News


ఝున్‌ఝున్‌వాలా పోర్టుఫోలియోలో ఏ స్టాకులున్నాయ్‌!

Monday 7th October 2019
Markets_main1570441827.png-28758

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా..పరిచయం అక్కర్లేని పేరు. దలాల్‌ స్ట్రీట్‌లో 1985లో కేవలం రూ. 5,000తో మొదలైన ఆయన ప్రయాణం, బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం 2019 అగష్టు నాటికి  రూ. 17,500 కోట్లకు చేరుకుంది.ఇండియా వారెన్‌బఫెట్‌గా పిలుచుకునే ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌, 30 కి పైగా స్టాకులలో 1 శాతం కంటే అధిక వాటాను కలిగి ఉన్నారు. ఈయన పోర్టుఫోలియో విలువ సుమారుగా రూ. 13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఫోర్టుపోలియోలో ఉన్న టాప్‌ స్టాకులను కింద గమనించవచ్చు...
టైటాన్‌
జూన్‌ 2019 నాటికి,  టైటాన్‌ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు రూ. 7,837 కోట్ల విలువ కలిగిన 7.05 శాతం వాటా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాకు 34.41 శాతం లాభపడడం గమనార్హం. కానీ ఆర్థిక సమస్యల వలన ఈ పరిశ్రమలో మందగమనం చోటుచేసుకోవడంతోపాటు, నిర్మించనున్న మౌలిక ప్రాజెక్టులకు నిధులు అందడంలో ఆలస్యం జరగడంతో ఈ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ కొంత నష్టపోయిన విషయం కూడా గమనించాలి.
లుపిన్‌
ఫార్మా కంపెనీ అయిన లుపిన్‌లో ఝున్‌ఝున్‌వాలాకు 1.71 శాతం (జూన్‌ త్రైమాసికపు షేర్‌హోల్డింగ్‌ డేటా ప్రకారం) వాటా ఉంది. దీని విలువ రూ. 520 కోట్లకు పైగా ఉండడం గమనార్హం. ఈ కంపెనీ స్టాకు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 20.08 శాతం నష్టపోయింది. 
క్రిసిల్‌
ఈ రేటింగ్‌ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు 5.49 శాతం వాటా ఉంది. దీని విలువ రూ. 516 కోట్లు కావడం​గమనార్హం. ఈ స్టాకు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 19.7 శాతం నష్టపోయింది.
ఫెడరల్‌ బ్యాంక్‌
ఈ బిలీయనీర్‌ ఇన్వెస్టర్‌, ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌లో రూ. 492 కోట్లు విలువైన 2.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. జూన్‌ త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ లాభంలో 46 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికి, ఈ ఏడాది ప్రారంభం​నుంచి ఇప్పటి వరకు ఈ బ్యాంక్‌ షేరు 9.5 శాతం నష్టపోయింది.
ఎస్కార్ట్స్‌
ఈ ఇంజనీరింగ్‌ కంపెనీలో రూ. 454.25 కోట్ల విలువైనా వాటాను కలిగి ఉన్నారు. ఈ కంపెనీ జూన్‌ త్రైమాసికపు లాభాలు తగ్గాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్‌ 16 శాతం పతనమవడం గమనార్హం. 
వీఐపీ
ఝున్‌ఝున్‌వాలా, ట్రావెల్‌ వస్తువులు, లగేజీ బ్యాగ్‌ల తయారి సంస్థయిన వీఐపీలో రూ. 322 కోట్ల విలువైన 4.99 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ స్టాక్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11.32 శాతం పడిపోయింది.
డెల్టా కార్ప్‌
ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలా 7.38 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీని విలువ రూ. 310 కోట్లు. కాగా  మార్కెట్‌లో నమోదైనా ఏకైక ఇండియా క్యాసినో గేమింగ్‌ ఇండస్ట్రీ కంపెనీ ఇదే కావడం గమనార్హం. ఈ కంపెనీ స్టాకు ఈ ఏడాది ప్రారంభం నుం‍చి ఇప్పటి వరకు 39 శాతం పతనమయ్యింది.
ఎన్‌సీసీ
నిర్మాణ, ఇంజనీరింగ్‌ కంపెనీ ఎన్‌సీసీలో ఝున్‌ఝున్‌వాలాకు రూ. 293 కోట్ల విలువైన 9.86 శాతం వాటా ఉంది. కాగా జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ వృద్ధి ప్లాట్‌గా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ స్టాక్‌ 44 శాతం నష్టపోవడం గమనార్హం. 
ర్యాలీస్‌ ఇండియా
టాటా కెమికల్స్‌ కంపెనీకి అనుబంధ కంపెనీ అయిన ర్యాలీస్‌ ఇండియాలో ఈ ఇన్వెస్టర్‌కు 9.25 శాతం వాటా ఉంది. దీని విలువ సమారు రూ. 293 కోట్లు. ఈ కంపెనీ స్టాకు విలువ ఈ ఏడాది 9.79 శాతం నష్టపోయింది.
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఝున్‌ఝున్‌వాలాకు రూ. 195 కోట్ల విలువైన 4.21 శాతం వాటా ఉంది. ఈ ఏడాది ఈ స్టాక్‌ 35 శాతం పైగా నష్టపోవడం గమనార్హం. కానీ జూన్‌ త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ లాభం 59 శాతం పెరిగి రూ. 73 కోట్లుగా నమోదైంది.



You may be interested

ఫార్మా షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Monday 7th October 2019

యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాల ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు దాదాపు 3.50శాతం నష్టపోయింది. అత్యధికంగా అరబిందో ఫార్మా షేర్లు 20 శాతంపైగా కుప్పకూలాయి. అదేబాటలో గ్లెన్‌మార్క్ షేర్లు 9శాతం పతనమయ్యాయి. పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌  షేర్లు 8శాతం, లుపిన్‌ 3.50శాతం, సిప్లా 2.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 2శాతం, బయోకాన్‌, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం

మా ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని మించుతాయ్‌: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ పునిత్ గోయెంకా

Monday 7th October 2019

ప్రమోటర్ల తనఖా షేర్ల విక్రయంతో గతకొంతకాలంగా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోంటున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో మూడు నెలల్లో మార్కెట్‌ అంచనాలు తలకిందులు చేస్తూ మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునిత్ గోయెంకా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో వ్యాపార అనిశ్చితిని అరికట్టడానికి రాబోయే మూడు నెలల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలని జీ  ప్రమోటర్లు కోరుకుంటున్నారని  పునిత్ గోయెంకా అన్నారు. మీడియా సంస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 22శాతానికి సమానమైన

Most from this category