News


4 వారాల్లో లాభాలనిచ్చే 12 స్టాకులు

Monday 26th August 2019
Markets_main1566816167.png-28026

ఆర్ధిక మంత్రి శుక్రవారం ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో సోమవారం మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నా 2.10 సమయానికి నిఫ్టీ 50 205 పాయింట్లు లాభపడి 11,034.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 735.58 పాయింట్లు లాభపడి 37,436.74 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ రోజువారీ ఎంఏసీడీ ‘బై’ మోడ్‌లో ఉందని సీఎంటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ జే ఠక్కర్, - ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్,  ఆనంద్ రాఠి  షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్‌ తెలిపారు. ‘రోజువారి ఇండెక్స్‌ చార్టులో సానుకూలత ఉంది. ఇది సమీప కాలంలో షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీకి దొహదపడుతుంది.  11,100 స్థాయి వరకు నిఫ్టీ చేరుకోగలదు’ అని  వివరించారు. 

వివిధ రకాల బ్రోకరేజిల సిఫార్సుల ఆధారంగా వచ్చే 11-12 సెషన్లలో లాభాలను ఇవ్వగలిగే షేర్లు

జెమ్‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ బ్రోకరేజి, సీఎంటీ, ఎంఎస్‌టీఏ, కన్సల్టింగ్ టెక్నికల్ అనలిస్ట్, మిలన్ వైష్ణవ్ సిఫార్సులు:
ఇండియన్‌ ఆయిల్‌: కొనచ్చు, టార్గెట్‌ ధర: రూ. 135, స్టాప్‌ లాస్‌: రూ. 115
ఈ కంపెనీ సాంకేతిక పరంగా తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అవ్వనుంది. రూ. 160-165 పరిధిని అధిగమించడంలో విఫలమయ్యాక ఈ షేరు క్షీణించి రూ. 115-120 వద్ద నిలకడగా ఉంది. ఈ స్టాకు అధికంగా అమ్మకానికి గురవ్వడంతో పాటు, ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌) ఓవర్‌ సోల్డ్‌ ఏరియాలో 30 కి పైన ఉంది. ఇది బలమైన బాటమ్‌ పార్మేషన్‌ను చూపిస్తోంది. ఫలితంగా చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. ఇది ముఖ్యమైన మద్ధతు దగ్గర కనిపించినందున సాంకేతిక పుల్‌బ్యాక్ ఉండే అవకాశం ఉంది. రూ. 115 దిగువన ఏదైనా ఈ స్టాక్‌కు స్టాప్‌ లాస్‌గా పనిచేయగలదు.

సమీత్ చవాన్, చీఫ్ అనలిస్ట్- టెక్నికల్ అండ్‌ డెరివేటివ్స్, ఏంజెల్ బ్రోకింగ్:
టాటా ఎలిక్సి: కొనచ్చు, టార్గెట్ ధర: రూ .685, స్టాప్‌ లాస్‌: రూ .631
జూలై మొదటి అర్ధభాగంలో ఈ స్టాకు 30 శాతానికి పైగా నష్టపోయింది. ఆ తర్వాత మూడు వారాల పాటు ఈ షేరు కన్సాలిడేట్‌ కావడం గమనార్హం. శుక్రవారం, మార్కెట్ తక్కువ స్థాయి వద్ద బలమైన కొనుగోలును ప్రదర్శించింది. ఫలితంగా కౌంటర్లో ఇటీవలి రద్దీ జోన్ నుంచి బుల్లిష్ బ్రేక్ ఔట్‌ వేగవంతం అయ్యింది. శుక్రవారం సెషన్‌లోని ఇంట్రాడేలో ఈ స్టాకు వాల్యుమ్‌ యాక్టివిటీ ప్రోత్సాహకరంగా ఉండడంతో ఈ కౌంటర్లో మంచి ర్యాలీ ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ అంచనా వేస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో రూ. 685 టార్గెట్ కోసం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టాప్ లాస్‌ను రూ. 631 నిర్ణయించుకోవడం మంచిది.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: కొనవచ్చు, టార్గెట్‌ ధర: రూ. 111, స్టాప్‌ లాస్‌: రూ. 92.40
రోజువారీ చార్టులో, ఈ స్టాక్ గత నెల రోజుల నుంచి రెండు కీలకమైన మూవింగ్‌ యావరేజిల మధ్య ట్రేడవుతోంది.  200-ఎస్‌ఎంఏ(సింప్లీ మూవింగ్ యావరేజి) బలమైన దిగువ స్థాయిగా పనిచేస్తుంటే, 100-ఈఎంఏ(ఎక్పోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజి) బలమైన నిరోధంగా ఉంది. ప్రస్తుతం ఈ షేరు ధర 100-ఈఎంఏను అధిగమించిం‍ది. వాల్యూమ్లు, బలమైన బుల్లిష్ క్యాండిల్‌ మద్దతు ఉండడంతో ఈ బ్రేక్‌ ఔట్‌ జరిగింది. అదనంగా ఈ స్టాక్‌ మొమెంట్‌ ఓసిలేటర్ ఆర్‌ఎస్‌ఐ 50 కంటే అధికంగా నమోదయ్యి, సానుకూల జోన్‌లోకి ప్రవేశించింది. ఇది ఆశావాద వైఖరికి మద్దతు ఇస్తుంది.‘సాంకేతిక విషయాలను గమనిస్తే రాబోయే కొద్ది రోజుల్లో ఈ స్టాక్‌ను ప్రస్తుత స్థాయి వద్ద టార్గెట్‌ రూ .111 కోసం కొనుగోలు చేసుకోవచ్చు. రూ .92.40 వద్ద స్టాప్ లాస్‌ను పెట్టుకోవాలి.

