News


10-73 శాతం రాబడుల్నిచ్చే టాప్‌ 11 స్టాకులు!

Monday 21st October 2019
Markets_main1571651903.png-29031

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్ల నుంచి పాజిటివ్‌గా ముగిశాయి. ఈ సానుకూల పరిస్థితులలో మధ్యస్థ కాలానికి గాను  10-73 శాతం వరకు రిటర్నలను ఇవ్వగలిగే 11 స్టాకులను వివిధ బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్న టాప్‌ స్టాకులు...
బ్రోకరేజి: యాక్సిస్‌ సెక్యురిటీస్‌
డిక్సన్ టెక్నాలజీస్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .3,649 | రిటర్న్‌: 18 శాతం
డిక్సన్ టెక్నాలజీస్ (డిక్సన్), కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్ల తయారిలో ముందుంది. ఈ కంపెనీకి ఎలక్ట్రానిక్‌ మాన్యుప్యాక్చరింగ్‌ సర్వీసెస్‌లో 9.3 శాతం వాటా వుంది. ఇది ఎంఎన్‌సీ, దేశీయ ఓఈఎంలకు ఎండ్ టు ఎండ్ పరిష్కారాలను అందిస్తుంది. డిక్సన్ ఉత్పత్తులలో (i) కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ - ఎల్‌ఈడీ టీవీలు, (ii) గృహోపకరణాలు - వాషింగ్ మెషీన్లు, (iii) లైటింగ్ ఉత్పత్తులలో - ఎల్‌ఈడీ బల్బులు (iv) మొబైల్ ఫోన్లు (v) సీసీటీవీ, డీవీఆర్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా సంస్థ తన రివర్స్ లాజిస్టిక్స్ విభాగం ద్వారా మరమ్మతులు, పునరుద్ధరణ సేవలను అందిస్తోంది.
   ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే (ఎఫ్‌పీడీ) టీవీ విభాగంలో ఈ కంపెనీ 50 శాతం కంటే అధిక మార్కెట్‌ వాటాను కలిగివుండి, ఈ విభాగంలో ముఖ్యమైన కంపెనీగా వుంది. ఎల్‌ఈడీ లైటింగ్‌ విభాగంలో ఈ కంపెనీ 35 శాతం కంటే అధికంగా దేశీయ వాల్యూమ్‌లను కలిగివుంది. వాషింగ్ మెషీన్స్ విభాగానికి సంబంధించి ఈఎంఎస్‌(ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) మార్కెట్‌లో 40 శాతం కంటే అధిక వాటాను కలిగివుంది. 

బ్రోకరేజి: నిర్మల్‌ బాంగ్‌
ఓరియంట్ ఎలక్ట్రిక్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ. 197 | రిటర్న్‌: 12 శాతం
పట్టణీకరణం జరుగుతుండడం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుద్దీకరణ వృద్ధి చెందుతుండడంతోపాటు, ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తి, అసంఘటిత రంగాల నుంచి సంఘటిత రంగాల వైపు మారుతుండడం వంటి అంశాల వలన ఇండియాలో ఎలక్ట్రికల్‌ ఇండస్ట్రీలో వచ్చే ఐదేళ్ల కాలానికిగాను సీఏజీఆర్‌(కాంపౌండ్‌ యాన్యుల్‌ గ్రోత్‌ రేట్‌) 8-10 శాతం సాధించగలదని అంచనావేస్తున్నాం. ఎలక్ట్రిక్ కొత్తగా ఏర్పడిన సీనియర్ మేనేజ్‌మెంట్ కింద కోర్ ఎలక్ట్రికల్ వ్యాపారాన్ని వేగవంతం చేయడంపై ఓరియంట్ దృష్టి సారించింది. అంతేకాకుండా కంపెనీ ఓరియం‍ట్‌ పేపర్స్‌ నుంచి డిమెర్జ్‌ అయ్యాకా మంచి స్థాయిలో ఉంది. 
   కం‍పెనీ కొత్త ఆవిష్కరణల సామర్ధ్యం బలంగా ఉండడం, పెరుగుతున్న ప్రీమియమైజేషన్, మెరుగైన పంపిణీ నెట్‌వర్క్, ఉన్నతమైన బ్రాండ్ పొజిషనింగ్, వ్యవస్థలో మంచి మార్కెట్ వాటా, ఉపకరణాలు, స్విచ్ గేర్లను పెంచడం వంటి అంశాల వలన ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ మంచి స్థాయిలో ఉంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ 34-35 శాతం స్థూల మార్జిన్‌లను సాధిస్తోంది. 

