News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 20th January 2020
Markets_main1579499462.png-31043

 వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో  సోమవారం ప్రభావితమయ్యే షేర్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసికంలో అత్యధికంగా నికర లాభం రూ.11,640 కోట్లుగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,251 కోట్ల కంటే ఈ సంవత్సరం నికర లాభం 13.5 శాతం పెరిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ఈ బ్యాంక్‌ లాభం 33 శాతం పెరిగినప్పటికీ రుణ నాణ్యత బలహీన పడడంతో నిబంధనలు పెరిగాయి. ఈ త్రైమాసికంలో లాభం రూ.7,416.5 కోట్లకు పెరిగింది. గతేడాది మూడో త్రైమాసికంలో లాభం రూ.5,585.85 కోట్లుగా ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 12.7 శాతం పెరిగి రూ.14,172 కోట్లకు చేరింది.

టీసీఎస్‌: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి సంఖ్యలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.8,105 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.8,118 కోట్లు.

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 2019 డిసెంబర్‌ త్రైమాసికంలో నికర లాభం 16 శాతం పెరిగింది. త్రైమాసిక ప్రాతిపదికన  14.6 శాతం పెరిగి నికర లాభం రూ.3,037 కోట్లుగా ప్రకటించింది.  

ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌:  గతేడాది మూడో త్రైమాసికంతో పోల్చితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆర్థిక సంవత్సరం-20 మూడోత్రైమాసిక లాభం 32 శాతం పెరిగి నికర వడ్డీ ఆదాయంలో 34.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్యూ3లో స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 1 బీపీఎస్‌ తగ్గుదలతో  2.81 శాతంగాను, నికర ఎన్‌పీఏ 7 బీసీఎస్‌ తగ్గుదలతో  నికర లాభం 1.05 శాతంతో రుణ నాణ్యత స్థిరంగా కొనసాగుతుంది. 

లుపిన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఫెసిలిటీ ఇన్‌స్పెక‌్షన్‌ తర్వాత యూఎస్‌ హెల్త్‌ రెగ్యులేటరీ నుంచి లుపిన్‌ ఐదు పరిశీలనలను అందుకుంది. లుపిన్‌ విశాఖపట్నం ఏపీఐ తయారీ కేంద్రం యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌  తనిఖీ పూర్తయిందని లుపిన్‌ బీఎస్‌ఇకి దాఖలు చేసిన వివరాల్లో వెల్లడించింది. 

జీఎంఆర్‌: కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీ షాపుల ఒప్పందాన్ని జీఎంఆర్‌ సొంతం చేసుకుంది.

ఎస్‌ఎంఎస్‌ ఫార్మా:  విజయనగరం జిల్లా కందివలాసలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఏపీఐ కేంద్రంలో ఈ ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ఎస్‌ఎంఎస్‌ ఫార్మా-యూఎస్‌ఎఫ్‌డీఏ .. సీజీఎంపీ తనిఖీ నిర్వహించింది.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌:  లోఖండ్‌వాల డీబీ రియాలిటీ(ఎల్‌ఎల్‌పీ)లో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ అనుబంధ సంస్థ పెట్టుబడి పెట్టింది. 50 శాతం పెట్టుబడితో ఆర్థిక, ఓటింగ్‌ హక్కులను ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ సొంతం చేసుకుంది.

సైయంట్‌: ఈ కంపెనీ మూడోత్రైమాసిక లాభం10.4 శాతం పెరిగి వరుసగా రూ.107.6 కోట్లతో ఆదాయం రూ.1,105.9 కోట్లుగా నమోదైంది. 2019 డిసెంబర్‌ చివరి నాటికి త్రైమాసిక ప్రాతిపదికన పోల్చితే  డాలర్‌ ఆదాయం 5.5 శాతం తగ్గి 155.2 డాలర్లకు చేరుకోవడంతో రూపాయి ఆదాయం 4.6 శాతం తగ్గి సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.1,158.9 కోట్లగా నమోదైంది.

ఎల్‌అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌: ఈ కంపెనీ 2019 డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం దాదాపు 2 శాతం పెరిగి రూ.591 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.590 కోట్లు.

పీఎఫ్‌సీ: వ్యాపారాన్ని మరింత విస్తరించే క్రమంలో నిధులు సమకూర్చడానికి విదేశీ బాండ్ల జారీ ద్వారా పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ 750 మిలియన్‌ డాలర్లు సమీకరించింది.

ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ: అమెరికాలో వ్యాపార వృద్ధి కారణంగా ఎల్‌అండ్‌ టీ టెక్నాలజీ డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 10 శాతం పెరిగి ఆదాయం రూ.204 కోట్లకు చేరింది.

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సురెన్స్‌:  డిసెంబర్‌ త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సురెన్స్‌  నికర లాభం 23 శాతం పెరిగి రూ.294 కోట్లకు చేరింది.
 



You may be interested

ఫైన్‌ ఆర్గానిక్‌ ఫైన్‌- బ్లూడార్ట్‌, లుపిన్‌ డౌన్‌

Monday 20th January 2020

ఫైన్‌ ఆర్గానిక్స్‌కు ఇక్రా అప్‌గ్రేడ్‌ బూస్ట్‌ బ్లూడార్ట్‌కు క్యూ3 ఫలితాల సెగ లుపిన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ చెక్‌ బ్లూచిప్‌ కంపెనీల అండతో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో ’పడ్డాయి. ఉదయం 11.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 191 పాయింట్లు క్షీణించి 41,754ను తాకగా.. నిఫ్టీ 62 పాయింట్లు తిరోగమించి 12,290 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ గరిష్టంగా 42,734కు చేరగా.. నిఫ్టీ 12,430వరకూ ఎగసింది. కాగా.. విభిన్న వార్తల నేపథ్యంలో

ఎయిర్‌టెల్‌ షేరు మరింత పెరగనుందా?

Monday 20th January 2020

మరో 8 శాతం బలపడే చాన్స్‌ సాంకేతిక నిపుణుల అంచనాలు 11 ఏళ్ల కన్సాలిడేషన్‌ తదుపరి బ్రేకవుట్‌ దశాబ్ద కాలానికిపైగా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ మరింత బలపడనుందంటున్నారు సాంకేతిక నిపుణులు. సమీప కాలంలో 8 శాతం వరకూ పుంజుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో ఓపెన్‌ ఇంట్రస్ట్‌ 14 నెలల గరిష్టానికి చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల రివ్యూ

Most from this category