STOCKS

News


6శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్‌

Monday 25th November 2019
Markets_main1574670293.png-29837

గతవారంలో వరుస మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాలను చవిచూసిన భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఈ వారం మొదటిరోజే లాభాల బాట పట్టింది. బీఎస్‌ఈలో సోమవారం ఈ కంపెనీ షేరు రూ.421.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌తో పాటు వోడాఫోన్‌ కంపెనీ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. మరోవైపు సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ కంపెనీ షేరుకు రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటుగా టార్గెట్‌ ధరను పెంచాయి. ఫలితంగా షేరు ఇంట్రాడేలో దాదాపు 6శాతం పెరిగి రూ.445.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.421.00)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.444 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.254.29, రూ.452.95లుగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో  ప్రారంభం నుంచి నవంబర్‌ 22 నాటికి ఎయిర్‌టెల్‌ షేరు 47శాతం ర్యాలీ చేసింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ సూచీ 12శాతం పెరిగింది. 

ఇటీవల టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎయిర్‌టెల్‌తో పాటు వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు సుప్రీం కోర్టు తలుపు తట్టాయి. 

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఎయిర్‌టెల్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేరు టార్గెట్‌ ధర రూ.415 నుంచి రూ.515లకు పెంచింది. ఆర్థిక సంవత్సరం 21-22 నాటికి ఎయిర్‌ యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌ 1శాతం, ఆదాయం 2శాతం పెరగవచ్చని ఫారెన్‌ బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. అలాగే రుణ సంక్షోభంలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తుల కోసం నవంబర్‌ 25న భారతీ ఎయిర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు మరో కంపెనీలు బిడ్‌లు ధాఖలు చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. కంపెనీ క్యాపెక్స్‌ గరిష్టం వద్ద ఉంది. బలమైన నెట్‌వర్క్ స్పెక్ట్రం సామర్ధ్యంతో తోటి కంపెనీలతో పోలిస్తే ముందంజలో ఉన్నట్లు టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. You may be interested

5నెలల గరిష్టానికి నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ

Monday 25th November 2019

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో కొనుగోళ్లు జరగడంతో సూచీలు రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 505 పాయింట్లు పెరిగి 40,868.30 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 153 పాయింట్ల ఆర్జించి 12,067.05 వద్ద 5నెలల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 453 పాయింట్లు లాభపడి 31,564.60 వద్ద 5నెలల గరిష్టాన్ని అందుకుంది. ఈ నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ

ఎంఎఫ్‌ పెట్టుబడులు ఎప్పుడు వెనక్కు తీసుకోవాలి!

Monday 25th November 2019

ధీరేంద్ర కుమార్‌ సూచనలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ల కోసం బోలెడు పథకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు నెట్‌ నిండా పలు సైట‍్ల సిఫార్సులు, పలువురు నిపుణుల సలహాలు హోరెత్తిస్తుంటాయి. అందువల్ల ఎంఎఫ్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆలోచించాల్సిన పని రిటైలర్‌కు రాదు. ఉన్నవాటిలో నాణ్యమైన పథకాన్ని, నాణ్యమైన నిపుణుడి సలహాను ఎంచుకొంటే సగం పనైపోతుంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య వస్తుంది. ప్రతిఒక్కరు ఏది కొనాలి?

Most from this category