బ్రోకరేజి: సెంట్రమ్‌ బ్రోకింగ్‌
అశోక బిల్డ్‌కాన్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .180 | రిటర్న్‌: 73 శాతం
  ఆర్డర్ బ్యాక్ లాగ్ బాగున్నప్పటికి, భూసేకరణలో జాప్యం కారణంగా అశోక బిల్డ్‌కాన్‌ (ఏబీఎల్‌) వెనుకబడి ఉంది. ఫలితంగా ఆర్థిక సంవత్సరం 2019-21లో 13.6 శాతం రెవెన్యూ సీఏజీఆర్‌ను మాత్రమే ఆశిస్తున్నాము. ఇది ఆర్థిక సంవత్సరం 20 /21 లో 2.8 శాతం / 8.4 శాతం ఆదాయ వృద్ధికి దారితీస్తుంది. రుణ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఏబీఎల్‌ లెవరేజి 0.3x డీ/ఈ వద్ద, 1.5x డెట్ /ఇబిటా వద్ద సరళంగా ఉంది. ఏబీఎల్‌, ఎస్‌బీఐ-మాక్వేరీ (ఎస్‌బీఐ-ఎం) అశోక కన్సెషన్‌ (ఎసీఎల్‌) లో తమ పెట్టుబడులను నిధులుగా మార్చే ప్రక్రియను ప్రారంభించాయి. ఇది మార్చి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సకాలంలో నిధులను సమీకరించడం, ఏబీఎల్‌ రుణాలు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది ఈ కంపెనీ స్టాక్ పాజిటివ్‌గా కదలడానికి ఉపకరిస్తుంది. 

బ్రోకరేజి: ఎడెల్విస్
ఐనాక్స్ లీజర్‌: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ 475 | రిటర్న్‌: 34 శాతం
ఐనాక్స్ లీజర్ ఇండియాలో రెండవ అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్. ఈ కంపెనీ వేగంగా విస్తరించేందుకు  ప్రణాళికలు వేస్తోంది. ప్రీమియమైజేషన్, మార్జిన్-అక్రెటివ్, ఎఫ్ అండ్ బీ ఆదాయాలు పెరిగాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రతికూలమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ వలన, కంపెనీ విస్తరించడంలో మంచి స్థాయిలో ఉంది. ఆర్థిక సంవత్సరం 2019-21కి గాను, ఐనాక్స్ ఆదాయాల సీఏజీఆర్‌ 19 శాతం, ఈపీఎస్‌ సీఏజీఆర్‌ 35 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా 20x డిసెంబర్‌ 2020 ఈ ఈపీఎస్‌ (పీవీఆర్‌ కంటే 33 శాతం రాయితీతో) వద్ద, టార్గెట్‌ ధర రూ. 475 కోసం కొనమని సలహాయిస్తున్నాం.

బ్రోకరేజి: జేఎం ఫైనాన్షియల్
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .185 | రిటర్న్‌: 56 శాతం
జీసీసీ(గల్ఫ్‌ కోపరేషన్‌ కంట్రీస్‌)లో తప్పనిసరి భీమా కవరేజి విభాగంలో ఆకర్షణీయమైన స్థాయిలో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ 7 జీసీసీ దేశాలలో పనిచేస్తుండగా, దక్షిణ భారతదేశంలో మంచి స్థానంలో ఉంది. వివిధ విభాగాలకు చెందిన వైవిధ్యభరితమైన వ్యాపార ప్రోఫైల్‌ను కలిగివుంది. వైద్య పర్యాటక రంగం పెరుగుతుండడంతో ఈ కంపెనీ అధికంగా లాభపడే అవకాశం ఉం‍ది. ఆర్థిక సంవత్సరం 2019-22లో ఈ కంపెనీ రెవెన్యూ ఇబిటా సీఏజీఆర్‌ 13 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.

