News


ఈ ఏడాది జోడు గుర్రాలివే!

Friday 8th February 2019
Markets_main1549614304.png-24091

కుంజ్‌ బన్సాల్‌ రికమండేషన్‌
బ్యాకింగ్‌రంగంలో వాల్యూషన్లు, ఫండమెంటల్స్‌ పరంగా ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ దుమ్ముదులుపుతాయని ప్రముఖ అనలిస్టు కుంజ్‌ బన్సాల్‌ అంచనా వేశారు. గతేడాది తాను చెప్పిన జంట స్టాకులు రిలయన్స్‌, టీసీఎస్‌లు సత్తా చూపాయని, ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు దూసుకుపోతాయని అంచనా వేశారు. క్యు3 ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ఎఫ్‌ఎంసీజీ రంగంలో మంచి వాల్యూం వృద్ధి కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా పెయింట్స్‌ విక్రయాలు ఊపందుకున్నాయన్నారు. కొన్ని కంపెనీలు రెండంకెల వృద్ది నమోదు చేస్తున్నాయని చెప్పారు. ప్రజల వినిమయంలో జోరు కనిపిస్తోందని చెప్పారు. గత నాలుగునెలలు నిఫ్టీ చాలా స్వల్ప శ్రేణిలో కదలాడిందని, కానీ ఈ శ్రేణిలో సూచీలు ఉన్నప్పుడే కొన్ని రంగాలు అత్యుత్తమ ప్రదర్శన చూపాయని తెలిపారు. ఇలా మంచి జోరు చూపిన రంగాల్లో కన్జూమర్స్‌ రంగం ఒకటన్నారు. ఇతర రంగాల నుంచి కన్జూమర్‌ రంగంలోకి నగదు ప్రవహిస్తోందని, ఈ రంగ కంపెనీలు మంచి ఫలితాలు చూపాయని వివరించారు.

ఈ రంగం షేర్లపై వాల్యూషన్లను సరిగ్గా గుర్తించాలన్నారు. గతంలో ఎప్పుడు చూసినా వాల్యూషన్లు అధికమనే మాటే వినిపిస్తూ వస్తోందని, కానీ ఈ షేర్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. దీన్నిబట్టి ఈ రంగంలో అధిక వాల్యూషన్లను మదుపరులు అంగీకరిస్తున్నారని వివరించారు. దేశంలో 120 కోట్ల జనాభాను దృష్టిలో ఉంచుకుంటే వినిమయ రంగం సత్తా ఎంతో అర్ధం అవుతుందన్నారు. ప్రజల కొనుగోళ్లే వృద్ధిని ప్రేరేపిస్తాయని చెపర్పారు. అందువల్ల ఈ రంగంపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. ఈ రంగంలో కొన్ని కంపెనీలు అంచనాలకు తగ్గట్లు ప్రదర్శన చూపలేదని, ఇలాంటి కంపెనీలు కూడా కదలాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ సమయంలో కూడా ఈ కంపెనీలు పుంజుకోకపోతే వీటిని వదిలించుకోవాలని సూచించారు. 
 



You may be interested

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Friday 8th February 2019

మార్కెట్లో మిడ్‌సెషన్‌ అనంతరం మెటల్‌ షేర్ల పతనం కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో మొత్తం 15షేర్లకు గానూ 14 షేర్లు నష్టపోగా, ఒక్క నాల్కో షేరు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.., సెయిల్‌ షేరు మాత్రం నేటి ట్రేడింగ్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. వేదాంత 5శాతం, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ 4శాతం, జిందాల్‌ స్టీల్‌,

ఆల్‌టైం గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Friday 8th February 2019

దేశీయ ఐటీ దిగ్గజం సంస్థ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ షేరు శుక్రవారం కొత్త ఆల్‌టైంకి నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు రూ. 763.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లలో ర్యాలీ భాగంగా ఈ షేరు 1శాతం లాభపడి రూ.771.15ల వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు షేరు గతముగింపు(రూ.763.35)తో​ పోలిస్తే అరశాతం లాభంతో రూ.767ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ పతనంలో

Most from this category