News


హెచ్‌డీఐఎల్‌ .. లోయర్‌ సర్క్యూట్‌ !

Monday 30th September 2019
Markets_main1569833023.png-28627

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు సంక్షోభానికి కారణమైనట్లు భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. బ్యాంకు మొత్తం రుణ ఆస్తుల్లో ఈ వాటా 73శాతంగా ఉంది. ఫలితంగా హెచ్‌డీఐల్‌ షేర్లు క్రితం ట్రేడింగ్‌ (రూ.4.20)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.4.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన క్షణాల్లో షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.70లు రూ.4.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఐదేళ్ల కనిష్ఠానికి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌..30 శాతం క్రాష్‌

Monday 30th September 2019

ప్రమోటర్లు నిధుల్ని తరలించారని, ఇతర ఆర్థిక అవకతవకాలకు పాల్పడ్డారంటూ ఒక ఎన్‌జీఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపణల్ని పరిశీలించాలంటూ ఢీల్లీ హైకోర్టు నిర్ణయించడంతో సోమవారం ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిలువునా పతనమయ్యింది.  మధ్యాహ్నం 2.32 సమయానికి 30.86 శాతం లేదా రూ. 120.40 కోల్పోయి ఐదేళ్ల కనిష్టస్థాయి రూ. 269.70  వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో రూ. 240.05 వద్ద ఏడాది కనిష్ఠానికి పడిపోయిన ఈ షేరు,

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: గంటలో 8 శాతం షేర్లకు బిడ్స్‌

Monday 30th September 2019

  ప్రభుత్వ సంస్థయిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ(ఇనిసియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ రోజు ప్రారంభమయ్యింది. ప్రారంభమైన మొదటి గంటలోనే మొత్తం ఇష్యు చేసిన షేర్లలో 8 శాతం షేర్లకు బిడ్లు దాఖలు ఖావడం గమనార్హం. ఐఆర్‌సీటీసీ, ఐపీఓలో మొత్తం 2,01,60,000 షేర్లను అందుబాటులోకి తీసుకురాగా, ఉదయం 11 గంటల సమయానికి 16,06,560 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ధర పరిధిని షేరుకు రూ. 315- 320 వద్ద ఐఆర్‌సీటీసీ నిర్ణయించిన విషయం

Most from this category