News


హైడివిడెండ్‌ స్టాక్స్‌పై కన్నేయండి!

Tuesday 7th January 2020
Markets_main1578379564.png-30729

జీసెక్‌ ఈల్డ్స్‌ కన్నా బెటర్‌
నిపుణుల సూచన
ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్‌ తగ్గిపోతున్న నేపథ్యంలో అధిక డివిడెండ్‌ ఈల్డ్స్‌ ఉన్న షేర్లపై పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 2018లో పదేళ్ల జీసెక్‌ ఈల్డ్‌ 8 శాతం ఉండగా, ప్రస్తుతమిది 6.5 శాతానికి చేరింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు హైడివిడెండ్‌ ఈల్డ్‌ స్టాక్స్‌వైపు మరలుతున్నారు.

ఇలా అధిక డివిడెండ్‌ ఇస్తున్న కొన్ని టాప్‌ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి...

1. ఎస్‌జేవీఎన్‌: షేరు 2018-19 సంవత్సర డివిడెండ్‌ ఈల్డ్‌కు 8.3 శాతం వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది కూడా ఇంతే మొత్తంలో డివిడెండ్‌ ఈల్డ్‌ ఉండొచ్చని అంచనాలున్నాయి. కంపెనీ వద్ద మిగులు నిధులు దాదాపు రూ.3300 కోట్లున్నాయి. కంపెనీలో ప్రభుత్వ వాటాపై అయోమయం వీడిపోతే మరింత రాణించగలదు.
2. వేదాంత: కంపెనీ 2018-19 సంవత్సర డివిడెండ్‌ ఈల్డ్‌కు 12.6 శాతం వద్ద ట్రేడవుతోంది. మూడేళ్లుగా అధిక డివిడెండ్స్‌ ఇస్తోంది. ప్రమోటర్‌ గ్రూప్‌నకు వేదాంత డివిడెండ్లే రుణాలు తీర్చేందుకు మూలాధారంగా ఉన్నాయి. ఈ ఏడాది కొత్త మేర డీ-ఈల్డ్‌ తగ్గినా 8 శాతానికి పైనే ఉంటుందని అంచనా. ప్రమోటర్ల తదుపరి అడుగులపై స్పష్టత వస్తే మరింత మెరుగుదల చూపుతుంది.
3. ఓఐఎల్‌: ఆయిల్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సర డివిడెండ్‌ ఈల్డ్‌ అంచనాలకు 7.6 శాతం వద్ద ట్రేడవుతోంది. క్రూడాయిల్‌ ధరలు పెరగడం కంపెనీకి కలిసివస్తుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి బడా వ్యయ ప్రణాళికలు లేనందున మిగులు నిధులు పెరగవచ్చు. చమురు, గ్యాస్‌ రంగంలో చౌకైన షేరుగా చెప్పవచ్చు. 
4. కోల్‌ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సర డివిడెండ్‌ ఈల్డ్‌ అంచనాలకు 7 శాతం వద్ద ట్రేడవుతోంది. కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ. 33,500 కోట్లున్నాయి. రాబోయే రెండేళ్ల పాటు రూ. 25వేల కోట్ల మేర నికర లాభాలు ఆర్జిస్తుందని అంచనా. డిసెంబర్‌ నుంచి ఉత్పత్తి పెరిగినందున కొత్త ఏడాది మరింతగా దూసుకుపోగలదు.
5. బామర్‌ లారీ ఇన్వెస్ట్‌మెంట్స్‌: కంపెనీ క్రమంగా డివిడెండ్‌ పేఅవుట్స్‌ను పెంచుకుంటూ పోతోంది. కంపెనీ వద్ద మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో 25 శాతానికి సమానమైన రూ.410 కోట్ల నగదు నిల్వలున్నాయి. 



You may be interested

ఈక్విటీల కంటే బంగారమే బెటర్‌: విశ్లేషకులు

Tuesday 7th January 2020

ఈ ఏడాది కూడా పసిడిదే హవా అంటున్న విశ్లేషకులు  పోర్ట్‌ఫోలియోలో పసిడికి 15శాతం కేటాయించమని సలహా గతేడాది ఈక్విటీల కంటే అధిక రాబడులను పంచిన పసిడి.. ఈ ఏడాది కూడా ట్రెండ్‌ను కొనసాగించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లపై మెతక ధోరణి తదితర అంశాలతో 2019 ఏడాదిలో కామెక్స్‌ (న్యూయార్క్‌) గోల్డ్‌ పసిడి 14శాతం ర్యాలీ

మళ్లీ షుగర్‌ షేర్ల దూకుడు

Tuesday 7th January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ 52 వీక్‌ హై- బలరామ్‌పూర్‌, ఈఐడీ, ద్వారికేష్‌  ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బలరామ్‌పూర్‌ చినీ, ద్వారికేష్‌ షుగర్‌, ఈఐడీ ప్యారీ తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. చెరకు దిగుబడి, చక్కెర

Most from this category