News


మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..?

Friday 21st February 2020
Markets_main1582223891.png-31970

హెచ్‌ఢీఎఫ్‌సీ ఏఎంసీ, ఇండియా మార్ట్‌ ఇంటర్‌మెష్‌, యాఫిల్‌ ఇండియా, ఐఆర్‌సీటీసీ ఈ ఐపీవోలు గుర్తుండే ఉంటాయి.. గత ఏడాదిన్నర కాలంలో లిస్ట్‌ అయిన ఈ కంపెనీలు.. ఇష్యూ ధరతో పోలిస్తే పలు రెట్లు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు తినిపించాయి. ఈ బస్సులను మిస్‌ అయ్యామని బాధ పడక్కర్లేదు. మరో మల్టీబ్యాగర్‌ వచ్చేస్తోంది..! ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ ఐపీవోకు సెబీ ఆమోదం జారీ చేయగా.. గ్రే మార్కెట్‌లో 40 శాతం ప్రీమియం ధర పలుకుతుంది. గ్రే మార్కెట్‌ అన్నది ఇన్వెస్టర్ల మధ్య అనధికారికంగా జరిగే ఒప్పంద లావాదేవీల వేదిక. ఐపీవోలో షేర్లు అలాట్‌ అయితే ఇంత ప్రీమియంకు విక్రయిస్తామనే వారితో కొనుగోలు దారులు బ్రోకర్ల ద్వారా అంగీకారం కుదుర్చుకుంటారు. 

 

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో మార్చి 2-5వ తేదీల మధ్య రానుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే వారంలో షేరు ధరల శ్రేణి వెల్లడి కానుంది. ‘‘షేరు ధరల శ్రేణి రూ.690-710 మధ్య ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. స్టాక్‌ ప్రీమియం రూ.270-280 పలుకుతోంది’’ అని అల్టిమేట్‌ వెల్త్‌ఓల్‌ సంస్థకు చెందిన అభిషేక్‌ చతుర్వేది తెలిపారు. ఈ సంస్థ అన్‌లిస్టెడ్‌ షేర్లలో లావాదేవీలు చూస్తుంటుంది. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఇష్యూకు అధిక స్పందన లభిస్తుందని చాలా వరకు మార్కెట్‌ భాగస్వాములు అంచనా వేస్తున్నారు. ఐపీవో ప్రారంభం అయిన తర్వాత స్పందన బట్టి గ్రే మార్కెట్‌ ప్రీమియం ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ‘‘ఒక్కసారి షేరు ధరల శ్రేణిని ప్రకటిస్తే ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. షేరు ధరల శ్రేణి అంచనాలకు అనుగుణంగానే ఉంటే ప్రీమియం 50 శాతాన్ని దాటొచ్చు. ఒకవేళ ధరల శ్రేణి రూ.1000కు సమీపంలో నిర్ణయిస్తే ప్రీమియం ప్రస్తుత స్థాయిల్లోనే ఉండిపోవచ్చు’’ అని చతుర్వేది వివరించారు.

 

ఇష్యూలో 10 శాతం ఎస్‌బీఐ వాటాదారులకు కేటాయించడం జరుగుతుంది. ‘‘ఎస్‌బీఐ వాటాదారులకు షేర్ల కేటాయింపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని అన్‌లిస్టెడ్‌ జోన్‌కు చెందిన దినేష్‌గుప్తా తెలిపారు. ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నేపథ్యంలో ఈ ప్రభావం ఎస్‌బీఐ షేరుపైనా ప్రతిఫలిస్తోంది. గత కొన్ని సెషన్లలో ఈ స్టాక్‌ కొంత లాభపడింది. గతేడాది కాలంలో ఎస్‌బీఐ షేరు 22 శాతం ర్యాలీ చేసింది. ఎస్‌బీఐ కార్డ్స్‌ గత 4-5 ఏళ్లుగా మంచి వృద్ధి చూపిస్తోందని, దీర్ఘకాలం కోసం కొనుగోలు చేసుకోతగిన స్టాక్‌గా గుప్తా పేర్కొన్నారు. ‘‘ఇది మల్టీబ్యాగర్‌ స్టాక్‌ అవుతుంది. ఐపీవోలో అలాట్‌ అయితే పోర్ట్‌ఫోలియోలో ఎప్పటికీ ఉంచుకోవచ్చు. ఇది తప్పనిసరిగా కొనుగోలు చేసుకోవాల్సినది. ఐఆర్‌సీటీసీ మాదిరిగా ఐపీవో ఈ కంపెనీ వాస్తవ విలువను నిర్ణయించనుంది’’ అని చతుర్వేది పేర్కొన్నారు.



You may be interested

శామ్‌సంగ్‌కు కరోనా వరం!

Friday 21st February 2020

చైనా కంపెనీల ప్రణాళికలపై వైరస్‌ ప్రభావం ఉత్పత్తుల విడుదలలో జాప్యం దూకుడు పెంచిన శామ్‌సంగ్‌ 9 మొబైల్‌ ఫోన్ల విడుదలకు ప్రణాళిక న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలను కలవర పెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్‌ ఈ వైరస్‌ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్‌ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్‌ సంస్థల ప్రణాళికలపై కోవిడ్‌ ప్రభావం చూపిస్తోంది. యాపిల్‌తోపాటు చైనాకు చెందిన షావోమీ,

అప్‌ట్రెండ్‌ చాన్స్‌ మిగిలే ఉంది..!

Friday 21st February 2020

నిఫ్టీ గురువారం 12,150 స్థాయిల్లో నిరోధాన్ని ఎదుర్కొని, చివరికి స్వల్ప నష్టంతో 12,080 వద్ద క్లోజయింది. డైలీ చార్ట్‌లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. అప్‌ట్రెండ్‌ అవకాశాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ గత రెండు సెషన్లలోనూ 50డీఎంఏ వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. డైలీ చార్ట్‌లో గరిష్టంలో గరిష్టం, కనిష్టాలను నమోదు చేసిందని, వీక్లీ చార్ట్‌లో ప్రోత్సాహకర సంకేతాలను ఇచ్చిందని, దీంతో ఇండెక్స్‌ ఇక ముందూ

Most from this category