News


స్వల్పకాలంలో రాబడులకు ఈ షేర్లు చూడండి !

Thursday 27th February 2020
Markets_main1582799576.png-32147

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి భయాలకు,  ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో ఇన్వెస్టర్ల అప్రమ‌త్తత తోడవ్వడంతో గురువారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ 2020 ఏడాది కనిష్టం దిగువకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 షేర్లను సిఫార్సు చేస్తున్నారు. 

షేరు పేరు: మిండా కార్పోరేషన్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.126
స్టాప్‌ లాస్‌: రూ.105
అప్‌సైడ్‌: 9శాతం
విశ్లేషణ: ఈ షేరు రోజువారీ ఛార్టులలో హైయర్‌ హైస్‌, హయ్యర్‌ బాటమ్‌ ప్యాట్రన్‌లు ఏర్పాటు చేసుకోవడంతో షేరు అప్‌ట్రెండ్ ట్రేడింగ్‌ను స్థిరంగా కొనసాగిస్తోంది. అలాగే వీక్లీ చార్టులలో సుష్ట త్రిభుజం ప్యాట్రన్‌పైన ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది ఫలితంగా దాని 200-రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడవుతుంది. తక్కువ కాల వ్యవధిలో, సుష్ట త్రిభుజం ప్యాట్రన్‌ పైన ఉన్న బ్రేక్అవుట్ చూడవచ్చు. రూ.126 లక్ష్యంతో షేరు ధర రూ.112-115 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు రూ.105లుగా స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చు.

షేరు పేరు: ఇప్కా లాబోరేటరీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.1584
స్టాప్‌ లాస్‌: రూ.1290
అప్‌సైడ్‌: 11శాతం
విశ్లేషణ: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు బుల్‌రన్‌ కొనసాగిస్తుంది. చివరి వారంలో షేర రూ.1500స్థాయి పైన ఏడాది గరిష్టస్థాయిని నమోదు చేసింది. మరోసారి ధరలు కీలక మద్దతు స్థాయిల వైపుకు తిరిగి వచ్చాయి. గత కొన్ని సెషన్ల నుండి రూ.1,350-1,450 పరిధిలో కన్సాలిడేట్‌ అయ్యింది. ప్రస్తుతం షేరు ధర దాని స్వల్పకాలిక,  దీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజ్‌ కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి షేరు ఇప్పుడు తదితర ర్యాలీకి సమాయత్తమైంది. రూ.1584 లక్ష్యంతో షేరు ధర రూ.1,400-1,425 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు రూ.1,290 గా స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చు.

షేరు పేరు: ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.2045
స్టాప్‌ లాస్‌: రూ.1775
అప్‌ సైడ్‌: 8శాతం
విశ్లేషణ: షేరు ధర గత నెలలో రూ.2050 స్థాయిలను తాకింది. తరువాత షేరు లాభాల స్వీకరణకు గురైంది. షేరు ధర మరోసారి దాని 50-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (ఈఎంఏ) వైపు రోజువారీ విరామంలో తిరిగి రూ.1,800 స్థాయి వద్ద కీలక మద్దతు ధరను తీసుకుంది. ప్రస్తుత దశలో, ఏడు నుండి ఎనిమిది ట్రేడింగ్ సెషన్లకు రూ.1,800-1,880 పరిధిలో కన్సాలిడేషన్‌ ఐన తరువాత ఈ స్టాక్ ఒక రౌండింగ్ బాటమ్ నమూనాను ఏర్పాటు చేసింది. రాబోయే సెషన్లలో స్టాక్‌లో తదుపరి కొనుగోలును జోడించగలదు అనేందుకు సూచికగా ఈ వారం పైన ఉన్న బ్రేక్అవుట్ సూచిస్తుంది. రూ.2,045 లక్ష్యంతో షేరు ధర రూ.1,870-1,890 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఇందుకు రూ.1,775 గా స్టాప్‌లాస్‌గా పెట్టుకోవచ్చు.



You may be interested

కరోనా నుంచి ఊహించని రక్షణ కవచం

Friday 28th February 2020

కరోనా వైరస్‌ చైనా సహా ఆసియాలోని పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ, మన ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండదని... ఇందుకు ఊహించని రక్షణ కవచమే కారణమని నోమురా ముఖ్య ఆర్థికవేత్త రాబర్ట్‌ సుబ్బురామన్‌ అంటున్నారు. కరోనా వైరస్‌కు ఆసియా ప్రాంతం ఎక్కువగా గురయ్యే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆసియాలో అతి తక్కువ ప్రభావిత దేశం భారత్‌ అని స్పష్టం చేశారు. దీనికి

విదేశీ ఎఫెక్ట్‌- నష్టాల ముగింపు

Thursday 27th February 2020

సెన్సెక్స్‌ 143 పాయింట్లు డౌన్‌ నిఫ్టీ 45 పాయింట్లు వీక్‌ పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ బోర్లా అగ్రదేశం అమెరికాకు సైతం కరోనా వైరస్‌ భయాలు చేరడంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. బుధవారం వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు క్షీణించగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో రోజంతా నష్టాలమధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతోనే నిలిచాయి. సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 39,746 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 45

Most from this category