News


డివిడెండు చెల్లింపుల్ని పెంచుతున్న కంపెనీలివే!

Saturday 4th January 2020
Markets_main1578120338.png-30673

సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలో అత్యధిక రిటర్నులు ఆశిస్తూ పెట్టుబడులకు దిగుతుంటారు. ఇదే సమయంలో కంపెనీ లాభాల నుంచి ప్రకటించే డివిడెండ్లకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు. క్యాష్‌ఫ్లోలు మెరుగ్గా ఉండే కంపెనీలు సాధారణంగా అధిక డివిడెండ్లను అందిస్తుంటాయంటున్నారు స్టాక్‌ విశ్లేషకులు. కాగా.. అటు డివిడెండ్లు, ఇటు షేర్ల ధరల పెరుగుదల ద్వారా రెండు వైపులా లాభాలు పొందే ప్రణాళికలకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ బాటలో గత మూడేళ్లుగా అత్యధిక డివిడెండ్లు పంచిన మిడ్‌ క్యా‍ప్‌ స్టాక్స్‌, బ్లూచిప్స్‌ను చూద్దాం..

లాభాల నుంచి చెల్లింపు
సాధారణంగా కంపెనీలు వార్షికంగా ఆర్జించే లాభాల నుంచి వాటాదారులకు డివిడెండ్లను చెల్లిస్తుంటాయి. ఇందుకు కొంతమేర నిధులను కేటాయిస్తాయి. అధిక డివిడెండ్లు పంచే కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్లు షేరు ధర పెరగడం ద్వారా పెట్టుబడి వృద్ధినీ ఆశించడం సహజం. కంపెనీలు నిరవధికంగా డివిడెండ్లు చెల్లించాలంటే బిజినెస్‌లో స్థిరమైన వృద్ధిని సాధిస్తూ ఉండాలంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇలా అధిక డివిడెండ్లు చెల్లించే అన్ని కంపెనీల షేర్ల ధరలూ కచ్చితంగా పెరగకపోవచ్చంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత బిజినెస్‌లు పటిష్ట క్యాష్‌ఫ్లోలు సాధిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో వృద్ధికి పెట్టుబడులుగా నిధులను వినియోగించకపోవడం అధిక డివిడెండ్లకు కారణంకావచ్చని చెబుతున్నారు. ఇదే విధంగా మరోరకమైన ఉదాహరణగా పీఎస్‌యూ కంపెనీలను ప్రస్తావిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న పలు పీఎస్‌యూలనుంచి అధిక డివిడెండ్లను ఆశిస్తున్న విషయాన్ని తెలియజేశారు. 

డివిడెండ్ల జాబితాలో 
గత మూడేళ్లలో డివిడెండ్ల చెల్లింపులను పెంచుకుంటూ వస్తున్న కంపెనీలలో నాల్కో, ఎన్‌టీపీసీ వంటి పీఎస్‌యూలతోపాటు.. వేదాంతా, ఐబీ హౌసింగ్‌ వంటి ప్రయివేట్‌ రంగ సంస్థలకూచోటు లభిస్తోంది. కనీసం 2 శాతం డివిడెండును చెల్లిస్తూ రూ. 1,000 కోట్లకుపైగా మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) కలిగిన కంపెనీల జాబితాను చూస్తే.. 

కంపెనీ పేరు        డివిడెండ్‌ ఈల్డ్‌(%)

   2017  2018  2019
నాల్కో 3.68 8.54 10.38
వేదాంతా 7.08 7.62 10.26
బామర్‌ లారీ 2.97 4.60 5.93
పీటీసీ ఇండియా 3.23 4.59 5.44
టైడ్‌ వాటర్‌  2.49 2.86 5.07
ఐబీ హౌసింగ్‌ 2.71 3.31 4.67
ఎన్‌టీపీసీ 2.88 3.02 4.49
పవర్‌గ్రిడ్‌ 2.21 2.71 4.20
గుజరాత్‌ ఇండ. 2.61 2.78 4.07
గుజరాత్‌ పిపా.  2.31 2.36 3.51
ఇంజినీర్స్‌ 2.08 2.53 3.42
హీరో మోటో 2.64 2.68 3.40
వీఎస్‌టీ ఇం. 2.60 2.66 2.73
హాకిన్స్‌ 2.41 2.50 2.60
            
 You may be interested

బంగారం మరింత పెరిగి ఛాన్స్‌..!?

Saturday 4th January 2020

గడచిన ఏడాదిలో పసిడిని కొనుగోలును నిర్లక్ష్యం చేసిన ఇన్వెస్టర్లు 18శాతం రాబడిని కోల్పోయానే నిరాశ చెందాల్సిన పని లేదు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈ ఏడాది ఆరంభంలో పసిడి కొనుగోలు చేస్తే సంవత్సరాంతం కల్లా 25శాతం రాబడిని పొందవచ్చని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. పలు దేశాల కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌లు పసిడి నిల్వల కొనుగోలుకు మొగ్గు చూపుతుండటం, అమెరికా కరెన్సీ డాలర్‌ బలహీనత, అంతర్జాతీయంగా విస్తరిస్తున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో

బుల్స్‌కు 12100 పాయింట్లు కీలకం!

Saturday 4th January 2020

సచ్చిదానంద్‌ అంచనా దేశీయ మార్కెట్లు గురువారం ర్యాలీ అనంతరం శుక్రవారం వెనుకంజ వేశాయి. అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాంశాలు వేడక్కడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్‌ కూడా నెగిటివ్‌గా ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 12250 పాయింట్లకు దిగువన ముగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 12100 పాయింట్లు చాలా కీలకమని, బుల్స్‌ ఈ స్థాయిని కాపాడుకోలేకపోతే కరెక‌్షన్‌ తప్పదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు సచ్చిదానంద ఉట్టేకర్‌ అంచనా వేశారు. ఈవారం మార్కెట్‌ పరిమిత

Most from this category