News


సూచీలకు దన్నుగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

Tuesday 6th August 2019
Markets_main1565086629.png-27581

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ మంగళవారం సూచీలకు కలిసొచ్చింది. ఇరు కంపెనీలు క్యూ1లో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, నిన్నటి ట్రేడింగ్‌లో  అమ్మకాల ఒత్తిడికి లోనైన నేపథ్యంలో ట్రేడర్లు నేడు ఈ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ పూనుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంక్‌ దాదాపు అరశాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 85 పాయింట్లలో ఒక హెచ్‌డీఎఫ్‌సీ వాటా 14.51 పాయింట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా 5.50 పాయింట్లు కావడం విశేషం. 
హెచ్‌డీఎఫ్‌సీ:- నేడు బీఎస్‌ఈలో రూ.2147.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి స్థిరమైన ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఒక దశలో 3శాతం పెరిగి రూ.2216.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ ముగిసే సరికి 1.50శాతం లాభంతో రూ.2186.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1646.00  రూ.2357.00లుగా నమోదయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- నేడు బీఎస్‌ఈలో రూ.2168.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి స్థిరమైన ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఒక దశలో 1.50శాతం పెరిగి రూ.2209.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ ముగిసే సరికి 0.50 శాతం లాభంతో రూ.2188.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1884.40, రూ.2502.90లుగా నమోదయ్యాయి.



You may be interested

లాభాల ముగింపు

Tuesday 6th August 2019

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు 277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీ నష్టాల్ని చవిచూసిన దేశీయం ఈక్విటీ మార్కెట్‌ మం‍గళవారం లాభంతో ముగిసింది. మార్కెట్‌ నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో చౌకగా లభిస్తున్న షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 277 పాయింట్లు పెరిగి 36,976.85 వద్ద, నిఫ్టీ 85.70 లాభపడి 10,948.30 వద్ద ముగిసిం‍ది. గత రాత్రి అమెరికా, ఈ రోజు ఉదయం ఆసియా మార్కెట్ల పతనంతో నేడు మార్కెట్‌ నష్టాలతో ప్రారంభైనన్పటికీ వెనువెంటనే

టైటాన్‌ లాభం..రూ. 370.7 కోట్లు

Tuesday 6th August 2019

టైటాన్ కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ .370.7 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ లాభాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ప్రకటించిన స్టాండ్‌ ఎలోన్‌ లాభం రూ. 349.2 కోట్ల కంటే 6.2 శాతం అధికం కావడం గమనర్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .4,319 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం, ఈ జూన్‌ త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రూ .4,939.7 కోట్లకు

Most from this category