మజ్హర్ మొహమ్మద్, చీఫ్ స్ట్రాటజిస్ట్ - టెక్నికల్ రీసెర్చ్ అండ్‌ ట్రేడింగ్ అడ్వైజరీ, చార్ట్‌వ్యూఇండియా
యాక్సిస్ బ్యాంక్: కొనచ్చు, టార్గెట్ ధర: రూ .720, స్టాప్‌ లాస్‌ : రూ .642
ప్రస్తుతం ఈ స్టాక్ వీక్లీ చార్టులలో హెమర్‌ రకమైన నిర్మాణంతో ఆసక్తికరంగా ఉంది. ఈ కౌంటర్(ఈ స్టాక్‌), రూ .645 స్థాయి నుంచి తిరిగి బౌన్స్ అయ్యింది. రూ .643 స్థాయికి పైన స్థిరంగా ఉంటూ.. ఈ కౌంటర్ ఇంకా పై స్థాయిలకు చేరుకునే  అవకాశం ఉంది. ‘పొజిషన్‌లు తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు, ఈ అవకాశాన్ని వినియోగించుకోని ఈ స్టాకును టార్గెట్‌ రూ. 720  కోసం కొనుగోలు చేయాలి. రూ. 642 వద్ద స్టాప్‌ లాస్‌ను పెట్టుకోవడం ఉత్తమం.

బ్రిటానియా ఇండస్ట్రీస్: కొనచ్చు, టార్గెట్‌ ధర : రూ .2640, స్టాప్‌ లాస్‌: రూ .2,390
గత రెండు సెషన్లలో నష్టపోయిన ఈ షేరు ప్రస్తుతం బుల్లిష్ క్యాండిల్‌తో ఆసక్తికరంగా ఉంది. పొజిషన్లు తీసుకునే ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ .2,390 స్థాయి కంటే దిగువన స్టాప్‌ లాస్‌ పెట్టుకొని, రూ .2,640 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయాలి.

వికాస్ జైన్, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్, రిలయన్స్ సెక్యూరిటీస్
గెయిల్: కొనచ్చు, టార్గెట్‌ ధర: రూ .145, స్టాప్‌ లాస్‌ : రూ. 115
ఈ స్టాక్ రూ .120 దగ్గర డబుల్ బాటమ్ చేసింది. కాగా గత ఒక నెల నుంచి ఈ షేరు సానుకూలంగా కదులుతోంది. ఆర్‌ఎస్‌ఐ లో కన్వర్జెన్స్ ఓవరాల్‌ పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. అంతేకాకుండా ఓవర్‌సోల్డ్ జరగడం, స్టాక్‌కు పరిమితమైన ఇబ్బందిని సూచిస్తుంది. ఈ స్టాక్ దాని స్వల్పకాలిక సగటుకు దగ్గరగా ఉంది,  వచ్చే కొద్ది వారాల్లో మీడియం-టర్మ్ సగటు రూ .145 వద్ద ఈ షేరు పరిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. లాంగ్‌ పొజిషన్లను తీసుకునే వారు రూ .115 స్టాప్ లాస్‌తో, రూ .145 టార్గెట్‌ కోసం ఈ స్టాకును కొనుగోలు చేయవచ్చు.

ఎల్ అండ్ టీ: కొనచ్చు, టార్గెట్‌ ధర: రూ .1,520, స్టాప్‌ లాస్‌ : రూ .1,210
ఈ స్టాక్ దాని 34 నెలల సగటుకు దగ్గరగా మల్టీమంత్‌ మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా ఆ స్థాయిల నుంచి బలమైన కదలికను ఇది చూసింది. ఈ స్టాక్‌కు అప్‌ సైడ్‌నా  రూ .1,390 వద్ద కొంత నిరోధం ఎదుర్కోవచ్చు. కాగా ఈ స్థాయి రోజువారీ చార్టులలో దీర్ఘకాలిక సగటుతో సమానంగా ఉంది. ఏదేమైనా ఈ స్టాకు క్షీణించినట్లయితే, దాని దిగువ బ్యాండ్ రూ .1,200 స్థాయి ముఖ్యమైన రివర్సల్‌ పాయింట్‌గా పనిచేస్తుంది. రూ. 1,220 స్టాప్ లాస్‌తో రూ .1,520 టార్గెట్‌ కోసం లాంగ్ పొజిషన్లను ప్రారంభించవచ్చు.

