STOCKS

News


రాబోయే 3వారాలకు 3 స్టాక్‌ సిఫార్సులు

Saturday 16th November 2019
Markets_main1573898992.png-29647

సాంకేతిక అంశాలను పరిశీలిస్తే రానున్న 3వారాల్లో జస్ట్‌ డయల్‌, ఇండిగో షేర్లు స్థిరమైన రాబడుల్ని ఇవ్వచ్చని ఇండియానిశీష్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు ముహుల్‌ కొఠారి అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే కాలవ్యవధితో జీ ఎంటర్‌టైన్‌ షేరును విక్రయించమని ఆయన సలహానిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 షేర్లపై కొఠారి విశ్లేషణలను చూద్దాం.
షేరు పేరు:- జస్ట్‌ డయల్‌
టార్గెట్‌ ధర:- రూ.560లు
స్టాప్‌ లాస్‌:- రూ.480లు
అప్‌సైడ్‌:- 8-9శాతం 
కాల పరిమితి:-  1 నుంచి 3వారాలు
విశ్లేషణ:- జస్ట్‌ డయల్‌ షేరు జూన్‌ ప్రారంభం నుంచి నష్టపోతూ ఉంది. డైలీ ఛార్ట్‌లో ‘‘ఓవర్‌సోల్డ్‌’’ జోన్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఛార్ట్‌లో ఇది రూ .500 మార్కు దగ్గర పొటెన్షియల్‌ రివర్సల్‌ జోన్‌ కలిగిన బుల్లిష్ హార్మోనిక్ AB=CD ప్యాట్రన్‌ నమోదైంది. ఈ రూ.500 జోన్‌ను ఫిబ్రవరిలో బ్రేక్‌అవుట్‌ చేసినపుడు షేరు రూ.800లకు వరకు ర్యాలీ చేసింది.  ట్రేడర్లు రూ. 480ల స్టాప్-లాస్‌తో రూ.560 లక్ష్యంగా రూ .510 నుంచి 500 రూపాయల మధ్య కొనుగోలు చేయవచ్చు. 

షేరు పేరు:- ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
టార్గెట్‌:- రూ.1600
స్టాప్‌-లాస్‌:- రూ.1450
అప్‌సైడ్‌ :- 5-6 శాతం
కాల పరిమితి:- 1 నుంచి 3వారాలు 
విశ్లేషణ:- షేరు రూ.1911 నుంచి రూ.1,400 స్థాయికి దిగివచ్చింది. ఇప్పుడు కన్షాలిడేషన్‌ స్థితిలో ఉంది. గత కొద్దివారాలుగా షేరు తన 200 రోజుల ఈఎంఏ స్థాయి నుంచి పుంజుకుంటుంది. ఈ అంశం షేరు పట్ల ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని సూచిస్తుంది. రూ.1540 స్థాయిని అధిగమిస్తే... వచ్చే మూడు వారాల్లో రూ.1,650లకు అందుకుంటుంది. ట్రేడర్లు రూ.1,450ల స్టాప్-లాస్‌తో రూ. 1,600 లక్ష్యంగా రూ .1,490 నుంచి 1500 మధ్య కొనుగోలు చేయవచ్చు.  

షేరు పేరు:- జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
టార్గెట్‌:- రూ.255లు
స్టాప్‌-లాస్‌:- రూ.300
డౌన్‌ సైడ్‌ ట్రెండ్‌: 9-5 శాతం
కాల పరిమితి:- 1 నుంచి 3వారాలు 
విశ్లేషణ:- సెప్టెంబర్‌ నుంచి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.300 స్థాయి దిగువకు పతనమైంది. అలాగే ఇటీవల కనిష్ట స్థాయి రూ. 199ను తాకింది. అక్కడ నుండి, షేరు భారీగా రికవరీ అయ్యింది. ఇప్పుడు షేరు బ్రేక్‌డౌన్‌ జోన్‌ వద్ద ఉంది. రోజువారీ మొమెంటం ఓసిలేటర్ యొక్క ప్లేస్‌మెంట్‌... అమ్మకాలు ఇక్కడ తిరిగి ప్రారంభమవుతాయని సూచిస్తుంది. ట్రేడర్లు రూ.300ల స్టాప్-లాస్‌తో రూ. 255 లక్ష్యంగా రూ .285 వద్ద విక్రయం చేయవచ్చు. 

 You may be interested

ఆర్‌కామ్‌ డైరెక్టర్‌గా అనిల్‌ అంబానీ రాజీనామా

Saturday 16th November 2019

రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు. తనతో పాటు మరో నలుగురు డైరెక్టర్లు చయ్యా విరాని, రైనా కరానీ, మంజరి కక్కర్‌, సురేశ్‌ రంగాచార్‌లు కూడా వైదొలిగారని కంపెనీ స్టాక్‌ ఎక్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఈ సమయంలో అనిల్‌ బోర్డు నుంచి వైదొలగడం గమనార్హం. వీరితో పాటు సీఎఫ్‌ఓ మనికంఠన్‌ కూడా తన రాజీనామాను సమర్పించారు.

ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు!

Saturday 16th November 2019

బ్యాంకు షేర్ల జోరుతో నిఫ్టీ బ్రేకవుట్‌ సాధ్యం మెటల్స్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ షేర్లు ర్యాలీ జరపడం, అదే సమయంలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు మందకొడిగా ఉండడం లాంటివి రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ పెరుగుతుందనేందుకు నిదర్శనాలని ప్రముఖ అనలిస్టు కునాల్‌ బోత్రా చెప్పారు. ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకొనేందుకు ఎక్కువ సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని రిస్క్‌-ఆన్‌ ట్రేడింగ్‌ అని, రిస్క్‌కు వెరసి రక్షణాత్మకంగా వ్యవహరించడాన్ని రిస్క్‌-ఆఫ్‌ ట్రేడింగ్‌ అని అంటారు. ఎకానమీపై నమ్మకం పెరిగే సమయంలో రిస్క్‌-ఆన్‌

Most from this category