News


మిడ్‌క్యాప్స్‌ కచ్చితంగా ఎందుకు ర్యాలీ చేస్తాయంటే...?

Tuesday 23rd July 2019
Markets_main1563905861.png-27261

నిఫ్టీ 10,000 పాయింట్లకు ఈ ఏడాది పతనం అవుతుందని తాము భావించడం లేదని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. స్వల్పకాలానికి కనిష్ట స్థాయి అన్నది 200డీఎంఏకు దగ్గర్లో 11,125 వద్ద ఇప్పటికే ఏర్పాటైందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. మరీ పడితే 11,000 కనిష్ట స్థాయిని నమోదు చేయవచ్చన్నారు. డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల నేపథ్యంలో వచ్చే కొన్ని రోజుల్లోనే ఇది జరగొచ్చన్నారు. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వాటి ఆస్తుల ధరల కంటే ఎంతో తక్కువకు లభిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్‌ నుంచి బ్రోడర్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తాయనేందుకు కొన్ని కారణాలను తెలియజేశారు. 

 

  • బాండ్‌ ఈల్డ్స్‌ గత మూడేళ్ల కాలంలోనే కనిష్ట స్థాయి 6.35 వద్ద ఉన్నాయి. గ్లోబల్‌ ఈల్డ్స్‌ కూడా తగ్గిపోతున్నాయి. ఫెడ్‌ 2019లో మూడు సార్లు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
  • అంటే కేంద్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. పైగా సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధుల సమీకరించాలన్న నిర్ణయం స్థానికంగా రుణాల సమీకరణపై ఒత్తిళ్లను తగ్గిస్తుంది. 
  • రోడ్లు, పోర్టులు, ఇన్‌ఫ్రా, సామాజిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు వచ్చే మూడు, నాలుగు నెలల్లో గణనీయంగా పెరుగుతాయని ఇది తెలియజేస్తోంది. ఇది మరిన్ని ఉద్యోగాలను కల్పిస్తుంది. ప్రైవేటు రంగం నుంచి మూలధన నిధుల వ్యయం పెరిగేందుకు దారితీస్తుంది. 
  • ఆర్‌బీఐ 2020 మార్చి నాటికి కనీసం 75 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది పరిశ్రమలు, వ్యాపారాలకు రుణాల వ్యయాలు తగ్గేందుకు దారితీస్తుంది. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి ఆస్తుల, అప్పుల మధ్య అసమతుల్యతకు వచ్చే 30 రోజుల్లో మరిన్ని పరిష్కారాలు లభిస్తాయి. 
  • మధ్య స్థాయి వ్యాపారాలు లిక్విడిటీ కొరత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. నిధులపై వ్యయాలు తగ్గితే మరింత ఉత్పాదకతకు దారితీస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీల వినియోగం, విచక్షణా రహిత రుణాల జారీ తిరిగి ఊపందుకుంటుంది. పండగల వాతావరణం కార్ల విక్రయాలు, డ్యురబుల్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతుంది. 
  • అంతర్జాతీయ లిక్విడిటీ తిరిగి రిస్క్‌ తీసుకోవడం మొదలవుతుంది. వర్ధమాన ఈక్విటీలకు గణనీయమైన పెట్టుబడులు వస్తాయి. భారత్‌ ఒకానొక ప్రాధాన్య దేశంగా ఉంటుంది.  
  • ఎన్‌పీఏలకు పరిష్కారాలతో కార్పొరేట్‌ బ్యాంకులు మంచి దశను చూస్తాయని భావిస్తున్నాం. కార్పొరేట్‌ ఇండియాకు తాజా రుణాల జారీతో రానున్న నెలల్లో బలమైన ఉత్ప్రేరణ లభిస్తుంది. 
  • ప్రభుత్వ చర్యలతో వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు వచ్చే మూడు నెలల్లో జోరందుకుంటాయి. 

 

వీటిని విస్మరిస్తున్నారు...
2019లో ఇప్పటి వరకు కొత్త డీమ్యాట్‌ ఖాతాలు 41 లక్షలకు చేరాయి. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ రూ.8,900 కోట్ల ఇష్యూకు రూ.48,000 కోట్ల సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. రూపాయి రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. దీనికి తోడు తక్కువ ఈల్డ్స్‌, బలహీన డాలర్‌, చమురు ధరలు రూ.65 డాలర్ల వద్దే ఉండడం, ఇంకా తగ్గుతాయన్న అంచనాలు సానుకూలతలు. అక్టోబర్‌ నుంచి బేస్‌ ప్రభావంతో ఎర్నింగ్స్‌, లిక్విడిటీ, విశ్వాసం అన్నవి పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు భాసిన్‌ చెప్పారు. 2020లో మిడ్‌క్యాప్‌ మంచి పనితీరు చూపిస్తాయన్నారు.You may be interested

‘బై’ ఎన్‌ఎండీసీ...‘సెల్‌’ మైం‍డ్‌ట్రీ

Wednesday 24th July 2019

ఎడెల్వీస్ బ్రోకరేజి సంస్థ నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎండీసీ) షేరు టార్గెట్‌ ధరను రూ. 135గా కొనసాగిస్తు ‘బై’ కాల్‌ రేటింగ్‌ను ఇచ్చింది. డోనిమలై వద్ద  మైనింగ్‌ను ఎన్‌ఎండీసి తిరిగి ప్రారంభించడంతో ఈ షేరు సానుకూలంగా ఉందని  తెలిపింది. కాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రుతుపవనాలు  తర్వాత ఈ మైనింగ్‌ వద్ద ఉత్పత్తిని ప్రారంభిస్తే ఈపీఎస్‌(షేరు పై లాభం) 6

వాళ్లు చిన్న స్టాక్స్‌ను కొంటూనే ఉన్నారు...!

Tuesday 23rd July 2019

ప్రముఖ ఇన్వెస్టర్లుగా చెప్పుకునే అనిల్‌కుమార్‌ గోయల్‌, పొరింజు వెలియాత్‌ తదితరులు మార్కెట్‌ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అమ్మకాల ఒత్తిడికి గత ఏడాదిన్నరగా నష్టాల పాలవుతూనే ఉన్న విషయం గమనార్హం. గోయల్‌, పొరింజు వెలియాత్‌లు స్మాల్‌, మైక్రోక్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం చూపించే విషయం తెలిసిందే. ఆర్థిక రంగం పరుగులు తీయడం మొదలు పెడితే, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మధ్య,

Most from this category