News


బ్యాంకులకు ఏజీఆర్‌ భయాలు?!

Friday 17th January 2020
Markets_main1579247317.png-30991

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగంవైపు దృష్టిసారిస్తున్నారు. యూబీఎస్‌ గ్రూప్‌ వివరాల ప్రకారం మొబైల్‌ టెలికం కంపెనీలు ప్రభుత్వానికి 13 బిలియన్‌ డాలర్ల బకాయిలను చెల్లించవలసిఉంది. ఈ కారణంగా వైర్‌లెస్‌ టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ఈ ప్రభావం కనిపించే అవకాశముంది. ఏజీఆర్‌ చెల్లింపులు టెలికం కంపెనీల క్యాష్‌ ఫ్లోలను దెబ్బతీసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌పై ఈ ప్రభావం అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంటున్నాయి. అక్టోబర్‌లో ఖరారు చేసిన ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వచ్చే వారంలోగానే వొడాఫోన్‌ ఐడియా 4 బిలియన్‌ డాలర్లను చెల్లించవలసి ఉంది. ఇదే విధంగా భారతీ ఎయిర్‌టెల్‌ సైతం 3 బిలియన్‌ డాలర్లు చెల్లించవలసి ఉంది. కాగా.. మరోపక్క మొత్తం టెలికం కంపెనీల ఏజీఆర్‌ బకాయిలు రూ. 3.13 లక్షల కోట్లుకాగా.. వీటిలో బ్యాంకింగ్‌ రుణాలు రూ. 1.3 లక్షల కోట్లమేర ఉన్నట్లు క్రెడిట్‌ స్వీస్‌ ఇటీవల పేర్కొంది. సెప్టెంబర్‌కల్లా టెలికం రంగం బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల మొత్తం రూ. 1.1 ట్రిలియన్లవరకూ ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి.  

వొడాఫోన్‌ ఐడియా
లైసెన్స్‌ ఫీజు, స్ప్రెక్టమ్‌ వినియోగ చార్జీలుసహా వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 53,000 కోట్లవరకూ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వొడాఫోన్‌ ఐడియాకు రుణాలిచ్చిన బ్యాంకుల్లో యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ తొలి స్థానాల్లో నిలవగా.. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితరాలు సైతం ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. వొడాఫోన్‌ ఐడియా రుణాలలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ వాటా 8-12 శాతం వరకూ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

యూబీఎస్‌ వివరాల ప్రకారం వొడాఫోన్‌ ఐడియా రుణాలలో బ్యాంకుల వాటా శాతాలలో ఇలా ఉంది.

బ్యాంక్‌ పేరు రుణ శాతం
యస్‌ బ్యాంక్‌     2.1
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2
స్టేట్‌బ్యాంక్‌     0.8
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.7
ఐసీఐసీఐ బ్యాంక్‌     0.3

 



You may be interested

26 నెలల గరిష్టానికి ఎయిర్‌టెల్‌

Friday 17th January 2020

ఏజీఆర్‌ రివ్యూ పిటీషన్‌ సుప్రీం కోర్టుకు కొట్టివేసిన నేపథ్యంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 26నెలల గరిష్టస్థాయిని అందుకుంది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో అధిక భాగం మార్కెట్‌ వాటాను దక్కించుకుంటుందనే అంచనాలు షేరు ర్యాలీకి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో​కంపెనీ షేరు రూ.470.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు

శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 17th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు  భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా:- టెలికం సంస్థలు దాఖలు చేసిన ఏజీఆర్‌ సమీక్షా పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.  యస్‌ బ్యాంక్‌:-  యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను మూడీస్‌ సమీక్షలో ఉంచింది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌:- మూడో త్రైమాసిక నికరలాభం 8 శాతం పెరిగి రూ.90.5 కోట్లకు చేరింది. ఎన్‌ఐఐ 15.6 శాతం పెరిగి రూ.601.8   కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయి(ఎన్‌పీఏ)లు 4 బేసిస్‌పాయింట్లు

Most from this category