News


వచ్చే వారంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.5వేల కోట్ల సమీకరణ

Saturday 4th January 2020
news_main1578132743.png-30680

దేశీయ అతిపెద్ద తనఖా రుణదాత సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ భారీ రుణ సేకరణకు సిద్ధమైంది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో ముఖ విలువ రూ.10లక్షలు కలిగిన సెక్యూర్డ్‌ రీడమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూను జారీ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్చ్సేంజీలకు శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఇష్యూ మంగళవారం(జనవరి 07)  ప్రారంభమై అదే రోజున ముగుస్తుంది. తద్వారా మొత్తం రూ.5000 కోట్లను సమీకరించనున్నట్లు పేర్కోంది. బాండ్‌ ఇష్యూ పరిణామం రూ.3వేల కోట్లుగా, కాగా ఓవర్సబ్‌స్క్రిప్షన్‌ను రూ.2వేల కోట్లకు వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఐదేళ్ల కాలానికి మెచ్యూరిటి అయ్యే ఈ బాండ్లపై కూపన్‌ రేటును ఏడాదికి 7.50శాతంగా నిర్ణయించింది. ధీర్ఘకాలిక మూలధన నిధులను పెంచుకునేందుకు, కంపెనీ వ్యాపార విస్తరణ, కార్పోరేట్‌ అవసరాల దృష్ట్యా ఈ మొత్తం రుణాన్ని సమీకరిస్తున్నట్లు తెలిపింది. ఇష్యూలో జారీ చేస్తున్న బాం‍డ్లకు  ప్రముఖ రేటింగ్‌ సంస్థలు ఇక్రా, క్రిసెల్‌ బాం‍డ్లకు ఎఎఎ రేటింగ్‌ కేటాయించారు. ఇష్యూకు యాక్సిస్‌ బ్యాంక్‌ లీడ్‌ మేనేజర్‌ వ్యవహరించనుంది. 



You may be interested

అస్థిరతలను తోసిపుచ్చలేం: మనాలి భాటియా

Sunday 5th January 2020

గతేడాది మార్కెట్లకు మొత్తం మీద లాభదాయకంగానే ముగిసింది. నిఫ్టీ-50 నికరంగా 1,300 పాయింట్లు లాభపడింది. ఎన్ని కరెక్షన్లు చోటు చేసుకున్నా బుల్స్‌ ఆధిపత్యం కొనసాగింది. అయితే, 2020లోనూ మార్కెట్లలో ఇదే ధోరణి కొనసాగవచ్చని, అయితే అస్థిరతలను తోసిపుచ్చలేమని రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మార్కెట్లలో మరిన్ని గరిష్టాలను చూసే అవకాశం ఉందన్నారు. అయితే, ఆ ప్రయాణం అంత సాఫీగా

అల్ట్రాటెక్‌, ఎల్‌అండ్‌టీ కొనొచ్చు!

Saturday 4th January 2020

ఈ కేలండర్‌ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత వృద్ధి చూపనున్నట్లు పలు బ్రోకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది మార్కెట్లు మంచి రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ర్యాలీ ఇతర కౌంటర్లకూ విసర్తిస్తున్న సంకేతాలు మార్కెట్లలో కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులలో దేశీ బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌.. సిమెంట్‌ రంగ దిగ్గజం అల్ట్రాటెక్‌ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది.

Most from this category