలి.
5. మొత్తం స్కోరు: పైన పేర్కొన్న పారామీటర్లన్నింటిలో కలిపి మంచి స్కోరు వచ్చిఉండాలి.You may be interested

నేటి నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ ఓఎఫ్‌ఎస్‌

Tuesday 12th February 2019

ఫ్లోర్‌ ధర రూ.689.52 రేపు రిటైల్‌ ఇన్వెస్టర్లకు న్యూఢిల్లీ:  యాక్సిస్‌ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేడు ప్రభుత్వం విక్రయిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌లో ఎస్‌యూయూటీఐ (ద స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ఇండియా)ద్వారా ఉన్న వాటాలో  3 శాతం వరకూ వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 1.98  శాతం వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌

పెరిగిన ఆంధ్రా బ్యాంకు నష్టాలు

Tuesday 12th February 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబరు త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబరు త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌- డిసెంబరు కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మొండి బకాయిల

Most from this category