News


బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ప్రయోజనం..!

Saturday 1st February 2020
Markets_main1580561500.png-31407

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాల్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని, ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏయే రంగాలకు బడ్జెట్‌ మేలును చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం...

ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- రవాణారంగ అభివృద్ధిలో భాగంగా రహదారులు, రైల్వే లైన్ల కోసం కేంద్రం ​ప్రత్యేక దృష్టిని సారించింది. రవాణా మౌలిక సదుపాయాల కోసం 2020-21 బడ్జెట్‌లో రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయంతో ఎల్‌ అండ్‌ టీ, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రా కంపెనీ షేర్లకు లబ్ది కలుగవచ్చు.
ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్ తయారీతో పాటు వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో డిక్సన్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, సుబ్రోస్ కంపెనీ షేర్లకు కలిసొస్తుందని ఇండియానీవేష్‌ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ అన్నారు.
గ్రామీణ ప్రాంత సంబందిత షేర్లు:- బడ్జెట్‌లో వ్యవసాయ, గ్రామీణ రంగాలకు రూ.2.83 ట్రిలియన్ కేటాయించారు. వచ్చే ఏడాది వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.15 ట్రిలియన్ నిర్ణయించారు. సాగర్ మిత్ర పథకంలో గ్రామీణ, యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం, పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాలకు చేయూతనిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 200 లక్షల టన్నులు మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. అందులో భాగంగా మత్స్య సంపదను మరింత పెంచేందుకు 500 చేపల ఫామ్‌ సంస్థలను సృష్టించడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రణాళికతో అవంతి ఫీడ్స్‌, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ కంపెనీ షేర్లకు కలిసోస్తుంది. మత్స్య సంపదను మరింత పెంచేందుకు 500 చేపల ఫామ్‌ సంస్థలను సృష్టించడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు గూడ్స్‌ రైళ్లు, శీతల గిడ్డంగులు, గిడ్డంగుల నిర్మాణాల అవసరం అవుతాయి. ఈ నిర్ణయాలతో ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన ఇమామి, హిందూస్థాన్‌ యూనిలివర్‌, డాబర్‌, టాటా గ్లోబల్‌ షేర్లు ర్యాలీ చేసే అవకాశం ఉంది.
నీటి సంబంధిత షేర్లు:- కరువు, నీటి కొరత ఉన్న జిల్లాల్లో వ్యవసాయ రంగ వృద్ధికి సహాయపడే చర్యలను సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో నీరు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలను రూపకల్పన చేసే వీఏ టెక్‌ వాగ్‌బాగ్‌ లిమిటెడ్‌ షేర్ల ర్యాలీ ఇది సహాయపడుతుంది. బంజరు భూముల కలిగి రైతులు సోలార్‌ పంపుల ఏర్పాటుకు  సహాయపడే ప్రతిపాదనల పరిశీలిస్తామని ప్రకటనతో ఈ రంగంలో సేవలను అందించే శక్తి పంపులు ఇండియా లిమిటెడ్ మూడువారాల గరిష్టస్థాయికి ఎగిసింది. వచ్చే రోజుల్లో ఇదే రంగానికి చెందిన జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, కేబీఎస్‌ లిమిటెడ్‌, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌, జేకే అగ్రి జెనిటిక్‌ లిమిటెడ్‌, పీఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు లబ్ది పొందే అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి 123 బిలియన్‌ రూపాయిలు కేటాయించింది. ఈ అంశం హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, ప్రొక్టర్ గాంబుల్, గోద్రేజ్  షేర్లకు కలిసొస్తాయి.

టెలికాం షేర్లు:- గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బాండ్‌ సేవలను విస్తరించే దిశగా ‘‘భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్’’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు రూ.60 బిలియన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ లిమిటెడ్‌ షేర్లకు కలిసొస్తుంది.
ఆన్‌లైన్‌ ఎడ్యుకేటర్‌:- బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యువ ఇంజినీర్లకు ఉపాధి కల్పిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిగ్రీ లెవల్ లో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కి ప్రతిపాదన తీసుకొస్తామని అన్నారు. ఈ విదానంతో ఆన్‌లైన్‌లో విద్యారంగ సేవలు అందించే ఎన్‌ఐఐటీ, ఎంటీ ఎడ్యుకేర్‌ షేర్లకు కలిసొస్తుంది.
ఐటీ షేర్లు:- కొత్త అవకాశాలను అందుకునేందుకు డేటా సెంటర్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాతో పాటు ఎల్‌టిఐ, మైండ్‌ట్రీ, పెర్సిస్టెంట్, మరియు మధ్య తరహా సంస్థలతో సహా అన్ని ఐటి సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. You may be interested

బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ఏమీ లేదు..!

Saturday 1st February 2020

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాలన్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

అంచనాలు అధికం... అందుకోలేని బడ్జెట్‌!

Saturday 1st February 2020

దేశీయ సూచీలు శనివారం భారీ పతనం నమోదు చేశాయి. బడ్జెట్లో కోట్ల రూపాయాల మేర సాగు, ఇన్‌ఫ్రా రంగాలకు మద్దతు పథకాలు ప్రకటించినా, డీడీటీ ఎత్తివేసినా, ఐటీ స్లాబులు తగ్గించినా.. సూచీలకు పెద్దగా రుచించలేదు. నిర్మలమ్మ సంస్కరణలు మార్కెట్‌ అంచనాలను సంతృప్తి పరచలేకపోయాయని రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌, మార్కెట్‌పై వివిధ అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... = వినోద్‌ నాయర్‌, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌: మార్కెట్లో అంచనాలతో పోలిస్తే బడ్జెట్‌ చాలా పేలవంగా

Most from this category