జే ఠక్కర్, సీఎంటీ-హెడ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ - ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్, ఆనంద్ రాఠి
హిందుస్థాన్‌ యూనిలీవర్‌: కొనచ్చు, టార్గెట్ ధర: రూ. 1940, స్టాప్‌ లాస్‌ రూ. 1,820
ఈ స్టాక్ రోజువారీ చార్టులలో దీర్ఘచతురస్రాకార నమూనా నుంచి దాని ఎంఏసీడీలో స్పష్టమైన కొనుగోలు క్రాస్ఓవర్‌తో బ్రేక్అవుట్ చూసింది. రూ. 1,940 టార్గెట్‌ ధరతో, ఈ స్టాక్‌ను కొనచ్చు.

నిట్‌(ఎన్‌ఐఐటీ)టెక్నాలజీస్: కొనచ్చు, టార్గెట్ ధర: రూ .1,440, స్టాప్‌ లాస్‌ : రూ. 1,335
ఈ స్టాక్ విస్తరిస్తున్న త్రిభుజాకార నమూనా నుంచి బ్రేక్‌ ఔట్‌ను చూసింది. ఈ స్టాక్‌ను రూ. 1,440 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయవచ్చు.

కోటక్ సెక్యూరిటీస్, టెక్నికల్స్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్
ఎస్‌బీఐ: కొనచ్చు, టార్గెట్‌ ధర: రూ .288, స్టాప్‌ లాస్‌ : రూ .262
వీక్లీ ఆర్‌ఎస్‌ఐ (మొమెంటం ఓసిలేటర్) ప్రస్తుతం 35 వద్ద ఉంది. ఇది ఇన్వెస్టర్లకు కొనుగొలు అవకాశాన్ని అందిస్తుంది. ఇది సాధారణంగా షార్ప్‌ బౌన్స్‌కు దారితీస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్‌ వేగంగా రాబడికి 
అనుకూలంగా ఉంది.

నందిష్ షా, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్
ఎస్కార్ట్స్‌: కొనచ్చు, టార్గెట్ ధర: రూ .490, స్టాప్‌ లాస్‌ : రూ .432
ఈ స్టాక్ రోజువారీ చార్టులో బుల్లిష్ నమూనాను ఏర్పరచింది. అంతేకాకుండా,  ఇది ఐదు రోజుల ఎస్‌ఎంఏ పైన అధిక వాల్యూమ్‌లతో క్లోజయ్యింది. ఆర్‌ఎస్‌ఐ ఓసిలేటర్ రోజువారీ చార్టులో సానుకూల విభేదాన్ని ఏర్పాటు చేసింది. ‘డెరివేటివ్‌ విభాగంలో, ఎస్కార్ట్స్‌ ఫ్యూచర్లలో లాంగ్‌ బుల్డ్‌ అప్‌ను గమనించవచ్చు. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 453 వద్ద కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. అంతేకాకుండా రూ. 490 లక్ష్యం కోసం, రూ. 432 వద్ద స్టాప్‌ లాస్‌ను పెట్టుకోవడం ఉత్తమం.You may be interested

మార్కెట్ల ర్యాలీ... అయినా అప్రమత్తంగా ఉండాలి..?

Tuesday 27th August 2019

మార్కెట్ల ర్యాలీలో పరుగులు తీయకుండా కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌. సోమవారం ఆటుపోట్లతో కొనసాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా లాభపడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు వరుస చర్యల వల్ల నిఫ్టీ 228 పాయింట్లు (2.11 శాతం) పెరిగి 11,057.85 వద్ద ముగిసింది. అయితే, మార్కెట్లు ఇకముందూ ఎక్కువ అస్థిరతలతో ఉండొచ్చని,

సెన్సెక్స్‌ 792, నిఫ్టీ 224 పాయింట్లు అప్‌

Monday 26th August 2019

ఆర్థిక మంత్రి ప్యాకేజీకి జైకొట్టిన మార్కెట్‌ 11050పై ముగిసిన నిఫ్టీ కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్‌ను మురిపించడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు తెరపైకి రావడంతో సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 793 పాయింట్ల లాభంతో 37,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 228  పాయింట్లు పెరిగి 11050 పైన 11,057.85  వద్ద స్థిరపడింది. దాదాపు 3నెలల అనంతరం సూచీలు ఒక ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ స్థాయిలో లాభాలను

Most from this category