News


మంగళవారం వార్తలకు ప్రభావితమయ్యే షేర్లు

Tuesday 21st January 2020
Markets_main1579584298.png-31068

వివిధ వార్తలు, విశ్లేషణలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌: షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూను ఆమోదించడానికి ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ బోర్డు ఈ రోజు(జనవరి 21)న సమావేశం కానుంది.

ఎన్‌బీసీసీ: కేంద్ర బొగ్గు పరిశ్రమల్లో  రూ.720 కోట్ల ప్రాజెక్టుకు ఎన్‌బీసీసీ కన్సల్టెన్సీ ఇవ్వనుంది.

కెఈఐ ఇండస్ట్రీస్‌: వార్షిక ప్రాతిపదికన క్యూ3 నికర లాభం 50.4 శాతం పెరిగి రూ.72.5 కోట్లుగా నమోదయ్యింది. మొత్తం ఆదాయం 21 శాతం పెరిగి రూ.1314కోట్లకు చేరింది.s

ఐడీబీఐ బ్యాంక్‌: 0.36  ఈక్విటీ వాటాకు సమానమైన 17.90 లక్షల ఎన్‌ఎస్‌ఈ షేర్లను ఐడీబీఐ విక్రయించింది. 

శ్రేయీ ఇన్‌ఫ్రా: రూ.3వేల కోట్లను పెంచే లక్ష్యంతో శ్రేయీ ఇన్‌ఫ్రా బోర్డు ఫిబ్రవరి 14న సమావేశం కానుంది.

జస్ట్‌డయిల్‌: గతేడాది డిసెంబర్‌లో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5.8 శాతం పెరిగి రూ.60.68 కోట్లుగా నమోదైందని జస్ట్‌డయిల్‌ వెల్లడించింది.

ఎన్‌ఎండీసీ: ముడి ఇనుము టన్ను ధరను రూ.400 గా ఎన్‌ఎండీసీ నిర్ణయించింది. ఈ నెలలో  రెటు పెంచడం ఇది రెండోసారి.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: క్యూ3 లో నికర లాభం రూ.135 కోట్లని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వెల్లడించింది. అయితే గతేడాది నికర నష్టం రూ.3,764 కోట్లు. క్యూ3 ప్రాతిపదికన నికర లాభం రూ.115 కోట్లు.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: ఆర్థిక సంవత్సరం -20 క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 36 శాతం పెరిగి రూ.137 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రకటించింది. గతేడాది మొత్తం ఆదాయం  రూ.404.7 కోట్లుగా ఉండగా ఈ క్యూ3లో పెరిగి రూ.422.12 కోట్లకు చేరింది.

1. 2018తో పోలిస్తే 2019లో విమాన ప్రయాణికుల సంఖ్య 3.74 శాతం పెరగడంతో ప్రయాణికుల ట్రాఫిక్‌ రద్దీ రూ.422.12 కోట్లుగా నమోదైందని జనవరి 20న వైమానిక రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ వెల్లడించింది. ఈనేపథ్యంలో ఎయిర్‌లైన్‌ షేర్లు యాక్టివ్‌గా ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

2. ఏజీఆర్‌ సంబంధించిన బకాయిలు చెల్లించడానికి జనవరి 23 గడువు పరిమితిని పొడిగించాలని  కోరుతూ టెలికాం సంస్థలు వొడాఫోన్‌, ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌లు సోమవారం(జనవరి 20) సుప్రీకోర్టులో సవరణ పిటీషన్‌ను దాఖలు చేశాయి.
 You may be interested

ఈఎంఐలలో పన్ను డిమాండ్‌ చెల్లింపు?

Tuesday 21st January 2020

బిజినెస్‌లు, కంపెనీలకు వెసులుబాటు యోచన దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లింపులకు వేదికగా నిలుస్తున్న ముంబైలో ఇకపై పన్ను చెల్లింపునకు వాయిదా పద్ధతిలో అనుమతించనున్నట్లు తెలుస్తోంది. కఠిన లిక్విడిటీ పరిస్థితులు, బిజినెస్‌లకు ఎదురయ్యే సవాళ్లు వంటి ప్రతికూలతల నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా ముంబైలోని ట్యాక్స్‌ కమిషనర్లు చర్యలు చేపట్టన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే బిజినెస్‌లు, కంపెనీలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.  తొలుత 20 శాతం చెల్లింపు ఆదాయపన్ను శాఖ అధికారి నుంచి డిమాండ్‌

2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 21st January 2020

అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో  2వారాల గరిష్టాన్ని అందుకుంది. మధ్య ఆసియాలో మరోసారి నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ కేటాయింపుతో అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు లాభపడి 1,568.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి 2వారాల గరిష్టస్థాయి కావడం విశేషం.  కొద్ది రోజులుగా నిశబ్దంగా ఉన్న

Most from this category