News


హెచ్‌డీఎఫ్‌సీ...ఆల్‌టైమ్‌ హై

Monday 1st July 2019
Markets_main1561968525.png-26714

ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో దాదాపు 2.20శాతం ర్యాలీ చేసి రూ.2240.00ల స్థాయిని అందుకున్నాయి. ఈ ధర(రూ.2240.00) షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.1:20నిల.కు షేరు గతముగింపు(రూ.2,192.10)తో పోలిస్తే 2.18శాతం లాభపడి రూ. 2,239.95ల వద్ద ట్రేడ్‌  అవుతోంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు ఆల్‌టైం హైని తాకడంతో నిఫ్టీ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ ఆర్జించిన మొత్తం 70పాయింట్లలో ఈ ఒక్క షేరువే 17.13 పాయింట్లు కావడం విశేషం. అలాగే ఇదే గ్రూప్‌నకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 1.50శాతం పెరిగాయి. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ హౌసింగ్‌ సంస్థ సీఎస్‌ఎల్‌ఏ... షేర్ల టార్గెట్‌ ధరను పెంచడం ఇందుకు కారణమైంది.

ఇదే సమయానికి.., నిఫ్టీ 75పాయింట్లు లాభపడి 11,863.15 వద్ద, సెన్సెక్స్‌ 278 పాయింట్లు పెరిగి 39,672.76 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

తగ్గిన మారుతి అమ్మకాలు

Monday 1st July 2019

మారుతి సుజుకీ ఇండియా(ఎమ్‌ఎస్‌ఐ) జూన్‌ నెల అమ్మకాలు 14 శాతం మేర తగ్గాయి. గత ఏడాది జూన్‌లో 1,44,981 యూనిట్ల అమ్మకాలు జరగగా ఈ ఏడాది జూన్‌లో 1,24,708 యూనిట్లు అమ్మకాలు జరిగాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో కంపెనీ పేర్కొంది. దేశియ అమ్మకాలు 15.3 శాతం తగ్గి 1,35,662 యూనిట్ల నుంచి 1,14,861 యూనిట్లకు పడిపోయాయి. మిని సెగ్మెంట్‌లో  కాంప్రైజింగ్‌ ఆల్టో, ఓల్డ్‌ వ్యాగన్‌ ఆర్‌ల అమ్మకాలు 36.2 శాతం తగ్గి

అమ్మకానికి అనిల్‌ అంబాని హెడ్‌ క్వార్టర్స్‌: భారీ నష్టాల్లో షేర్లు

Monday 1st July 2019

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబాని హెడ్‌క్వార్టర్స్‌ను అమ్మకానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అనిల్‌ అంబాని ముంబైలో వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని శాంటాక్రూజ్‌ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పెరిగిన రుణభారాల్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా కంపెనీ 7లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఈ భవన సముదాయాన్ని విక్రయం లేదా ధీర్ఘకాలికానికి లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌తో పాటు

Most from this category