News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd August 2019
Markets_main1564718963.png-27484

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఐఎల్‌:-
నిధులను ఎవర్‌గ్రీన్‌ రుణాలకు మళ్లించినట్లు విదేశీ ఇన్వెస్టర్‌ ఒకరు ఆర్‌బీఐకు ఫిర్యాదు చేశారు. 
తల్వాకర్స్ బెటర్ వాల్యూ వాల్యూ ఫిట్‌నెస్‌:- జూలై 31న చెల్లించాల్సిన రూ.3.5 కోట్ల వడ్డీరేట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది
దిష్‌మాన్‌ కార్బోజెన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ కంపెనీ అనుబంధ సంస్థ న్యూలాండ్‌ యూనిట్‌ను తనిఖీలు పూర్తి చేసినట్లు తెలిపింది. 
ఎసీసీ:- కంపెనీ సీఎఫ్‌ఓగా రజనీ కేసరీ నియమితులయ్యరు. 
ఎల్‌ఐసీ హౌసింగ్‌ బోర్డు:- కంపెనీ ఎండీ, సీఈవోగా సిద్ధార్థ మహంతి నియమితులయ్యారు
పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- కంపెనీ రూ.83 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది
లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌:- కేఫ్‌ కాపీ డే, దాని అనుబంధ సం‍స్థలకు ఎలాంటి రుణాలు లేవని స్పష్టం చేసింది. 
అలహదాబాద్‌ బ్యాంక్‌:- నిబంధనలను ఉల్లఘించినందుకు ఆర్‌బీఐ రూ.2 కోట్ల జరిమానా విధించింది.
ఎస్‌ఆర్‌ఎఫ్‌:- ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్‌ వ్యాపారాన్ని డీఎస్‌ఎం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విభజించింది.
కోల్‌ ఇండియా:- జూలైలో ఉత్పత్తి 5శాతం, నిల్వలు 3శాతం తగ్గాయి.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, బాటా ఇండియా, హడ్కో, ఐనాక్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, గతి, ఫస్ట్‌సోర్స్‌ సెల్యూషన్స్‌You may be interested

ట్రంప్‌ టారీఫ్‌ల హెచ్చరిక.. గడగడలాడుతున్న గ్లోబల్‌ మార్కెట్లు

Friday 2nd August 2019

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో అ‍ంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) ఏసియా-పసిఫిక్‌ ఇండెక్స్‌(జపాన్‌ కాకుండా) షేర్లు 1.6 శాతం పడిపోయి, జూన్‌ లో తాకిన కనిష్టాలుకు చేరుకున్నాయి. జపాన్‌ నికాయ్‌ కూడా 2.4 శాతం నష్టపోయింది. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లోనే

నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌

Friday 2nd August 2019

ఛైనాపై సెప్టెంబర్‌ నుంచి 10 శాతం అదనపు టారీఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత రాత్రి హెచ్చరించిన నేపథ్యంలో  ప్రపంచ మార్కెట్లు పతనంకావడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం సైతం  గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200  పాయింట్ల నష్టంతో 36,800 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,910 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. వేదాంత, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌లు 1-3

Most from this category