News


క్యూ3 ఎఫెక్ట్‌- హెచ్‌డీఎఫ్‌సీ ప్లస్‌లో

Tuesday 28th January 2020
Markets_main1580183909.png-31255

1.5 శాతం బలపడిన షేరు
4 రెట్లు పెరిగిన నికర లాభం 

మార్టిగేజ్‌ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక​సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 4 రెట్లు జంప్‌చేసి రూ. 8,372 కోట్లను తాకింది. బంధన్‌ బ్యాంక్‌కు గృహ ఫైనాన్స్‌ విక్రయం నేపథ్యంలో రూ. 9020 కోట్లమేర అదనపు లాభం​ఆర్జించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. మొత్తం ఆదాయం సైతం 92 శాతం ఎగసి రూ. 20,285 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతంపైగా పెరిగి రూ. 2958 కోట్లను తాకింది. ప్రొవిజన్లు రూ. 2995 కోట్లుగా నమోదయ్యాయి. సోమవారం మార్కెట్లు ముగిశాక హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు విడుదల చేసింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం బలపడింది. రూ. 2438 వరకూ ఎగసింది. తదుపరి స్వల్ప వెనకడుగుతో 1.25 శాతం లాభంతో రూ. 2425 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లో రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా!?

Tuesday 28th January 2020

ఆప్‌టెక్‌ షేర్ల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడారన్న ఆరోపణలకుగాను బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలాపై సెబి డేగకన్ను వేసింది. ఈ వ్యవహారంలో ఆప్‌టెక్‌ బోర్డుమెంబర్లైన రమేశ్‌ దమానీ, మధు జయకుమార్‌ తదితరుల పాత్రపై కూడా సెబి పరిశీలన జరపనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రశ్నించేందుకు ఈ నెల 24న రాకేశ్‌ను ఆయన భార్య రేఖను, సోదరుడు రాజేశ్‌ కుమార్‌ను, అత్త సుశీలాదేవీ గుప్తాను సెబి పిలిపించిందని ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది.

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 28th January 2020

మారుతి సజుకీ, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సెల్యూషన్స్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కుమ్మిన్స్‌ ఇండియా, కెమో ఫార్మా ల్యాబ్స్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ సర్వీసెస​, మణప్పురం ఫైనాన్స్‌, మెస్టేక్‌, రామ్‌కో సిస్టమ్స్‌లతో పాటు సుమారు 65 కంపెనీలు నేడు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category