బ్రోకరేజి: ఎస్‌ఎంసీ గ్లోబల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్
పాలికాబ్ ఇండియా: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ 874 | రిటర్న్‌: 21 శాతం
పాలికాబ్ భారతదేశంలో అతిపెద్ద వైర్లు, కేబుల్స్ (డబ్ల్యూ అండ్ సీ) తయారీ కంపెనీ. ఈ కంపెనీ వ్యవస్థీకృత రంగంలో 18 శాతం మార్కెట్ వాటాను, మొత్తంగా 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. గత ఐదేళ్లలో, సంస్థ వేగంగా కదిలే ఎలక్ట్రిక్ వస్తువుల (ఎఫ్‌ఎమ్‌ఈజీ) విభాగంలోకి ప్రవేశించింది.
  వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్, బ్రాండ్ ఇమేజ్‌ మెరుగుపడడం, నగదు ప్రవాహాలను నిర్వహించడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో కంపెనీ మంచి స్థాయిలో ఉంది. ఈ పరిశ్రమలో భారీ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాం. డబ్ల్యూ అండ్ సీ విభాగంలో స్థిరమైన పనితీరు, ఎఫ్‌ఎంఈజీ విభాగంలో లాభదాయకతను మెరుగుపరచడం వంటి అంశాలను మేము పరిగణలోకి తీసుకున్నాం.  

బ్రోకరేజి: బీపీ వెల్త్
ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌(ఎఫ్‌ఓఐఎల్‌): కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ. 2,141 | రిటర్న్‌: 10 శాతం
  స్లిప్ ఎడిటివ్‌ విభాగంలో ప్రపంచ నాయకత్వ స్థానంలో ఈ కంపెనీ వుంది. గ్రీన్‌ ఎడిటివ్‌ విభాగంలో మంచి స్థానంలో వుంది. కంపెనీ ప్రణాళికాబద్ధమైన సామర్థ్య విస్తరణ, ఆహార పరిశ్రమ నుంచి గ్రీన్‌ ఎడిటివ్‌ డిమాండ్‌ పెరుగుతుండడం, కస్టమర్ ప్రాధాన్యతలను మార్చడం, వాల్యూమ్ వృద్ధి వంటి అంశాల వలన ఈ కంపెనీ మంచి ప్రధర్శనను చేస్తుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 19-22ఈ లో, ఎఫ్‌ఓఐఎల్‌ రిటర్న్‌ /ఎబిట్డా / ప్యాట్‌ సీఏజీఆర్‌  17.4 శాతం / 16.7 శాతం / 24.4 శాతం గా ఉంటుందని అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా రిటర్న్‌ రేషియో 30 శాతం పోస్ట్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం.

బ్రోకరేజ్: ఇన్వెస్టెక్
ముత్తూట్ ఫైనాన్స్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ. 770 | రిటర్న్‌: 14 శాతం
ఆర్థిక సంవత్సరం 13-18 (డీమోనిటైజేషన్, నియంత్రణలు, బంగారు ధరలు)లో అనేక సవాళ్లను 
భారతీయ గోల్డ్ ఫైనాన్షియర్‌లు ఎదుర్కొన్నారు. కాగా ఆర్థిక సంవత్సరం 2019లో బంగారు ధరల పెరగడం, ఎన్‌బీఎఫ్‌సీల ద్రవ్య సమస్యలు నేపథ్యంలో మెరుగైన వృద్ధిని సాధించడం గమనార్హం. ఈ రెండు సమస్యలు చక్రీయమైనవి. అంతేకాకుండా గోల్డ్ ఫైనాన్స్ వ్యవస్థలో బాగా చొచ్చుకుపోవడంతో, మధ్యస్థ కాలంలో వృద్ధి 10 శాతం సీఏజీఆర్‌ ఉంటుందని మేము అంచనావేస్తున్నాం.అధిక లాభదాయకత, జాగ్రత్తగా వివిధ విభాగాలకు మారుతుండడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

