STOCKS

News


బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ఏమీ లేదు..!

Saturday 1st February 2020
Markets_main1580561976.png-31408

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాలన్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏయే రంగాలకు  నష్టాన్ని మిగులుస్తుందో ఇప్పుడు చూద్దాం...


బీమారంగ షేర్లు:- ఐపీఓ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీలో వాటా విక్రయిస్తామని సీతారామన్‌ తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ బీమా సంస్థల షేర్లలో క్షీణత కన్పించింది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్,  నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు నేడు నష్టాలను చవిచూశాయి. వాస్తవానికి 2019 లో ఈ షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌:- మొండి బకాయిలతో సతమతవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కేంద్రమంత్రి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొంత మూలధనాన్ని కేటాయింపులు జరపవచ్చని బ్యాంకులు ఆశించాయి. ఒకవేళ ఏడాది బ్యాంకుల ఎలాంటి మూలధనాన్ని కేటాయించకపోతే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు రానున్న రోజుల్లో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గడిచిన పదిరోజుల్లో బీఎస్‌ఈలోని ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఇండెక్స్‌ 1.50శాతం నష్టాన్ని చవిచూసింది.
ఫెర్టిలైజర్‌ రంగం:- రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సాహకాల మార్పుతో సమతుల్యం చేయాలని సీతారామన్ ప్రతిపాదనతో రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారీ క్షీణతను చవిచూసింది. రసాయన ఎరువుల వాడకాన్ని ప్రోత్సాహకాల మార్పుతో సమతుల్యం చేయాలని సీతారామన్ ప్రతిపాదించడంతో రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల తయారీలో క్షీణతను విస్తరించింది. ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే జీరో -బడ్జెట్ వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళూర్‌ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌, చంబల్‌ ఫెర్టిలైజర్‌, కెమికల్‌ లిమిటెడ్‌, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ షేర్లు రానున్న రోజుల్లో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లాజిస్టిక్స్‌ షేర్లు:- దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నేషనల్ లాజిస్టిక్స్ పాలసీపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో  బ్లూ డార్ట్, గతి, మహీంద్రా లాజిస్టిక్స్‌ షేర్లు తీవ్ర నిరాశకు లోనయ్యాయి.
రియల్‌ ఎస్టేట్‌& నిర్మాణ రంగ షేర్లు: ఈ రంగానికి ప్రత్యేకంగా ఎలాంటి ఉద్దీపనలు ప్రకటించకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలైన గోద్రేజ్‌ పాపర్టీస్‌, ఒబేరాయ్‌ రియల్టీ ఎస్టేట్స్‌, డీఎల్‌ఎఫ్‌, ప్రస్టేజ్‌ ఎస్టేట్స్‌ లాంటి షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. డెవలపర్‌లకు రుణాల లభ్యతను పెంచడటం,  పరిశ్రమ స్థితి,  అమ్మకాలను ప్రోత్సహించే ఇతర చర్యలను కేంద్రం తీసుకోవాలనే డిమాండ్‌ ఈ రంగం నుంచి ఉంది. You may be interested

డీడీటీ పోయి.. టీడీఎస్‌ వచ్చెన్‌

Sunday 2nd February 2020

డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ)ను ఎత్తివేయడం ఈ బడ్జెట్‌లో ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. దీంతో కంపెనీలపై పన్నుల భారం తగ్గిపోయి.. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి మీదకు భారం మళ్లినట్టయింది. ఇన్వెస్టర్లు డివిడెండ్‌ రూపంలో అందుకున్న ఆదాయాన్ని తమ వార్షికాదాయానికి కలిపి చూపించుకోవాలి. తాము ఏ శ్లాబులో ఉన్నామో ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికీ డీడీటీ భారం

బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ప్రయోజనం..!

Saturday 1st February 2020

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాల్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని, ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

Most from this category