బ్రోకరేజి: ఇండెసెక్ సెక్యూరిటీస్
నోసిల్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .141 | రిటర్న్‌: 23 శాతం
పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పులను ఉపయోగించుకోవటానికి, ఇతర కంపెనీలతో పోలిస్తే తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంలో నోసిల్ మంచి స్థితిలో ఉందని అంచనావేస్తున్నాం. టైర్ కంపెనీలు తమ సామర్ధ్యాన్ని విస్తరించుకోవడం, రేడియల్ టైర్ల వైపు మారుతుండడం(బయాస్ టైర్లతో పోలిస్తే ~ 1.3x-1.4x రబ్బరు రసాయనాలు అవసరం), ఈ కంపెనీకి పోటిగా ప్రధాన కంపెనీలేవి తమ సామర్ధ్యాన్ని విస్తరించక పోవడం వంటి కారణాల వలన ఈ కంపెనీ బలంగా ఉంది. అంతేకాకుండా చైనాపై అమెరికా విధించిన సుంకాల వలన నోసిల్‌ భారీ స్థాయిలో లాభపడే అవకాశం ఉంది. కాగా ఈ కంపెనీ కోరిన యాంటీ డంపింగ్ డ్యూటీ ఎక్స్‌టెన్షన్ పరిస్థితి వలన కొంత ప్రతికూలతను స్వల్పకాలానికి గాను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికి ఈ కంపెనీపై పాజిటివ్‌గా ఉన్నాం. 

బ్రోకరేజి: జె‍ఫ్ఫరీస్‌
ఫినోలెక్స్ ఇండస్ట్రీస్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .690 | రిటర్న్‌: 11 శాతం
సుప్రీం ఇండస్ట్రీస్: కొనచ్చు |  టార్గెట్‌ ధర: రూ .1,350 | రిటర్న్‌: 10 శాతం
  వ్యవసాయం, గృహ, మౌలికరంగాలపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కలిగివుండడంతో భారతీయ పైపుల పరిశ్రమ మంచి ప్రదర్శనను చేసే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యవస్థలో ఈ కంపెనీల అమ్మకాలు బాగుండడంతో వీటిపై బుల్లిష్‌గా ఉన్నాం. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ (టార్గెట్ ధర రూ .690),  సుప్రీం ఇండస్ట్రీస్ (టార్గెట్ ధర రూ .1,350) పై కొనచ్చు కాల్‌ను కలిగివున్నాం. విభిన్నమైన విలువాధారిత విభాగాలలో(ప్యాకేజింగ్, వినియోగదారుల ఉత్పత్తులు, సీపీవీసీ పైపులు మొదలైనవి)​ఈ కంపెనీలు కీలకంగా వున్నాయి. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌లు పాజిటివ్‌

Monday 21st October 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను శనివారం విడుదల చేసింది. ఇతర మార్గాల నుంచి ఆదాయాలు అధికంగా రావడం, స్థిరమైన రుణ వృద్ధి కారణంగా ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. దీంతో ఈ బ్యాంక్‌ షేర్లకు అనలిస్టులు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించారు. ఇక బ్యాంకు ఈ క్యూ2లో రూ.6, 638 కోట్ల నికరలాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన

అల్ట్రాటెక్‌ నికర లాభం 72 శాతం వృద్ధి

Monday 21st October 2019

 ఆదిత్యా బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికరలాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గతేడాది ఇదేకాలంలో నమోదైన రూ. 371 కోట్ల నికరలాభంతో పోలిస్తే, ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 639 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 8710 కోట్ల నుంచి రూ. 9129 కోట్లకు వృద్ధిచెందినట్లు కంపెనీ సోమవారం వెల్లడించిన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. ఇబిటా 29

Most from this category